‘‘సుకుమార్‌గారితో నా ప్రయాణం 20 ఏళ్ల కిందట మొదలైంది (2004లో వచ్చిన ‘ఆర్య’ సినిమాని ఉద్దేశించి). ఈ రోజు నేను హీరోగా ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం ఆయనే. నన్ను స్టార్‌ను చేసింది సుకుమారే. నా జీవితంలో అత్యధిక భాగం, హీరోగా నా ఎదుగుదల ఆయనకే చెందుతుంది’’ అన్నారు హీరో అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మికా మందన్నా జంటగా నటించిన చిత్రం ‘పుష్ప: ది రూల్’. శ్రీలీల ప్రత్యేక పాటలో నటించారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 5న రిలీజవుతోంది.
శుక్రవారం ముంబైలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతూ–‘‘పుష్ప: ది రూల్’ విషయంలో నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది నిర్మాతలకు. వాళ్ల సపోర్ట్ లేక΄ోతే ఈ సినిమా సాధ్యపడేది కాదు. మా చిత్రాన్ని బాలీవుడ్‌లో విడుదల చేస్తున్న అనిల్ తడాని, భరత్ భూషణ్‌లకు థ్యాంక్స్. నా కెరీర్‌లో ఎన్నో సూపర్‌హిట్ సాంగ్స్ ఇచ్చిన దేవిశ్రీకి ధన్యవాదాలు. ఫాహద్ ఫాజిల్‌తో పని చేయడం గొప్పగా ఉంది. రష్మిక, శ్రీలీలతో పని చేయడం సంతోషంగా ఉంది. ప్రపంచంలో ప్రతి ఇండియన్ మా సినిమా విడుదలను సెలబ్రేట్ చేయడం ఎంతో హ్యాపీగా ఉంది’’ అని చెప్పారు.
‘‘ఐదేళ్ల ‘పుష్ప’ ప్రయాణంలో ఎన్నో భావోద్వేగాలున్నాయి. అల్లు అర్జున్‌గారితో తొలి అవకాశం రాగానే చాలా నెర్వస్ అయ్యాను. కానీ, ఈ రోజు ఆయన ఫ్యామిలీ మెంబర్‌లా ఉన్నాను. సుకుమార్‌లాంటి జీనియస్ దర్శకుడితో పని చేయడం గర్వంగా ఉంది’’ అన్నారు రష్మిక. ‘‘పుష్ప: ది రూల్’ని 12 వేలకు పైగా స్క్రీన్స్‌లో రిలీజ్ చేస్తున్నాం’ అని నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment