'మీరు ఒక చాట్ జీపీటీ సార్‌'.. అల్లు అ‍ర్జున్‌పై శ్రీలీల ప్రశంసలు | Tollywood Heroine Sreeleela Comments On Working With Allu Arjun In Kissik Song, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Sreeleela: 'మీరు ఒక చాట్ జీపీటీ సార్‌'.. అల్లు అ‍ర్జున్‌పై శ్రీలీల ప్రశంసలు

Published Sun, Nov 24 2024 9:20 PM | Last Updated on Mon, Nov 25 2024 4:17 PM

Tollywood Heroine Sreeleela Comments works With Allu Arjun In Kissik Song

ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప పేరే వినిపిస్తోంది. ఇటీవల పుష్ప-2 ట్రైలర్‌ రిలీజ్‌ కాగా.. మూవీ కోసం ఎప్పుడెప్పుడా అంటూ రోజులు లెక్క పెడుతున్నారు ఫ్యాన్స్‌. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుకుమార్‌- అల్లు అర్జున్‌ కాంబోలో వచ్చిన పుష్ప బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ మూవీకి సీక్వెల్‌గా పుష్ప-2 ది రూల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ ఐటమ్ సాంగ్‌ను విడుదల చేశారు. కిస్సిక్‌ పేరుతో విడుదలైన పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. చెన్నైలోని లియో ముత్తు ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఈవెంట్‌లో కిస్సిక్‌ లిరికల్ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీలీల తన అనుభవాలను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. తమిళంలో మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

(ఇది చదవండి: అల్లు అర్జున్‌ పుష్ప-2.. శ్రీలీల కిస్సిక్ ఫుల్ సాంగ్ వచ్చేసింది)

ఈవెంట్‌లో హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ..' అల్లు అర్జున్‌తో డ్యాన్స్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సెట్స్‌లో ఆయన చాలా ఫన్‌గా ఉంటారు. నాకు మొదట కొంచెం భయంగా అనిపించింది. కానీ బన్నీ సార్‌తో మాట్లాడాక ఆ భయం పోయింది. మీరు ఒక చాట్ జీపీటీ.. అంతేకాదు మీరు ఒక వైబ్ సార్. థ్యాంక్‌ యూ సోమచ్ సార్. అల్లు అర్జున్‌తో డ్యాన్స్‌ అంటే ప్రాక్టీస్ చేయాలి. కానీ నేను సెట్స్‌లో వెళ్లాక అవసరం లేదనిపించింది. నేను ఇక్కడ అల్లు అర్జున్‌ కాదు.. పుష్ప అని చెప్పారు' అంటూ శ్రీలీల ప్రశంసలు కురిపించింది. కాగా ‍పుష్ప-2 ది రూల్ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement