ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 మూవీ టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బెనిఫిట్ షోలతో పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల నుంచి బెనిఫిట్ షోలతో పాటు అర్ధరాత్రి 1 షోలకు అనుమతి ఇచ్చినట్లు ఉత్తర్వులో పేర్కొంది.
పుష్ప 2 బెనిఫిట్ షోల టికెట్ ధరలు రూ.800 ఖరారు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ లో బెనిఫిట్ షో లకు ఈ ధరలు వర్తిస్తాయి. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.150, మల్టీఫ్లెక్స్ లో రూ.200లకు టికెట్ ధరను పెంచారు. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.105, మల్టీఫ్లెక్స్ లో రూ.150 పెంపునకు అనుమతి ఇచ్చారు. ఇక డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగల్ స్క్రీన్ లో రూ.20, మల్టీఫ్లెక్స్ లో రూ.50 చొప్పున పెంచుకునేందుకు మేకర్స్‌కి వెసులుబాటు కల్పించింది.
(చదవండి: మెగా హీరో కొత్త సినిమా.. ఓటీటీలోకి ఇంత త్వరగానా?)
ఇక పుష్ప 2 విషయానికొస్తే.. సుకుమార్ -బన్నీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న నాలుగో సినిమా. మూడేళ్ల క్రింద విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన పుష్ప చిత్రానికి సీక్వెల్ ఇది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా.. ఫాహద్ ఫాజిల్ మరో కీలక పాత్ర పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment