పుష్ప2 రికార్డుల మోత కొనసాగుతూనే ఉంది. ఫస్ట్ వీకెండ్‌లో ఇంత వరకు ఎవరూ సాధించలేని కలెక్షన్లను పుష్ప2 నమోదు చేసింది. విడుదల రోజు నుంచి మొదలైన ఈ జాతర ఎక్కడ వరకు కొనసాగుతుందో ఊహించడం కాస్త కష్టమేనని చెప్పవచ్చు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు 'పుష్ప'గాడి రూల్ ఏలా ఉంటుందో బాక్సాఫీస్ లెక్కలతో చూపిస్తున్నాడు. ఒక రికార్డు పోస్టర్ వేసేలోగా ఇంకో రికార్డు క్రియేట్ చేస్తూ.. అల్లు అర్జున్ సత్తా చాటుతున్నాడు.
అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప2 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మొదటి వీకెండ్‌లోని కేవలం నాలుగురోజుల్లో రూ. 829 కోట్లు రాబట్టి భారీ రికార్డ్‌ను సెట్ చేసింది. ఇప్పటి వరకు ఫస్ట్ వీకెండ్‌లో కేజీఎఫ్2 రూ.442 కోట్ల గ్రాస్ రాబట్టి టాప్ ప్లేస్‌లో ఉండేది. ఇప్పుడు ఆ రికార్డ్‌ను పుష్ప అందుకున్నాడు. ఇలా రికార్డ్ ఏదైనా సరే అంటూ బాక్సాఫీస్ వద్ద ఊచకోత మొదలెట్టాడు. ఇప్పటి వరకు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఉన్న రికార్డ్స్ అన్నీ పుష్ప దెబ్బకు తుడిచిపెట్టుకుపోయాయి.
అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో సూపర్ హిట్ సినిమాగా పుష్ప2 ఉండనుంది. తొలిరోజు రూ.294 కోట్లు వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం డిసెంబర్ 8 ఆదివారంతో మొదటి వీకెండ్ పూర్తి చేసుకుంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 829 కోట్లు రాబట్టి పలు రాష్ట్రాల్లోనూ అనేక రికార్డులను నెలకొల్పింది. మొదటి వారం పూర్తి అయ్యే సరికి కేవలం బాలీవుడ్‌లోనే రూ. 291 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించి ఎవరూ అందుకోలేనంత రేంజ్‌లో రికార్డ్‌ను సెట్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment