దివంగత ప్రముఖ నటుడు ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘మన దేశం’ 75 సంవత్సరాలు (1949 నవంబర్ 24న ఈ చిత్రం విడుదలైంది) పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈæ సందర్భంగా ఈ నెల 14న తెలుగు చిత్ర పరిశ్రమ ఓ వేడుక జరపనుంది.
ఈ వేడుక ఏర్పాట్లు గురించి చర్చించడానికి శుక్రవారం హైదరాబాద్‌లోని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కార్యాలయంలో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, తెలంగాణ స్టేట్ చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎం΄్లాయిస్ ఫెడరేషన్, తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్, తెలుగు సినీ దర్శకుల సంఘం ప్రతినిధులు కలిశారు. ఈ వేడుకలో పలువురు సినీ నిర్మాతలు, సినీ ప్రదర్శకులు, పంపిణీదారులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొంటారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment