
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం విహార యాత్రలో ఉన్నాడు. భార్య, కూతురితో కలిసి ఇటలీ వెళ్లాడు. అలాంటిది ఇప్పుడు వీడియో కాల్‌లో కొందరికీ క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది. అసలేం జరిగింది? చరణ్ ఎందుకు సారీ చెప్పాడనేది ఇప్పుడు చూద్దాం.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న 28 సినిమాలు)
ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. దీనితో పాటు ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే చిత్రబృందం ఎప్పటికప్పుడు ఏదో కార్యక్రమానికి హాజరవుతూనే ఉంది. తాజాగా మన దేశంలో జర్మనీ యూనిటీ డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరిగాయి. 'ఆర్ఆర్ఆర్' టీమ్ తరఫున కీరవాణి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి.. నాటు నాటు పాటని జర్మనీలో పాడారు. దీనికి వేడుకలో ఉన్న జర్మనీ ఎంబసీ అధికారులందరూ డ్యాన్స్ కూడా చేశారు. అయితే తాను వ్యక్తిగత పనుల మీద ఇటలీ వెళ్లానని, తను రాలేకపోయినందుకు క్షమాపణలు చెబుతున్నానని వీడియో కాల్‌లో రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. ఇక సినిమాల విషయానికొస్తే.. చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఇది విడుదల కానుంది.
(ఇదీ చదవండి: చిన్నప్పటి ఫ్రెండ్ కోసం కదిలొచ్చిన చిరంజీవి.. స్వయంగా ఆస్పత్రికి వెళ్లి!)
Comments
Please login to add a commentAdd a comment