హమ్మయ్యా.. 'పుష్ప 2' షూటింగ్ ఇన్నాళ్లకు పూర్తి | Allu Arjun Pushpa 2 Movie Shooting Completed Finally | Sakshi
Sakshi News home page

Pushpa 2: రిలీజ్‌కి 8 రోజుల ముందు షూటింగ్ కంప్లీట్

Nov 26 2024 6:13 PM | Updated on Nov 26 2024 6:30 PM

Allu Arjun Pushpa 2 Movie Shooting Completed Finally

డిసెంబరు 5న 'పుష్ప 2' సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. లెక్క ప్రకారం ఈ పాటికే పనులన్నీ పూర్తయిపోవాలి. కానీ ఇప్పటివరకు షూటింగ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా అల్లు అర్జున్.. అంతా పూర్తయిందని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టడంతో అందరికీ క్లారిటీ వచ్చింది.

'లాస్ట్ డే లాస్ట్ షాట్ ఆఫ్ పుష్ప. ఐదేళ్ల ఈ ప్రయాణం పూర్తయింది. వాట్ ఏ జర్నీ' అని అల్లు అర్జున్ రాసుకొచ్చాడు. ఓ ఫొటో పోస్ట్ చేయగా అది ఏదో పెళ్లి జరుగుతున్నట్లు ఉంది. ఇదివరకే ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ సహా అన్ని పూర్తయ్యాయని చెప్పారు. మరో ఒకటి రెండు రోజుల్లో సెకండాఫ్ కూడా పూర్తిచేసి సెన్సార్‌కి పంపించాల్సి ఉంటుంది.

(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చిన అక్కినేని అఖిల్)

ఇదిలా ఉండగా 'పుష్ప 2' మూవీ నిడివి లాక్ అయిందని.. ఏకంగా 3 గంటల 21 నిమిషాల రన్ టైమ్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా నవంబర్ 30న టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ రెండు విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

'పుష్ప' సినిమా 2021 డిసెంబరు 17న రిలీజ్ కాగా.. దాదాపు మూడేళ్ల తర్వాత 'పుష్ప 2' థియేటర్లలో రాబోతుంది. తొలి పార్ట్ వచ్చినప్పుడు ఎవరికీ పెద్ద అంచనాల్లేవ్. కానీ అనుహ్యంగా పాన్ ఇండియా లెవల్లో సూపర్ అయింది. దీంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రూ.1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగినట్లు టాక్.

(ఇదీ చదవండి: 'పుష్ప' నటుడు శ్రీ తేజ్‌పై పోలీసు కేసు)

Advertisement
 
Advertisement
Advertisement