రిస్క్‌ చేస్తున్న ‘రంగస్థలం’ టీం.! | Ram charan Rangasthalam Runtime | Sakshi
Sakshi News home page

Published Sat, Mar 17 2018 12:32 PM | Last Updated on Sat, Mar 17 2018 4:30 PM

Ram charan Rangasthalam Runtime - Sakshi

రంగస్థలం సినిమాలో రామ్‌ చరణ్‌

మెగా పవర్‌ స్టార్ రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం రంగస్థలం. క్రియేటివ్‌ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. రామ్‌ చరణ్‌ తొలిసారిగా పల్లెటూరి యువకుడి పాత్రలో నటిస్తున్న ఈ సినిమా 1985 నాటి కథతో పీరియాడిక్‌ జానర్‌లో తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమా నిడివి 2 గంటల 50 నిమిషాలుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇంత నిడివితో సినిమా అంటే రిస్క్‌ అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం ఆడియన్స్‌ లెంగ్తీ సినిమాలను చూసేందుకు పెద్దగా ఇంట్రస్ట్‌ చూపించటం లేదు. మరి రంగస్థలం టీం ఈ విషయంలో మరోసారి ఆలోచిస్తుందో లేక.. అంత డ్యూరేషన్‌తోనూ సక్సెస్‌ సాధిస్తుందో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement