అంతా అనుకున్నట్లే పుష్ప 2 మూవీ రికార్డులను బద్దలు కొడుతోంది. దేశం మొత్తం ఇప్పుడు ఎక్కడ చూసినా .. పుష్ప 2 మూవీ గురించే చర్చిస్తున్నారు. అల్లు అర్జున్ నటన, సుకుమార్ టేకింగ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తొలి రోజు ఏకంగా రూ.294 కోట్ల కలెక్షన్స్ రాబట్టి.. అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అంతటా.. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. సినీ ప్రముఖులంతా ఈ సినిమాను పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఇక ముందు నుంచి కూడా పుష్ప 2 చిత్రానికి తన మద్దతు ప్రకటిస్తున్న ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తాజాగా ఈ మూవీపై తనదైన శైలీలో రివ్యూ ఇచ్చాడు. ‘పుష్ప 2 చిత్రంలోని పుష్ప పాత్రపై నా రివ్యూ’ అంటూ ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ని ఎక్స్(ట్విటర్) షేర్ చేస్తూ.. భారతీయ సినీ చరిత్రలోనే పుష్ప లాంటి పదునైన పాత్రను చూడడం చాలా అరుదని అన్నారు. ఓ స్టార్ హీరో ఇమేజ్‌ని పక్కనపెట్టి పాత్ర కోసం సినిమా చూడడం పుష్ప 2 చిత్రానికి సాధ్యమైందని ప్రశంసించాడు.
‘పుష్ప వంటి పాత్రను చూడటం చాలా అరుదు. ఒక వీక్షకుడిగా నేను సినిమా చూసినప్పుడు నిజంగా పుష్ప లాంటి పాత్ర బయట ఉందని నమ్మాను. ఇలా ఓ కమర్షియల్ ఫార్మాట్‌లో క్రియేట్ చేసిన పాత్రను వాస్తవికతకు దగ్గరగా ఉన్నట్లు చూపించడం అంత సులభతరమైన పని కాదు.
పుష్పరాజు పాత్రలో గమనిస్తే..అమాయకత్వం, చాకచక్యంతో మిళితమై ఉంటాయి. అలాగే దుర్బలత్వంతో కూడిన సూపర్ అహం వంటి అత్యంత విరుద్ధమైన లక్షణాలన్నీ ఈ పాత్రలో కనిపిస్తాయి. వైకల్యంతో ఉన్న వ్యక్తి సూపర్ యాక్షన్ హీరో అవుతాడని నేను ఎప్పుడూ నమ్మలేదు. ఎందుకంటే సూపర్ హీరో అనేవాడు ఫర్ఫెక్ట్‌గా ఉంటాడని మాత్రమే మనం చూశాం. కానీ పుష్ప పాత్రలో అల్లు అర్జున్ ఆ వైకల్యాన్ని శక్తిగా మార్చారు. మునుపెన్నడూ చూడని బాడీ లాంగ్వేజ్,హావభావాలు ఆ పాత్రకు మరింత బలమైన బలాన్ని అందించాయి. ఈ పాత్రని దశాబ్దాల కాలం పాటు ప్రేక్షకుల గుర్తు పెట్టుకుంటారు. అంతేకాదు చాలా మందికి రిఫరెన్స్ పాయింట్‌గా పుష్ప పాత్ర ఉంటుంది.
ఏ నటుడైనా తనకు సంబంధించిన సన్నివేశాల్లో బెస్ట్ ఫెర్మార్మెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఈ పాత్ర కోసం ప్రాణం పెట్టేశాడు. కొన్ని అవాస్తవిక దృశ్యాలు కూడా నిజమైనవిగా అనిపించేంత పరిపూర్ణతను ప్రదర్శించారు. కేవడం బాడీ లాంగ్వేజ్‌తో మాత్రమే కాకుండా ఎమోషన్స్ సీన్లని కూడా ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా నటించాడు. సీఎం సెల్ఫీకి నిరాకరించినప్పుడుకానీ, బాగా తాగి తన అహంకారాని పక్కన పెట్టి సారీ చెప్పే సీన్ కానీ.. అన్నింట్లిలోనూ అద్భుతంగా నటించాడు.ఇది చెప్పడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా.. పుష్పరాజ్ జర్నీని చూస్తూ ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాకా.. ఆ పాత్ర ముందు అల్లు అర్జున్ కూడా చిన్నగా కనిపిస్తాడు’ అని ఆర్జీవీ రాసుకొచ్చాడు.
My REVIEW of the CHARACTER of PUSHPA in #pushpa2
—Ram Gopal Varma
It is extremely rare that Indian films have sharply etched characters and it is even more rare that a star himself will ignore his own image and literally become the character
Seeing…— Ram Gopal Varma (@RGVzoomin) December 7, 2024
Comments
Please login to add a commentAdd a comment