ఇంతకన్నా ఏం కావాలి.. ఆర్ఆర్ఆర్ క్రేజ్ గురించి చెప్పడానికి! | Japanese mom creates RRR flip book her 7 year old son | Sakshi
Sakshi News home page

RRR Movie: జపాన్‌లో ఆర్ఆర్ఆర్‌ క్రేజ్.. కుమారుని కోసం ఏకంగా!

Mar 27 2023 7:00 PM | Updated on Mar 27 2023 7:15 PM

Japanese mom creates RRR flip book her 7 year old son  - Sakshi

తెలుగోడి సత్తాను ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం వరల్డ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. విదేశాల్లోనూ రికార్డ్‌ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా జపాన్‌లో ఆర్ఆర్ఆర్ క్రేజ్‌ మామూలుగా లేదు.  దేశవ్యాప్తంగా రికార్డ్ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం జపాన్‌లోనూ అదరగొట్టిన సంగతి తెలిసిందే. అక్కడి అభిమానులను ఆర్ఆర్ఆర్ విపరీతంగా ఆకట్టుకుంది. అక్టోబర్ 21న జపాన్‌లో విడుదలై 'ఆర్ఆర్ఆర్' రికార్డులు సృష్టించింది. 24ఏళ్ల క్రితం జపాన్‌లో రిలీజ్‌ అయిన రజనీకాంత్‌ ‘ముత్తు’ సినిమా రికార్డ్ వసూళ్లను బద్దలు కొట్టింది. ఇటీవలే  అమెరికాలోని లాస్‌ ఎంజిల్స్‌లో జరిగిన 95వ ఆస్కార్ వేడుకల్లో నాటు నాటు పాటకు అవార్డ్ దక్కింది.

అయితే తాజాగా జపాన్‌లో ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. జపాన్‌కు ఓ అభిమాని తన కుమారుని కోసం అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని అర్థమయ్యేలా ఓ తల్లి ఏకంగా ఈ సినిమా బొమ్మలతో కూడిన స్టోరీ బుక్‌ను రూపొందించింది. కామిక్ బొమ్మల రూపంలో తయారు చేసిన ఆ బుక్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ బుక్ చూస్తుంటే ఇండియాలోనే కాదు.. విదేశాల్లోనూ ఆర్ఆర్ఆర్‌కు ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement