పుష్ప 2 లో ఇక్కత్ పట్టు చొక్కా ధరించిన అల్లు అర్జున్
భూదాన్‌పోచంపల్లి: ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదలై రికార్డులు సృష్టిస్తున్న సుకుమార్ ‘పుష్ప 2’సినిమాలో పోచంపల్లి ఇక్కత్ వస్త్రా లు వెండి తెరపై తళుక్కుమన్నాయి. పోలీస్ ఆఫీసర్ బన్వర్‌సింగ్ షెకావత్‌తో.. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకొన్నావా, పుష్ప అంటే వైల్డ్ ఫైర్’అనే డైలాగ్ చెప్పినప్పుడు.. హీరో అల్లు అర్జున్ బీరపువ్వు రంగు పోచంపల్లి ఇక్కత్ సీకో పట్టు షర్ట్ ధరించాడు.
కాగా పుష్ప 2 సిని మా షూటింగ్‌ను పోచంపల్లిలో మూడు రోజు ల పాటు నిర్వహించారు. ఆ సందర్భంగా పోచంపల్లికి వచి్చన చిత్రం యూనిట్ ఇక్కత్ వ ్రస్తాలు కొనుగోలు చేసి ఉంటారని వస్త్ర వ్యాపారులు తెలిపారు. కాగా పోచంపల్లి మార్కెట్‌లో అల్లు అర్జున్ ధరించిన ఇక్కత్ డిజైన్ చేనేత వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment