Sankranthiki Vasthunam Movie
-
గ్లామర్‌ను బ్యాలెన్స్ చేస్తూ ఫోటోలు షేర్ చేసిన ఐశ్వర్య రాజేశ్
-
బుల్లి రాజుకు ఫేమ్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలుడి తండ్రి
వెంకటేశ్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam Movie). ఈ ఏడాది పొంగల్ కానుకగా థియేటర్లలో విడుదలైన బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ రావడంతో ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో చిత్ర యూనిట్ ఇటీవల హైదరాబాద్‌లో గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ కూడా నిర్వహించింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీశ్ నిర్మించారు.అయితే ఈ సినిమా ఎంత హిట్టయిందో.. అదే రేంజ్లో ఫేమస్ అయ్యాడు చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ భీమాల. ఈ మూవీ వెంకటేశ్ కుమారుడిగా నటించిన రేవంత్ (బుల్లిరాజు) ప్రేక్షకుల అభిమానం గెలుచుకున్నాడు. తెరపై బుల్లిరాజుగా సినీ ప్రియులను మెప్పించారు. తన మాటలు, డైలాగ్‌లతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. ఇటీవల సక్సెస్ మీట్లోనూ రేవంత్ మరోసారి సందడి చేశారు.బుల్లిరాజు తండ్రి విజ్ఞప్తి..అయితే బుల్లి రాజు ఫేమ్‌ను కొందరు సోషల్ మీడియా వేదికగా దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. రేవంత్ భీమాల పేరిట ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి రాజకీయపరమైన పోస్టులు పెడుతున్నారు. దీంతో ఆ బాలుడి తండ్రి బి శ్రీనివాసరావు అభిమానులకు విజ్ఞప్తి చేశారు. కొద్ది రోజులుగా మా అబ్బాయి పేరిట ఫేక్ అకౌంట్స్ క్రియేట్ ప్రమోషన్స్ కోసం దుర్వినియోగం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. రేవంత్ పేరిట కేవలం ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మాత్రమే ఉందని తెలిపారు. ఏదైనా అధికారిక ప్రకటన ఆ అకౌంట్ నుంచే తెలియజేస్తామన్నారు. అంతేకాదు రేవంత్ పేరిట ఎలాంటి ఫేస్బుక్, ఎక్స్, అకౌంట్స్, యూట్యూబ్ ఛానెల్స్ లేవని తెలిపారు. దయచేసి మా అబ్బాయిని వివాదాల్లోకి లాగొద్దని కోరారు. అంతేకాకుండా రాజకీయాలతో ముడిపెట్టవద్దని శ్రీనివాసరావు ఇన్‌స్టా వేదికగా విజ్ఞప్తి చేశారు. View this post on Instagram A post shared by 𝕽𝖊𝖛𝖆𝖓𝖙𝖍@𝕭𝖚𝖑𝖑𝖎𝖗𝖆𝖏𝖚. (@revanth_bhimala) -
మీనాక్షి.. మీనాక్షి అంటూ ఆరెంజ్ డ్రెస్‌లో గ్లామర్ మెరుపులు (ఫోటోలు)
-
ఐశ్వర్య ఇంట్లోనే కాదు బయట కూడా రౌడీనే..: నటి శ్రీలక్ష్మి
ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh).. అచ్చ తెలుగమ్మాయి. సినిమా ఇండస్ట్రీకి వచ్చి మూడు దశాబ్దాలవుతోంది. రామబంటు చిత్రంతో బాలనటిగా కెరీర్ ఆరంభించింది. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది మాత్రం తమిళ మూవీతోనే! తను ఫస్ట్ హిట్ అందుకున్న మూవీ అట్టకత్తి (2012). తొమ్మిదేళ్లు తమిళంలో హీరోయిన్గా రాణించిన తర్వాత కౌసల్యా కృష్ణమూర్తితో తెలుగువారికి కథానాయికగా పరిచయమైంది.ఎన్నో సినిమాలు..మిస్‌మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్, రిపబ్లిక్, డియర్ వంటి పలు చిత్రాల్లో నటించింది. కానీ తెలుగు ప్రేక్షకుల నుంచి సరైన ఆదరణ అందుకోలేకపోయింది. తెలుగు ప్రేక్షకులు ఎల్లకాలం గుర్తుంచుకునే పాత్ర చేయాలని తహతహలాడింది. ఆ సమయంలో సంక్రాంతికి వస్తున్నాం మూవీ (Sankranthiki Vasthunam Movie) ఆమె ఇంటి తలుపు తట్టింది. సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ భార్యగా, నలుగురు పిల్లల తల్లిగా నటించేందుకు సంతోషంగా అంగీకరించింది. తన కష్టం, ప్రయత్నం వృథా పోలేదు.మేనకోడలి సినిమా..సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఐశ్వర్య రాజేశ్ పోషించిన అమాయకపు భాగ్యమ్మ పాత్ర జనాలకు పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. ఐశ్వర్య సినిమాలో అమాయకురాలైనా ఇంట్లో మాత్రం రౌడీ అంటోంది ఆమె మేనత్త, నటి శ్రీలక్ష్మి (Srilakshmi). సోమవారం నాడు సంక్రాంతికి వస్తున్నాం మూవీ విక్టరీ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. నా మేనకోడలి సినిమా కదా.. తప్పకుండా సినిమా చూసి తీరాలి. లేదంటే నాకు తన్నులు పడతాయి.పైగా బ్లాక్‌బస్టర్ మూవీ.. చూడకుండా ఎలా వదిలేస్తాను. ఐశ్వర్య.. ఇంట్లో, బయటా రౌడీయే అని శ్రీలక్ష్మి సరదాగా చెప్పుకొచ్చింది. కాగా ఐశ్వర్య తండ్రి రాజేశ్ తెలుగులో హీరోగా నటించాడు. 38 ఏళ్ల వయసులోనే ఈయన అనారోగ్యంతో మరణించాడు. నటి శ్రీలక్ష్మి తమ్ముడే రాజేశ్.చదవండి: హీరోయిన్లను ఏడిపించా.. ఓసారి భాగ్యశ్రీని అడగండి: డైరెక్టర్ -
హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)
-
దేవుడా... అడగకుండానే బ్లాక్ బస్టర్ ఇచ్చావ్: వెంకటేశ్
‘‘నేను రికార్డుల గురించి ఆలోచించను. ప్రేక్షకులు సినిమాలను ఆస్వాదించాలి. ఐదు పదేళ్లుగా థియేటర్స్‌లో సినిమాలు చూడనివాళ్లు కూడా థియేటర్స్‌కు వెళ్లి ‘సంక్రాంతికి వస్తున్నాం’ చూశారు. థియేటర్స్ రీ ఓపెనింగ్ జరిగి, అక్కడ కూడా మా సినిమాను ఆడియన్స్ చూశారంటే... ఇది చాలా మంచి సెలబ్రేషన్. అనిల్ అద్భుతమైన వర్క్ చేశాడు. 2027లో మళ్లీ సంక్రాంతికి వస్తాం’’ అని వెంకటేశ్(Venkatesh ) అన్నారు. వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam). ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 14న సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. ఈ సినిమా రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా సోమవారం ‘సంక్రాంతికి వస్తున్నాం విక్టరీ వేడుక’ పేరిట నిర్వహించిన వేడుకలో వెంకటేశ్ మాట్లాడతూ– ‘‘దేవుడా... ఓ మంచి దేవుడా... 1986లో యాక్సిడెంటల్‌గా ఇండస్ట్రీకి వచ్చాను. అడక్కుండానే ‘కలియుగ ΄పాండవులు’ ఇచ్చావ్. ఆ తర్వాత కూడా చాలా హిట్స్ ఇచ్చావ్. మధ్యలో నేను అడగకుండానే ‘చంటి’లాంటి సినిమా ఇచ్చి, అదొక బ్లాక్‌బస్టర్ చేశావ్. దాని తర్వాత అడిగినా అడగకపోయినా.. ప్రేమించుకుందాం రా, ఆడవాళ్ళు..., సీతమ్మ వాకిట్లో.., గణేష్, లక్ష్మీ, తులసీ, రాజా... ఇలా ఎన్నో ఇచ్చావ్. 2000లో ‘కలిసుందాం..రా’ వంటి హిట్ ఇచ్చావ్... నేను అడగలేదు... నువ్వు ఇస్తూనే ఉన్నావ్. ఈసారి 2025లో ఏం అడగకుండానే ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్ ఇచ్చావ్. నా ఊహకు మించి జరిగిపోయింది. అభిమానులు, ప్రేక్షకులు, ఫ్యామిలీ ఆడియన్స్, ఇండస్ట్రీలో ఉన్న అందరూ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నారు. ఈ సినిమాతో అసోసియేట్ అయిన అందరికీ, సినిమా లవర్స్‌కు థ్యాంక్స్. వెంకీ... ఓ క్లీన్ ఎంటర్టైనర్ చేస్తే పెద్ద విజయం సాధిస్తుందని మా గురువు రాఘవేంద్రరావుగారు చెప్పారు. ఆయన ఊహ నిజమైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో బాగా పాల్గొన్నాను.. డ్యాన్స్‌లు చేశాను. ఈ ప్రభావం నా కాలుపై పడింది. ఇక ఉంటాను’’ అన్నారు. ముఖ్య అతిథి దర్శకుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాతో ‘వి’ ఫర్ విక్టరీ’ వెంకటేశ్ సొంతమైంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’... ఇండస్ట్రీకి సంక్రాంతినిచ్చింది. ‘దిల్’ రాజు, అనిల్ కాంబినేషన్లోని ప్రతి సినిమా హిట్’’ అన్నారు. ‘‘రూ. 300 కోట్ల గ్రాస్. నాకు తెలిసి ఈ సినిమా రిలీజ్‌కు ముందు నేను కానీ, తీసిన రాజుగారు కానీ, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్... ఇలా ఎవరికీ ఈ సినిమా ఇంత స్థాయిలో కలెక్ట్ చేస్తుందన్న విషయం అంతు చిక్కి ఉండదు’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘ఈ సినిమా యూనిట్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్... ఇలా అందరికీ థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు శిరీష్. ఈ వేడుకలో దర్శకులు వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, వశిష్ఠ ముఖ్య అతిథులుగా పాల్గొని, సినిమా విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే ‘సంక్రాంతికి వస్తున్నాం’ యూనిట్‌కు షీల్డ్స్ ప్రదానం జరిగింది. -
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ విక్టరీ వేడుక (ఫొటోలు)
-
ఓటీటీకి 'సంక్రాంతికి వస్తున్నాం'.. ఇలాంటి ట్విస్ట్ ఊహించలేదు భయ్యా!
అయితే సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం కోసం ఓటీటీ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓటీటీకి ఎప్పుడొస్తుందా అని నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదలై దాదాపుగా నెల రోజులు కావొస్తోంది. దీంతో సినీ ప్రియులంతా ఓటీటీ రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్కు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ వచ్చేసింది. అయితే ఇక్కడ ఆడియన్స్‌కు బిగ్ ట్విస్టే ఇచ్చారు మేకర్స్. ఇంతకీ అదేంటో చూసేయండిట్విస్ట్ ఇచ్చిన మేకర్స్..అయితే ఓటీటీ రిలీజ్‌పై చిత్రబృందం నుంచి ఇప్పటి వరకైతే ఎలాంటి ప్రకటన రాలేదు. ఫిబ్రవరి రెండో వారంలోనైనా ఓటీటీకి వస్తుందేమోనని సినీ ప్రేక్షకులు భావించారు. కానీ స్ట్రీమింగ్కు సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో కాస్తా నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఆడియన్స్‌కు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.ఓటీటీ రిలీజ్‌పై సస్పెన్స్..త్వరలోనే సంక్రాంతి వస్తున్నాం మీ ముందుకు వస్తుందని జీ తెలుగు ట్విటర్ ద్వారా వెల్లడించింది. మళ్లీ సంక్రాంతికి వైబ్స్‌ను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఫస్ట్ టీవీలో వస్తున్నాం అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఓటీటీ కంటే ముందుగా టీవీలోనే వెంకీమామ సంక్రాంతి బ్లాక్‌బస్టర్ ప్రేక్షకులు చూసే అవకాశం దక్కింది. అయితే ఓటీటీ విడుదలపై మాత్రం ఎలాంటి తేదీని రివీల్ చేయలేదు. ఈ లెక్కను చూస్తే ఈ వారంలోనే టీవీల్లో సంక్రాంతికి వస్తున్నాం సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. Get ready to relive the Sankranthi vibe again 💥😁#SankranthikiVasthunnam Coming Soon On #ZeeTelugu #SankranthiKiVasthunnamOnZeeTelugu#WorldTelevisionPremiereSankranthikiVasthunnam#FirstTVloVasthunnam #TVbeforeOTT #SVonTV@VenkyMama @anilravipudi @aishu_dil @Meenakshiioffl… pic.twitter.com/pIP6UUoNIY— ZEE TELUGU (@ZeeTVTelugu) February 10, 2025 -
'గోదారి గట్టు మీద రామచిలకవే... ' వీడియో సాంగ్ వచ్చేసింది
హీరో వెంకటేశ్ సంక్రాంతి రేసులో విన్నర్‌గా నిలిచారు. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ లీడ్ రోల్స్‌లో నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే, ఈ మూవీకి భారీ బజ్ క్రియేట్ చేసిన ఒక సాంగ్ ఇప్పుడు వీడియో వర్షన్‌ను విడుదల చేశారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించి ఈ చిత్రం జనవరి 14న విడుదలైంది. దర్శకుడు అనిల్ రావిపూడి ప్రమోషనల్ విషయంలో చేసిన మ్యాజిక్‌తో ఈ చిత్రం ప్రేక్షకులకు చేరువైంది. దీంతో బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 310 కోట్లకు పైగానే రాబట్టింది. వెంకీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.‘గోదారి గట్టు మీద రామచిలకవే... గోరింటాకెట్టుకున్న చందమామవే..!’ అంటూ సాగే ఆ పాట సినిమాకు ప్రధాన బలమైంది. ఈ సాంగ్‌కు భాస్కరభట్ల సాహిత్యం అందించగా.. సుమారు 18 ఏళ్ల తర్వాత రమణగోగుల ఆలపించడం విశేషం. ఫిమేల్ లిరిక్స్‌ను మధుప్రియ కూడా చాలా అద్భుతంగా పాడింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ పాట ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆడియో లిరిక్స్ ఇప్పటి వరకు 170 మిలియన్ల మార్క్‌ను దాటింది. థియేటర్స్‌లో ఈ పాటకు ప్రేక్షకులు లేచి మరీ చిందులు వేశారు. ఇప్పటికే యూట్యూబ్, ఇన్‌స్టా రీల్స్‌ను ఓ ఊపు ఊపేసిన ఈ పాటను చాలా మంది రీక్రియేట్ కూడా చేశారు. ఇప్పుడు పూర్తి వీడియో సాంగ్‌ను మీరూ చూసేయండి. -
'సంక్రాంతికి వస్తున్నాం' కలెక్షన్స్.. ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా రికార్డ్
సంక్రాంతి రేసులో భారీ విక్టరీ అందుకున్నారు వెంకటేశ్.. ఆయన నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunam) చిత్రం ఎవరూ ఊహించలేని కలెక్షన్లతో రికార్డులు క్రియేట్ చేస్తుంది. జనవరి 14న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వరద పారిస్తోంది. భారీగా లాభాలు రావడంతో డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్‌ను కూడా తాజాగా హైదరాబాద్‌లో జరిపారు. చాలా ఏళ్ల తర్వాత ఈ చిత్రంతో లాభాలు చూశామని మూవీ పంపిణీదారులు పేర్కొన్నారు. ఏకంగా 20 శాతం పైగా బెన్ఫిట్ పొందామని వారు చెప్పడం విశేషం.తెలుగు చిత్ర పరిశ్రమలో 'సంక్రాంతికి వస్తున్నాం' అదిరిపోయే రికార్డ్ క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద కేవలం 17 రోజుల్లోనే రూ. 303 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. రీజనల్ సినిమాల పరంగా ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా ఈ చిత్రం నిలిచిందని మేకర్స్ ప్రకటించారు. తెలుగులో మాత్రమే విడుదలైన చిత్రాలలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా సంక్రాంతికి వస్తున్నాం రికార్డ్ క్రియేట్ చేసింది. ఓ రీజినల్ (ప్రాంతీయ భాషలో) ఫిల్మ్ అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా ఇప్పటి వరకు గుంటూరు కారం రూ. 212 కోట్ల కలెక్షన్స్‌తో ఉంది. అయితే, ఆ రికార్డ్‌ను వెంకటేశ్ సినిమా ఎప్పుడో దాటేసింది. అయితే, 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా క్రియేట్ చేసిన ఈ రికార్డ్‌ను బ్రేక్ చేయడం అంత సులభం కాదని చెప్పవచ్చు. ఈ విజయం చాలా పాఠాలు నేర్పిందిఊహించని విధంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా చాలా పాఠాలు నేర్పిందని దిల్ రాజ్ తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో ఇలా అన్నారు. ‘‘ఇండస్ట్రీలో బడ్జెట్ కాదు.. కథే ముఖ్యం. మేము కూడా కథలని నమ్ముకుని సినిమాలు నిర్మించాం. కొత్త దర్శకులతో తీసినప్పుడు ఎన్ని విజయాలు వచ్చాయో అందరికీ తెలిసిందే. అయితే కాంబినేషన్స్ అంటూ నాలుగైదేళ్లుగా మేం తడబడుతున్నాం. ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vastunam) హిట్‌తో అనిల్ మళ్లీ మాకు ఒక రహదారి వేసి ఇచ్చాడు. ఈ సక్సెస్ నాకు కూడా చాలా పాఠాలు నేర్పించింది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. -
ఈ సక్సెస్ చాలా పాఠాలు నేర్పింది: ‘దిల్’ రాజు
‘‘ఇండస్ట్రీలో బడ్జెట్ కాదు.. కథే ముఖ్యం. మేము కూడా కథలని నమ్ముకుని సినిమాలు నిర్మించాం. కొత్త దర్శకులతో తీసినప్పుడు ఎన్ని విజయాలు వచ్చాయో అందరికీ తెలిసిందే. అయితే కాంబినేషన్స్ అంటూ నాలుగైదేళ్లుగా మేం తడబడుతున్నాం. ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vastunam) హిట్‌తో అనిల్ మళ్లీ మాకు ఒక రహదారి వేసి ఇచ్చాడు. ఈ సక్సెస్ నాకు కూడా చాలా పాఠాలు నేర్పించింది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు.వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం వహించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘సాధారణంగా డిస్ట్రిబ్యూటర్స్‌కి బ్రేక్ ఈవెన్ అయితేనే సూపర్ హిట్. అయితే వాళ్లు నష్టపోయినప్పుడు కూడా సినిమా సూపర్ హిట్ పోస్టర్స్ పడుతుంటాయి.90 శాతం ఫెయిల్యూర్స్, కేవలం 10 శాతం మాత్రమే సక్సెస్ ఉండే ఇండస్ట్రీ ఇది. 20 ఏళ్లుగా మాతో ప్రయాణం చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్‌కి ధన్యవాదాలు’’ అని చెప్పారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘సంక్రాంతికి వస్తున్నాం’ ఆరు రోజుల్లోనే రూ.100 కోట్లు షేర్ రాబట్టింది. ఓ రీజినల్ ఫిలింకి చూడలేనేమో అనుకున్న రూ. 300 కోట్ల గ్రాస్ నంబర్ మా మూవీతో చూడబోతున్నందుకు హ్యాపీ’’ అని తెలిపారు. ‘‘20 ఏళ్ల క్రితం డిస్ట్రిబ్యూటర్‌కి ఉన్న విలువ ఇప్పుడు లేదు. ఇలాంటి సమయంలో వాళ్లు తలెత్తుకునేలా చేసిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’’ అని శిరీష్ పేర్కొన్నారు. డిస్ట్రిబ్యూటర్స్ సాయికృష్ణ, రాజేశ్, హరి, శోభన్, ఎల్వీఆర్ మాట్లాడారు. -
ఓటీటీలో సంక్రాంతి సినిమాలు.. ఫిబ్రవరిలో మళ్లీ పోటీ
తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి సందర్భంగా విడుదలైన టాప్ సినిమాలు ఫిబ్రవరి నెలలో ఓటీటీకి రానున్నాయి. ఈ సంక్రాంతికి రామ్‌చరణ్ ‘గేమ్ చేంజర్’, బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బిగ్ ప్రాజెక్ట్స్ విడుదలయ్యాయి. అయితే, వీటన్నింటిలో వెంకటేశ్ మూవీనే సంక్రాంతి విన్నర్‌గా నిలిచిందని చెప్పవచ్చు. బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయంలో కూడా ఈ చిత్రమే పైచెయి సాధించింది. ఇప్పుడు మళ్లీ ఈ మూడు సినిమాలు ఓటీటీలో పోటీ పడనున్నాయి.'గేమ్ ఛేంజర్'-- అమెజాన్ ప్రైమ్ రామ్ చరణ్ (Ram Charan), శంకర్ (Shankar) కాంబినేషన్లో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా చిత్రం 'గేమ్ ఛేంజర్'. జనవరి 10న భారీ అంచనాలతో విడుదలైంది. ఈ చిత్రం తొలిరోజే రూ. 186 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాల జాబితాలో గేమ్ ఛేంజర్ (Game Changer) చేరిపోయింది. అయితే, ఫేక్ కలెక్షన్స్ ఇచ్చారంటూ నెట్టింట భారీగా ట్రోల్స్ రావడంతో తరువాతి రోజుల్లో వాటి వివరాలు ప్రకటించలేదు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video) ఫిబ్రవరి 14న గేమ్ ఛేంజర్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.'డాకు మహారాజ్'--నెట్ఫ్లిక్స్నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'డాకు మహారాజ్'(Daaku Maharaaj) బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. అయితే, నైజాం, హిందీ ఏరియాలో ఏమాత్రం కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. బాబీ లొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12న విడుదలైంది. సుమారు రూ. 150 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై అంచనాలు వెలువడ్డాయి. స్ట్రీమింగ్ డేట్‌పై రూమర్లు స్ట్రాంగ్‌గానే వినిపిస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్(Netflix) వేదికగా ఫిబ్రవరి 9న స్ట్రీమింగ్కు రానున్నట్లు తెలుస్తోంది. డాకు మహారాజ్ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, నాగసౌజన్య నిర్మించారు. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్ వంటి స్టార్స్ నటించారు.'సంక్రాంతికి వస్తున్నాం'-- జీ5విక్టరీ వెంకటేశ్- అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam). ఈ ఏడాది పొంగల్ కానుకగా థియేర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. జనవరి 14న విడుదలైన ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్లతో పలు రికార్డ్స్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల కలెక్షన్స్ మార్క్‌కు దగ్గరలో ఉంది. ఈ సినిమాతో దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్‌కు మంచి లాభాలు వచ్చాయి. 'సంక్రాంతికి వస్తున్నాం' ఓటీటీ రైట్స్‌ను జీ5 (ZEE5) దక్కించుకుంది. వాస్తవంగా ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి 2వ వారంలో ఈ మూవీ ఓటీటీలోకి రావాలి. కానీ, థియటర్ రన్ మెరుగ్గా ఉండటంతో వాయిదా పడే ఛాన్స్ ఉంది. ఫిబ్రవరి మూడో వారంలో ఈ చిత్రం ఓటీటీలో విడుదల కావచ్చు. -
సల్మాన్ ఖాన్ తో సంక్రాంతికి వస్తున్నాం..
-
'బేసికల్లీ, టెక్నికల్లీ, లాజికల్లీ, ప్రాక్టీకల్లీ అండ్ ఫైనల్లీ'.. వెంకీమామ ఫుల్ సాంగ్ చూశారా?
విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఫర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడాది పొంగల్ కానుకగా థియేటర్లలోకి వచ్చిన బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ మూవీకి మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. జనవరి 14న రిలీజైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.276 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.అయితే ఈ మూవీలో ఓ సాంగ్ విక్టరీ వెంకటేశ్ స్వయంగా ఆలపించారు. బేసికల్లీ, టెక్నికల్లీ, లాజికల్లీ, ప్రాక్టీకల్లీ అండ్ ఫైనల్లీ.. అంటూ సాగే పాట ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. తాజాగా ఈ సాంగ్ ఫుల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ముఖ్యంగా వెంకటేశ్ పాడిన సాంగ్ కావడంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించగా.. భీమ్ సిసిరోలియో సంగీతమందించారు. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. -
చెన్నైలో సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ సెలబ్రేషన్స్.. హాజరైన కోలీవుడ్ సినీతారలు (పోటోలు)
-
ఈ ఏడాది ఫస్ట్ ట్రిప్‌కు చెక్కేసిన సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ మీనాక్షి (ఫోటోలు)
-
భీమవరంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ సంబరాలు (ఫొటోలు)
-
వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం'.. 12 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
విక్టరీ వెంకటేశ్- అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడాది పొంగల్ కానుకగా థియేర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈనెల 14న విడుదలైన ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్లతో దూసుకెళ్తోంది. కేవలం 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.260 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని చిత్రనిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ వెల్లడించింది.సంక్రాంతికి వస్తున్నాం మూవీకి మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. పొంగల్ బాక్సాఫీస్ వద్ద గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ చిత్రాలతో పోటీపడి రాణిస్తోంది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ చిత్రానికి భీమ్ సిసిరోలియో సంగీతమందించారు.(ఇది చదవండి: ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ)ఈ సినిమా కథేంటంటే..డీసీపీ యాదగిరి దామోదర రాజు అలియాస్ వైడీ రాజు(వెంకటేశ్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. మంచి కోసం తాను చేసే ఎన్కౌంటర్లను రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకొని..ఆయనను సస్పెండ్ చేస్తుంటారు. ఇది నచ్చక ఉద్యోగాన్ని వదిలేసి రాజమండ్రీ వెళ్లిపోతాడు రాజు. అక్కడ భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేశ్), నలుగురు పిల్లలతో కలిసి హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు.కట్ చేస్తే.. కేంద్రంతో గొడవపడి మరీ అమెరికాలోని ఓ బడా కంపెనీ సీఈఓ ఆకెళ్ల సత్యం(అవసరాల శ్రీనివాస్)ను తెలంగాణకు రప్పిస్తాడు ఇక్కడి ముఖ్యమంత్రి కేశవ్(నరేశ్). పార్టీ ప్రెసిడెంట్(వీటీ గణేశ్) కోరికమేరకు ఆకెళ్లను ఫామ్ హౌజ్ పార్టీకి పంపించగా.. బీజూ గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిసే పరువుతో పాటు పదవి కూడా పోతుందని భయపడిన సీఎం కేశవ్.. ఎలాగైనా బీజూ గ్యాంగ్ నుంచి ఆకేళ్లను రప్పించాలకుంటాడు.ఐపీఎస్ మీనాక్షి సలహా మేరకు వైడీ రాజుకు ఈ ఆపరేషన్ని అప్పగించాలకుంటాడు. ట్రైనింగ్ టైంలో మీనాక్షి, రాజు ప్రేమలో ఉంటారు. ఓ కారణంగా విడిపోయి..ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ ఆపరేషన్ కోసం రాజు దగ్గరకు వెళ్తుంది మీనాక్షి. అయితే మీనాక్షి..రాజు మాజీ ప్రియురాలు అనే విషయం భాగ్యానికి తెలుస్తుంది. భర్తతో పాటు ఆమె కూడా ఆపరేషన్‌లో పాల్గొంటానని చెబుతుంది. ఒకవైపు మాజీ ప్రియురాలు..మరోవైపు భార్య మధ్య రాజు ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ చేశాడనేదే ఈ సినిమా కథ. #BlockbusterSankranthikiVasthunam continues it's Box Office Sambhavam 💥💥💥260crore worldwide gross in just 12 days for #SankranthikiVasthunam 🔥🔥 ALL TIME HIGHEST FOR A REGIONAL FILM ❤️🔥❤️🔥❤️🔥Victory @venkymama @anilravipudi @aishu_dil @Meenakshiioffl #BheemsCeciroleo… pic.twitter.com/rgDgmuI2GW— Sri Venkateswara Creations (@SVC_official) January 26, 2025 -
230 కోట్లు అనేది బోనస్.. ఇంతకంటే ఏం కావాలి: వెంకటేశ్
‘‘సంక్రాంతి పండగకి నిజాయతీగా ఓ ఫ్యామిలీ సినిమా ఇవ్వాలనుకున్నాం. ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని ఆదరించారు. హిట్ కాదు... ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. మా సినిమాకి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam). మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదలైంది. గురువారం చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో వెంకటేశ్(Venkatesh) మాట్లాడుతూ– ‘‘అనిల్‌తో నేనో ఫ్రెండ్‌లానే ఉంటాను. మేము చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తాం.. అందుకే రిజల్ట్ ఇంత పాజిటివ్‌గా ఉంటుంది. ఐశ్వర్య అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. తనకి మంచి రోల్ దొరికింది. తను చాలా అనుభవం వున్న నటి. ఈ జోనర్ చేయడం తనకి కొత్త. అనిల్ చాలా చక్కని పెర్ఫార్మెన్స్ రాబట్టుకున్నాడు. ఇక నా సినిమా ఇన్ని కోట్లు వసూలు చేయాలని నేనెప్పుడూ అడగను... వచ్చింది తీసుకోవాలి. ఇప్పటికే మా సినిమా రూ. 230 కోట్లు వసూలు చేయడం అనేది బోనస్.. ఇంతకంటే ఏం కావాలి’’ అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ–‘‘సినిమాకి కాస్త దూరమైన ప్రేక్షకులు కూడా మా ‘సంక్రాంతికి వస్తున్నాం’ కోసం థియేటర్‌కి రావడం ఆనందంగా ఉంది. రెవెన్యూ సైడ్ కూడా మేం ఊహించినదానికంటే అద్భుతంగా రావడం హ్యాపీ’’ అని చె΄్పారు. ‘‘వెంకటేశ్‌గారి ‘కలిసుందాం రా’ సినిమా పాటలని ప్రేక్షకులు ఎంత గుండెల్లో పెట్టుకున్నారో... ‘సంక్రాంతికి వస్తున్నాం’ సాంగ్స్‌ని కూడా అదే స్థాయిలో ఆస్వాదించడం సంతోషంగా ఉంది’’ అని సంగీత దర్శకుడు భీమ్స్ అన్నారు. -
'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
ఆర్ ఆర్ ఆర్ రికార్డు బ్రేక్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం ..!
-
ఆ విషయంలో నేను శ్రీమంతుడిని: అనిల్ రావిపూడి
‘‘దర్శకుడిగా బ్లాక్‌బస్టర్ మూవీ తీయాలనే నా కలని తొలి సినిమా ‘పటాస్’తోనే నెరవేర్చుకోగలిగాను. నా బలం ఏంటో విశ్లేషించుకుంటూ, నా గత చిత్రాల ప్రభావం ప్రస్తుత మూవీస్‌పై పడకుండా జాగ్రత్త పడుతూ, ఆడియన్స్‌కు దగ్గరయ్యేలా కథ రాసుకోవడమే నా సక్సెస్ సీక్రెట్’’ అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi ). ‘పటాస్, ఎఫ్ 2, రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరు, సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సినిమాలతో అగ్ర దర్శకుల్లో ఒకరిగా రాణిస్తున్నారు అనిల్ రావిపూడి. దర్శకుడిగా ఆయన జర్నీకి నేటి (జనవరి 23)తో పదేళ్లు. ఈ సందర్భంగా బుధవారం విలేకర్ల సమావేశంలో అనిల్ రావిపూడి చెప్పిన విశేషాలు. ∙నా పదేళ్ల కెరీర్లో నేను చేసిన ప్రతి సినిమా ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ప్రతి సినిమాకు ఒకొక్క మెట్టు ఎక్కించి, ఫైనల్‌గా ఈ ‘పొంగల్‌కి ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో ఆడియన్స్ నాకు అద్భుతమైన విజయాన్ని అందించారు. ఆడియన్స్ నుంచి నాకు లభించిన ప్రేమే నా ఆస్తి. ఆ విషయంలో నేను శ్రీమంతుడిని. ఇక నా కెరీర్లోనే ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఆరు రోజుల్లో రూ. 100 కోట్ల షేర్, వన్ వీక్‌లో రూ. 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. ఫ్యామిలీ మూవీస్‌కి ఈ బలం ఉందని ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam Movie)తో ఆడియన్స్ స్ట్రాంగ్‌గా స్టేట్మెంట్ ఇచ్చారనిపిస్తోంది. ‘పటాస్’కు ముందు దర్శకుడ్ని కావడానికి నేను ఎక్కని కాంపౌండ్ లేదు. చాలామంది హీరోలను కలిశాను. నన్ను నమ్మి, కల్యాణ్‌రామ్‌గారు చాన్స్ ఇచ్చారు. అందుకే నా సక్సెస్ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది.దర్శకులు ఈవీవీగారితో కొందరు నన్ను పోల్చడాన్ని బిగ్గెస్ట్ కాంప్లిమెంట్‌గా భావిస్తున్నాను. గొప్ప బాధ్యత కూడా. జంధ్యాలగారి సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన నాకో స్ఫూర్తి. థియేటర్స్ లో ఆడియన్స్ కి చాలా దగ్గరగా ఉండి కథ రాసుకుంటాను. నా నుంచి ఆడియన్స్ ఎలాంటి సినిమా కోరుకుంటారు. అసలు నా బలం ఏమిటి అనేది అనలైజ్ చేస్తాను. ప్రతి సినిమాకి ముందు సినిమా తాలూక క్యారెక్టర్స్, రిసంబులెన్స్ పడకుండా జాగ్రత్త పడతాను. ఆటోమేటిక్ గా సినిమా ఫ్రెష్ గా ఉంటుంది.వెంకటేశ్, బాలకృష్ణగార్లతో సినిమాలు చేశాను. చిరంజీవిగారితో నెక్ట్స్ మూవీ చేయబోతున్నాను. నాగార్జునగారితో ‘హలో బ్రదర్’లాంటి మూవీ చేయాలని ఉంది. -
పదేళ్లుగా నన్ను అలా ట్రోల్ చేస్తునే ఉన్నారు: అనిల్ రావిపూడి
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ శాతం చాలా తక్కువ. వరుస హిట్లను అందించిన దర్శకులు చాలా అరుదు. టాలీవుడ్లో అయితే రాజమౌళి తర్వాత కెరీర్లో ఒక్క ప్లాఫ్ లేని దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi ) మాత్రమే. ఆయన దర్శకుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి పదేళ్లు పూర్తి అయ్యాయి. ఈ పదేళ్లలో ఏనిమిది సినిమాలు తెరకెక్కిస్తే ప్రతిదీ సూపర్ హిట్ టాక్‌నే సంపాదించుకుంది. ఇక ఈ సంక్రాంతికి విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam) సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. వారం రోజుల్లో రూ.200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డులు సృష్టించింది. ఎఫ్ 2 మొదలుకొని చివరి 5 సినిమాలు 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి. అయినా కూడా అనిల్ రావిపూడిపై కొంతమంది నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన సినిమాల్లో ఉండే కామెడీ ‘జబర్థస్త్’ కామెడీ షోని గుర్తు చేస్తుందని కొంతమంది విమర్శిస్తుంటారు. తాజాగా ఈ విమర్శలపై అనిల్ రావిపూడి స్పందించాడు. గత పదేళ్లుగా తన సినిమాలను ‘జబర్థస్త్ కామెడీ’ షోతో పోలుస్తూనే ఉన్నారని.. సినిమా ప్రేక్షకులే వారికి సమాధానం చెబుతున్నారని కాస్త వ్యంగ్యంగా చెప్పారు.‘నా సినిమాల్లో జబర్దస్త్ టైపు స్కిట్స్ ఉంటాయని కొంతమంది అంటుంటారు. అలా అనేవాళ్లు పది శాతం ఉంటే.. 90 శాతం మంది నా సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. గత పదేళ్లుగా కొంతమంది నా సినిమాలను విమర్శిస్తూనే ఉన్నారు. నాకు అలవాటైపోయింది. అందుకే నేను వాళ్లను పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటున్నా. ఆడియన్సే వాళ్లకు సమాధానం చెబుతున్నారు. ఒకవేళ వాళ్లు అన్నదే నిజమైతే సంక్రాంతికి వస్తున్నాం సినిమా వారం రోజుల్లో 200 కోట్లను రాబట్టదు. ఎవరో ఏదో అంటున్నారని నేను నా పంథాను మార్చుకోను. ఇలానే సినిమాలు చేస్తాను. నాకు ఆడియన్స్ తోడుగా ఉన్నారు. నా సినిమాలను ఫ్యామిలీ మొత్తం చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఎలాంటి వల్గారిటీ లేకుండా సినిమాలను చేస్తున్నాను. కామెడీ కోసం కూడా బూతు పదాలను వాడట్లేదు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బుల్లిరాజు చేత కూడా కొంతవరకు మాత్ర బూతులు తిట్టించాను. అది కూడా ఓ మంచి సందేశం ఇవ్వడం కోసమే. ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసి పిల్లలు ఎలా చెడిపోతున్నారనేది ఈ సినిమాలో చూపించాం. దాని కోసమే చిన్న చిన్న బూతు పదాలు వాడం.అంతకు మించి నా సినిమాల్లో బోల్డ్ కంటెంట్ అనేది ఉండదు. ఇకపై కూడా కామెడీ సినిమాలను చేస్తాను.ప్రతి శుక్రవారం ఏ సినిమా రిలీజ్ అయినా ఆ థియేటర్లో ఉంటా. నాకంటే సినిమా బాగా తీస్తే నేర్చుకుంటా, నేను తప్పులు చేస్తే సరిద్దుకుంటా. ఇక ముందు నేను తీసే సినిమాల జర్నీ కూడా ఇలానే ఉంటుంది’ అని అనిల్ రావిపూడి అన్నారు.కాగా, అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. విక్టరీ వెంకటేశ్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం జనవరి 14న విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్లోంది. విడుదలైన ఎనిమిది రోజుల్లో 218 కోట్ల గ్రాస్ వసూళ్లను సంపాదించి సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. -
'సంక్రాంతి వస్తున్నాం' మూవీ.. వారం రోజుల్లోనే క్రేజీ రికార్డ్!
వెంకటేశ్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన టాలీవుడ్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం(sankranthiki vastunnam Movie) బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. పొంగల్ బరిలో నిలిచిన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో వసూళ్ల పరంగా రాణిస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన ఈ సినిమా మరో క్రేజీ మార్క్‌ను అధిగమించింది.ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే రూ.200 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఐదు రోజుల్లోనే రూ.165 కోట్లకు పైగా రాబట్టిన ఈ చిత్రం.. ఏడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.203 కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేసింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విటర్ ద్వారా షేర్ చేసింది. ఈ చిత్రంలో వెంకీమామ సరసన ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా మెప్పించారు. వెంకటేశ్ కుమారుడి పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజు(రేవంత్) ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు.ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్..గతంలో ఆరో రోజు ఎక్కువ షేర్ (రూ.9.54 కోట్ల షేర్) సాధించిన సినిమాగా ఆర్ఆర్ఆర్ పేరిట రికార్డు భద్రంగా ఉండేది. నిన్నటితో సంక్రాంతికి వస్తున్నాం ఆ రికార్డును బద్దలు కొట్టేసింది. విక్టరీ వెంకటేశ్ (Venkatesh Daggubati) కెరీర్లోనే ఈ సినిమా ఆల్‌టైం హిట్‌గా నిలిచింది. ఇప్పటికే రూ.100 కోట్ల షేర్ కూడా వచ్చేసిందని తెలిపింది. అటు నార్త్ అమెరికాలోనూ సినిమా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. అక్కడ ఇప్పటివరకు 2.1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ బ్లాక్‌బస్టర్ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అది కూడా మళ్లీ సంక్రాంతికే రిలీజ్ చేస్తామని తెలిపాడు.The OG of Sankranthi has conquered every region with unanimous dominance 💥💥💥#SankranthikiVasthunam grosses a sensational ₹203+ crores in its first week❤️🔥❤️🔥❤️🔥ALL TIME RECORD FOR A REGIONAL FILM 🔥🔥🔥#BlockbusterSankranthikiVasthunam in cinemas now. Victory @venkymama… pic.twitter.com/QFg59gZ7Ri— Sri Venkateswara Creations (@SVC_official) January 21, 2025 -
సంక్రాంతికి వస్తున్నాం సినిమా 5వ రోజు కలెక్షన్స్
-
సంక్రాంతికి వస్తున్నాం ఖాతాలో మరో రికార్డు.. 'డాకు..' కలెక్షన్స్ ఎంతంటే?
సంక్రాంతి బరిలో దిగిన గేమ్ ఛేంజర్ సినిమా సైలెంట్ అయిపోయింది. మొదట్లో డాకు మహారాజ్ (Daaku Maharaaj Movie) బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టగా దాన్ని సైతం వెనక్కు నెడుతూ టాప్ ప్లేస్‌లో నిలబడింది సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam Movie). జనవరి 14న విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వరద పారిస్తోంది. ఐదు రోజుల్లోనే ఈ చిత్రం రూ.165 కోట్లకు పైగా రాబట్టింది. ఆరో రోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా రికార్డుకెక్కిందని చిత్రయూనిట్ ప్రత్యేకంగా పోస్టర్ రిలీజ్ చేసింది. ఆరో రోజు ఎక్కువ షేర్ (రూ.9.54 కోట్ల షేర్) సాధించిన సినిమాగా ఆర్ఆర్ఆర్ పేరిట రికార్డు భద్రంగా ఉండేది. నిన్నటితో సంక్రాంతికి వస్తున్నాం ఆ రికార్డును బద్ధలు కొట్టింది. విక్టరీ వెంకటేశ్ (Venkatesh Daggubati) కెరీర్లోనే ఈ సినిమా ఆల్‌టైం హిట్‌గా నిలిచింది. ఇప్పటికే రూ.100 కోట్ల షేర్ కూడా వచ్చేసిందని తెలిపింది. అటు నార్త్ అమెరికాలోనూ సినిమా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. అక్కడ ఇప్పటివరకు 2.1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు చేసింది. యూకెలో 1,95,628 పౌండ్లు వసూలు చేసింది. ఈ బ్లాక్‌బస్టర్ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అది కూడా మళ్లీ సంక్రాంతికే రిలీజ్ చేస్తామని తెలిపాడు.డాకు మహారాజ్ కలెక్షన్స్ ఎంత?డాకు మహారాజ్ సినిమా విషయానికి వస్తే.. నందమూరి బాలకృష్ణ నటించిన ఈ చిత్రానికి ఎనిమిది రోజుల్లో రూ.156 కోట్లు వచ్చాయి. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఐటం సాంగ్‌లో మెరిసింది. తమన్ సంగీతం అందించగా నాగవంశీ నిర్మాతగా వ్యవహరించాడు. #SankranthikiVasthunam is redefining MASS with it’s CLASS FAMILY ENTERTAINMENT🔥🔥🔥#BlockbusterSankranthikiVasthunam joins the elite 100Crore+ share club in just 6 days 💥💥💥ALL TIME HIGHEST FOR VICTORY @Venkymama ❤️🔥ALL TIME #2 HIGHEST FOR Hit Machine @AnilRavipudi ❤️🔥… pic.twitter.com/zjjrKwNoJk— Sri Venkateswara Creations (@SVC_official) January 20, 2025Victory @venkymama is firing on all cylinders with #SankranthikiVasthunam at the box office🔥🔥🔥#BlockbusterSankranthikiVasthunam has now become the ALL-TIME HIGHEST COLLECTED FILM IN AP & TS on its 6th day💥💥💥💥#BlockbusterSankranthikiVasthunam IN CINEMAS NOW 🫶… pic.twitter.com/dv97e3aeVl— Sri Venkateswara Creations (@SVC_official) January 20, 2025The KING OF SANKRANTHI roars louder with every passing day 🪓🔥#DaakuMaharaaj storms past 𝟏𝟓𝟔+ 𝐂𝐫𝐨𝐫𝐞𝐬 Gross Worldwide in 8 DAYS 💥Celebrate the unstoppable reign of 𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺 #NandamuriBalakrishna in cinemas near you ❤️🔥… pic.twitter.com/hHvfs5Ac28— Sithara Entertainments (@SitharaEnts) January 20, 2025 చదవండి: వర్మ కళ్లు తెరిపించిన సత్య.. ఒట్టు, ఇకపై అలాంటి సినిమాలు చేయను! -
తిరుమలలో సంక్రాంతికి వస్తున్నాం టీమ్.. (ఫోటోలు)
-
'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్‌పై అనిల్ రావిపూడి.. రిలీజ్ ఎప్పుడంటే?
వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunnam Movie). ఈ మూవీతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు వెంకీమామ. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం రూ.200 కోట్లక దిశగా దూసుకెళ్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీని తెగ చూసేస్తున్నారు. ఈ మూవీకి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడంతో ఇటీవల హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను కూడా సెలబ్రేట్ చేసుకున్నారు.(ఇది చదవండి: సంక్రాంతికి వస్తున్నాం: ఐశ్వర్య కాకపోతే ఆ హీరోయిన్.. మీనాక్షికి బదులుగా!)అయితే ఈ మూవీకి వస్తున్న ఆదరణ చూసి డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. యాంకర్ సుమతో ఇంటర్వ్యూకు హాజరైన అనిల్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి సీక్వెల్ ఉంటుందని చెప్పారు. సంక్రాంతికి వస్తున్నాం -2 కథ అక్కడి నుంచే మొదలవుతుందని క్లారిటీ ఇచ్చారు. మళ్లీ సంక్రాంతికే వస్తామని అనిల్ రావిపూడి అన్నారు. ఈ సినిమా చేసేందుకు స్పేస్ ఉందని.. రాజమండ్రిలో ఎండ్ చేశాం కాబట్టి.. అక్కడి నుంచే ఈ కథ మొదలవుతుందని అన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మరో మిరాకిల్‌తో మీ ముందుకు వస్తామని అనిల్ రావిపూడి స్పష్టం చేశారు. దీంతో వెంకీ మామ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరో, హీరోయిన్లుగా నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా అద్భుతంగా ఉందంటూ ఫ్యామిలీ ఆడియన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఐదు రోజుల్లోనే రూ.161 కోట్లు వసూలు చేసింది. కేవలం మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.106 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా వెంకటేశ్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.ఓవర్సీస్లో రికార్డ్ వసూళ్లు..సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఓవర్సీస్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఓవర్సీస్ ఆడియన్స్ కోసం అదనపు షోలు కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ సంక్రాంతికి మూడు చిత్రాలు రిలీజ్ కాగా.. ఈ సినిమా ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంది. బాలయ్య డాకు మహారాజ్, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సైతం పొంగల్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.ఈ మూవీ కథేంటంటే..డీసీపీ యాదగిరి దామోదర రాజు అలియాస్ వైడీ రాజు(వెంకటేశ్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. మంచి కోసం తాను చేసే ఎన్కౌంటర్లను రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకొని..ఆయనను సస్పెండ్ చేస్తుంటారు. ఇది నచ్చక ఉద్యోగాన్ని వదిలేసి రాజమండ్రీ వెళ్లిపోతాడు రాజు. అక్కడ భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేశ్), నలుగురు పిల్లలతో కలిసి హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు.కట్ చేస్తే.. కేంద్రంతో గొడవపడి మరీ అమెరికాలోని ఓ బడా కంపెనీ సీఈఓ ఆకెళ్ల సత్యం(అవసరాల శ్రీనివాస్)ను తెలంగాణకు రప్పిస్తాడు ఇక్కడి ముఖ్యమంత్రి కేశవ్(నరేశ్). పార్టీ ప్రెసిడెంట్(వీటీ గణేశ్) కోరికమేరకు ఆకెళ్లను ఫామ్ హౌజ్ పార్టీకి పంపించగా.. బీజూ గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిసే పరువుతో పాటు పదవి కూడా పోతుందని భయపడిన సీఎం కేశవ్.. ఎలాగైనా బీజూ గ్యాంగ్ నుంచి ఆకేళ్లను రక్షించాాలకుంటాడు.ఐపీఎస్ మీనాక్షి సలహా మేరకు వైడీ రాజుకు ఈ ఆపరేషన్ని అప్పగించాలకుంటాడు. ట్రైనింగ్ టైంలో మీనాక్షి, రాజు ప్రేమలో ఉంటారు. ఓ కారణంగా విడిపోయి..ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ ఆపరేషన్ కోసం రాజు దగ్గరకు వెళ్తుంది మీనాక్షి. అయితే మీనాక్షి..రాజు మాజీ ప్రియురాలు అనే విషయం భాగ్యానికి తెలుస్తుంది. భర్తతో పాటు ఆమె కూడా ఆపరేషన్‌లో పాల్గొంటానని చెబుతుంది. ఒకవైపు మాజీ ప్రియురాలు..మరోవైపు భార్య మధ్య రాజు ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ చేశాడనేదే ఈ సినిమా కథ. సంక్రాంతికి వస్తున్నాం 2 కథ అక్కడ మొదలవుతుంది - #AnilRavipudi#SankranthikiVasthunam#Venkatesh #AishwaryaRajesh #MeenakshiChaudhary #TeluguFilmNagar pic.twitter.com/ekTYLB9cpQ— Telugu FilmNagar (@telugufilmnagar) January 19, 2025 -
'సంక్రాంతికి వస్తున్నాం' బుల్లి రాజు.. తీవ్రంగా ఇబ్బంది పెట్టిన ఫ్యాన్స్!
వెంకటేశ్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడాది పొంగల్ కానుకగా ఈనెల 14న థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే వందకోట్లకు వసూళ్లతో సంక్రాంతి రేసులో అదరగొడుతోంది.అయితే ఈ మూవీ ఎంత హిట్టయిందో.. అదే రేంజ్లో ఫేమస్ అయ్యాడు చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ భీమాల. ఈ మూవీ వెంకటేశ్ కుమారుడిగా నటించిన రేవంత్ (బుల్లిరాజు) ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్నాడు. బుల్లిరాజుగా సినీ ప్రియులను మెప్పించారు. తన మాటలు, డైలాగ్‌లతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. ఇటీవల సక్సెస్ మీట్లోనూ రేవంత్ మరోసారి సందడి చేశారు.అయితే తాజాగా బుల్లిరాజుతో కొందరు అభిమానులు వ్యవహరించిన తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. అతనితో సెల్ఫీలు దిగేందుకు కొందరు ఫ్యాన్స్ పోటీ పడ్డారు. అయితే ఇదే క్రమంలో బుల్లిరాజు ఇబ్బందిగా ఫీలవుతున్నా కూడా వారు వదల్లేదు. దయచేసి నన్ను వదిలేయండి అని బుల్లిరాజు చెప్పినా వారస్సలు పట్టించుకోలేదు. చిన్న పిల్లాడితో ఇలా వ్యవహరించడం ఏంటని పలువురు నిలదీస్తున్నారు. జరగండి.. నేను వెళ్లాలి అని బుల్లిరాజు చెబుతున్నా వినకుండా అతనితో ఫోటోలు తీసుకున్నారు. చిన్న పిల్లాడు అని చూడకుండా ఈ పైత్యం ఏంటని పలువురు నెటిజన్స్ మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీశ్ నిర్మించారు.#BulliRaju with items 😍 who are harassing #SankranthikiVasthunam pic.twitter.com/CTqfFrv79L— Aristotle (@goLoko77) January 19, 2025 -
ఫ్లాప్స్, ట్రోలింగ్‌తో డిప్రెషన్లో.. ఇప్పుడు వరుస హిట్స్‌తో దూకుడు (ఫోటోలు)
-
సంక్రాంతికి వస్తున్నాం: ఐశ్వర్య కాకపోతే ఆ హీరోయిన్.. మీనాక్షికి బదులుగా!
సంక్రాంతికి వస్తున్నాం సినిమా (Sankranthiki Vasthunnam Movie)తో వెంకటేశ్ ఖాతాలో మరో విక్టరీ పడింది. ఈ సినిమాకు ఎవరూ ఊహించని రేంజ్లో వసూళ్లు వస్తున్నాయి. పొంగల్‌కు రిలీజైన గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలతో పోలిస్తే సంక్రాంతికి వస్తున్నాం తక్కువ బడ్జెట్ చిత్రం. కానీ బలమైన కామెడీ కంటెంట్.. ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్ల ముందు క్యూ కట్టించేలా చేస్తోంది. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఐదు రోజుల్లోనే రూ.161 కోట్లు వసూలు చేసింది.రూ.200 కోట్లకు చేరువలో..అన్ని ప్రాంతాల్లోనూ బ్రేక్ఈవెన్ దాటేసి లాభాల బాట పట్టినట్లు చిత్రయూనిట్ అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించింది. ఈ సినిమా దూకుడు చూస్తుంటే త్వరలోనే రూ.200 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు సినిమా యూనిట్ తాజాగా చిట్‌చాట్ నిర్వహించింది. ఈ చిట్ చాట్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో పాల్గొన్నారు. ఈ భేటీలో ఒకరినొకరు ప్రశ్నలు అడుక్కున్నారు.మీనాక్షి స్థానంలో..సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మీనాక్షి చేయకపోతే ఆ పాత్ర ఇంకెవరు చేసేవారు? అలాగే నేను చేయకపోతే నా స్థానంలో ఇంకెవర్ని తీసుకునేవారు? అని ఐశ్వర్య.. అనిల్ రావిపూడిని ప్రశ్నించింది. అందుకు అనిల్.. ఐశ్వర్య చేయకపోతే నిత్యామీనన్, మీనాక్షి స్థానంలో పూజా హెగ్డే చేసేదన్నారు. ఆ పాత్రల్లో మమ్మల్ని తప్ప ఎవర్నీ ఊహించుకోలేదంటారేమోనని ఎదురుచూశాను అని ఐశ్వర్య పంచ్ వేసింది.ప్రభాస్‌తో నటించాలనుందన్న మీనాక్షిదీంతో అనిల్.. నిజం చెప్పాలంటూ భాగ్యం పాత్రను ఐశ్వర్య రాజేశ్ తప్ప ఇంకెవరూ అలా చేయలేరు, అలాగే పోలీస్ పాత్ర చేసిన మీనాక్షిలో ఎంటర్టైన్మెంట్ టైమింగ్ ఉందని కవర్ చేశాడు. ఏ హీరోతో పని చేయాలని ఉందన్న ప్రశ్నకు మీనాక్షి.. అందరు హీరోలతో నటించాలనుందని.. అందులో ప్రభాస్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాడంది. ఐశ్వర్య.. జూనియర్ ఎన్టీఆర్‌తో పని చేయాలనుందని తెలిపింది. అనిల్ రావిపూడి.. చిరంజీవితో చేయాలనుందని, వేరే భాషల్లో అయితే విజయ్ను డైరెక్ట్ చేయాలనుందన్నాడు. A storm of love at the theaters and a reign of dominance at the box office 🔥#BlockbusterSankranthikiVasthunam grosses a MASSIVE 161+ Crores Worldwide in 5 Days💥💥All Areas in Profit Zone and heading towards 200Cr+ Gross mark ❤️🔥❤️🔥❤️🔥— https://t.co/ocLq3HYfE9… pic.twitter.com/s7zfzGwT4e— Sri Venkateswara Creations (@SVC_official) January 19, 2025 చదవండి: 'పాతాళ్ లోక్'తో ట్రెండ్ అవుతున్న నగేశ్ కుకునూర్ ఎవరో తెలుసా..? -
విజయవాడలో హీరోయిన్ మీనాక్షి చౌదరి సందడి (ఫొటోలు)
-
సంక్రాంతికి వస్తున్నాం రికార్డు వసూళ్లు..3 రోజుల్లోనే భారీ మైల్ స్టోన్..
-
'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ పార్టీలో మహేశ్‌బాబు (ఫొటోలు)
-
‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ జాతర సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఇది తెలుగు ప్రేక్షకుల విజయం: వెంకటేశ్
‘‘కష్టపడి పని చేస్తే ఫలితం వస్తుందని నా నమ్మకం. ఆ నమ్మకాన్ని ‘సంక్రాంతికి వస్తున్నాం’ విజయం మరోసారి రుజువు చేసింది. ఇది మా విజయమే కాదు.. ఇంత గొప్పగా సపోర్ట్, లవ్ చేసిన తెలుగు ఆడియన్స్, ఫ్యాన్స్ సక్సెస్. ఇది తెలుగు ప్రేక్షకుల విజయం’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలైంది.ఈ సందర్భంగా నిర్వహించిన ‘΄పొంగల్ బ్లాక్ బస్టర్ జాతర సెలబ్రేషన్స్’లో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్ అనిల్, నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్గార్లకు, సినిమా యూనిట్‌కి థ్యాంక్స్. ఫిల్మ్ ఇండస్ట్రీలోని అందరూ మనస్ఫూర్తిగా ఫోన్ చేసి సినిమా బాగుందని అభినందిస్తున్నందుకు ధన్యవాదాలు’’ అని చెప్పారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘మేము ఊహించినదానికంటే సినిమాని ఎక్కువ స్థాయికి తీసుకెళ్లిన తెలుగు ప్రేక్షకులకు నా పాదాభివందనాలు. ఈ సినిమాతో నా కెరీర్లో ఎనిమిది సక్సెస్‌లు అంటున్నారు... ఆడియన్స్ సపోర్ట్ లేకపోతే నాకు ఈ విజయం వచ్చేది కాదు’’ అన్నారు.‘‘వెంకటేశ్‌గారు నిర్మాతల బాగు కోరుకుంటారు. కాబట్టే ఇప్పటికీ కాలర్ ఎగరేస్తూ ముందుకు వెళ్తున్నారు’’ అని శిరీష్ పేర్కొన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘అనిల్, వెంకటేశ్‌గారి కాంబినేషన్లో సినిమా అంటే పాజిటివ్ వైబ్రేషన్. ఇది మాకు బ్లాక్ బస్టర్ ΄పొంగల్’’ అని చెప్పారు. ‘‘నేను చేసిన భాగ్యం పాత్ర క్రెడిట్ అంతా అనిల్గారికే దక్కుతుంది’’ అన్నారు ఐశ్వర్యా రాజేశ్. ఈ వేడుకలో నటులు అవసరాల శ్రీనివాస్, శ్రీనివాస్ వడ్లమాని, మురళీధర్ గౌడ్, కెమెరామేన్ సమీర్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్, ఎడిటర్ తమ్మిరాజు, రచయితలు అజ్జు మహాకాళి, నాగ్, సాయి కృష్ణ తదితరులు మాట్లాడారు. -
సారీ చెప్పిన చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లి రాజు.. ఎందుకో తెలుసా?
సంక్రాంతికి ఆడియన్స్‌ను ఫుల్‌గా ఎంటర్టైన్ చేస్తోన్న చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. వెంకటేశ్ హీరోగా నటించిన ఈ చిత్రం పొంగల్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇంకేముంది అనిల్- వెంకటేశ్ కాంబోపై మరోసారి ప్రశంసలు కురుస్తున్నాయి.అయితే ఈ సినిమాతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్(బుల్లి రాజు). తన క్యూట్ క్యూట్ మాటలతో సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాడు. అంతకుముందు మూవీ ఈవెంట్లో మాట్లాడిన బుల్లి రాజు మరోసారి సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ మీట్లో సందడి చేశాడు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడిపై ప్రశంసలు కురిపించాడు. అంతే కాకుండా నాలా ఎవరూ కూడా పాడై పోవద్దంటూ పెద్ద సలహానే ఇచ్చాడు. ఇంతకీ అదేంటో చూద్దాం.బుల్లి రాజు మాట్లాడుతూ..' అందిరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మీరందరు థియేటర్స్‌కు వెళ్లి సినిమాను ఆదరించినందుకు థ్యాంక్స్. అలాగే నాలా ఓటీటీలు చూసి ఎవరూ పాడైపోవద్దు. ఒక మేసేజ్ ఇవ్వడం కోసమే ఇలా చేశాం. ఇలా అవుతుందని అనుకోలేదు. ఈ సినిమాలో నా పాత్రను ఎవరూ ఫాలో అవ్వొద్దు. అందుకు మీ అందరికీ సారీ. అనిల్ సార్ మీరు నాకు మంచి ఛాన్స్ ఇచ్చారు. మీ గురించి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. అందరితో బాగా కలిసిపోయాను.' అని అన్నారు. రేవంత్ పాత్రపై అనిల్ రావిపూడి మాట్లాడుతూ..' బుల్లి రాజు నువ్వు బాగా చేశాం. యూఎస్‌తో పాటు రెండు రాష్ట్రాల ప్రజలు నిన్ను మెచ్చుకుంటున్నారు. నువ్వు బాగా చదువుకో. మంచి సినిమాలు చేయి. ఈ బుడ్డోడి పాత్ర ఏంటంటే.. పిల్లలు ఓటీటీ చూస్తే పరిస్థితి ఏంటనేది చూపించాం. అక్కడ వినిపించే బూతులు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే మేసేజ్ కోసమే అలా చేశాం. అంతేకానీ బుల్లిరాజుతో అలా మాట్లాడించాలని కాదు' అని క్లారిటీ ఇచ్చారు. కాగా.. వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ ఏడాది పొంగల్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజే నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా చూసిన ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సంక్రాంతికి సరిపోయే ఎంటర్టైన్మెంట్ అందించారని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా అదరగొట్టింది. ఈ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా వెంకటేశ్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. -
బ్లాక్‌బస్టర్ పొంగల్.. కలెక్షన్స్ ఎంత వచ్చాయంటే?
ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అంటారు. గతేడాది సంక్రాంతికి సైంధవ్‌తో పలకరించాడు విక్టరీ వెంకటేశ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా చతికిలపడింది. ఈసారి తన ఎవర్గ్రీన్ జానర్ కామెడీనే నమ్ముకున్నాడు. అలా అనిల్ రావిపూడితో సంక్రాంతికి వస్తున్నాం సినిమా (Sankranthiki Vasthunam Movie) చేశాడు. ఈ మూవీ జనవరి 14న విడుదలైంది. అలా ఈసారి సంక్రాంతికి వస్తూనే పండగ కళను తీసుకొచ్చారు. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవడానికి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ ఎదుట క్యూ కడుతున్నారు.రెండు రోజుల్లోనే రూ.77 కోట్లుమొత్తానికి సంక్రాంతికి వస్తున్నాం చిత్రయూనిట్ ఈసారి బ్లాక్‌బస్టర్ పొంగల్ సెలబ్రేట్ చేసుకుంటోంది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లు రాబట్టిన ఈ సినిమా రెండో రోజు రూ.32 కోట్లు వసూలు చేసింది. అంటే రెండు రోజుల్లోనే రూ.77 కోట్ల కలెక్షన్స్ సాధించింది. బాక్సాఫీస్ ర్యాంపేజ్ ఆడిస్తున్న వెంకీ మామ రెండు రోజుల్లో రూ.100 కోట్ల మార్క్ దాటడం ఖాయంగా కనిపిస్తోంది.తగ్గని డాకు మహారాజ్ జోరుమరోవైపు నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా (Daaku Maharaaj Movie) కూడా బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. తొలి రోజు రూ.56 కోట్లు రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. జనవరి 12న రిలీజైన ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే సెంచరీ క్లబ్‌లోకి చేరింది. డాకు మహారాజ్ రూ.105 కోట్లు రాబట్టిందంటూ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ స్పెషల్ పోస్టర్ ద్వారా వెల్లడించింది. అంతేకాదు, ఈ సినిమాను తమిళంలో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. జనవరి 17 నుంచి తమిళనాడులోని థియేటర్లలో డాకు మహారాజ్ ప్రత్యక్షం కానుందని వెల్లడించారు. KING OF SANKRANTHI #DaakuMaharaaj has turned into a CELEBRATION with the audience's love ❤️#BlockbusterHuntingDaakuMaharaaj crosses 𝟏𝟎𝟓 𝐂𝐫𝐨𝐫𝐞𝐬+ 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐆𝐫𝐨𝐬𝐬 𝐢𝐧 𝟒 𝐝𝐚𝐲𝐬 sweeping all territories into his zone 🪓🔥𝐓𝐇𝐄 𝐇𝐔𝐍𝐓 𝐈𝐒 𝐎𝐍 ~ Book… pic.twitter.com/JPF8US64bO— Sithara Entertainments (@SitharaEnts) January 16, 2025The ‘VICTORY RAMPAGE’ continues at the box office 🔥🔥🔥77CRORE+ Worldwide Gross in 2 days for #BlockbusterSankranthikiVasthunam ❤️🔥And Day3 already begun on a sensational note 💥💥#SankranthikiVasthunam IN CINEMAS NOW 🫶Victory @venkymama @anilravipudi @aishu_dil pic.twitter.com/IfkZ1tSa1q— Sankranthiki Vasthunam (@SVMovieOfficial) January 16, 2025 The sensation that shook the box office and won hearts in Telugu 😎Now ready to ROAR in Tamil from tomorrow! 🔥Experience the #BlockbusterHuntingDaakuMaharaaj with your loved ones ❤️#DaakuMaharaaj ❤️🔥𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺 #NandamuriBalakrishna @thedeol @dirbobby… pic.twitter.com/0Vg08BOWNY— Sithara Entertainments (@SitharaEnts) January 16, 2025 చదవండి: సైఫ్ అలీఖాన్‌పై దాడి.. షాకయ్యా: జూనియర్ ఎన్టీఆర్ -
సంక్రాంతి ప్రత్యేకం
తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగతో చిత్ర పరిశ్రమకు ప్రత్యేక అనుబంధం ఉంది. సంక్రాంతి సందర్భంగా తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు స్టార్ హీరోలు సైతం పోటీపడుతుంటారు. ఈ సంక్రాంతికి రామ్‌చరణ్ ‘గేమ్ చేంజర్’, బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బిగ్ ప్రాజెక్ట్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. సంక్రాంతి పండుగని పురస్కరించుకుని తమ సినిమాల నుంచి ప్రత్యేక పోస్టర్స్, లుక్స్‌ని విడుదల చేశారు పలువురు మేకర్స్. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం... రాజా సాబ్ ఆగయాప్రభాస్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ హారర్ జానర్లో రూపొందుతోన్న ‘రాజా సాబ్’ నుంచి ప్రభాస్ సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. పండుగ కళ కనిపిస్తున్న ఈ పోస్టర్లో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటోంది. షూటింగ్ తుదిదశలో ఉన్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.అందమైన లైలాహీరో విశ్వక్ సేన్ లైలాగా మారారు. ఆయన అబ్బాయిగా, అమ్మాయిగా నటించిన చిత్రం ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఆకాంక్షా శర్మ హీరోయిన్. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ మూవీలో తొలిసారి లైలా అనే అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు విశ్వక్ సేన్. ఈ సినిమా నుంచి లైలాగా విశ్వక్ సేన్ లుక్‌ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. జాస్మిన్ వచ్చేశారు‘బబుల్ గమ్’ మూవీ ఫేమ్ రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ 2025’. ‘కలర్ ఫోటో’ మూవీతో జాతీయ అవార్డు అందుకున్న సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్ , టీజీ కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా సాక్షి సాగర్ మదోల్కర్ హీరోయిన్గా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో ఆమె జాస్మిన్ పాత్రలో నటిస్తున్నట్లు పేర్కొని, పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. సంతానప్రాప్తిరస్తువిక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన సినిమా ‘సంతానప్రాప్తిరస్తు’. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా నుంచి విక్రాంత్, చాందినిల స్పెషల్ పోస్టర్ని రిలీజ్ చేసింది యూనిట్. ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. -
పెద్దోడి సినిమాపై చిన్నోడి ప్రశంసలు.. గర్వంగా ఉందంటూ..
సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam Movie).. సినిమా టైటిట్ ఏ ముహూర్తాన పెట్టారో కానీ సంక్రాంతి కళ మొత్తం బాక్సాఫీస్ వద్దే కనిపిస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ చలో అంటూ థియేటర్‌కు క్యూ కట్టారు. సినిమాలంటే పెద్దగా ఇష్టపడని వాళ్లు కూడా కాసేపు సరదాగా నవ్వుకోవడానికైనా ఈ మూవీకెళ్దామని అనుకుంటున్నారు. అక్కడే అనిల్ రావిపూడి సక్సెస్ అయిపోయాడు.సూపర్ హిట్‌గా సంక్రాంతికి వస్తున్నాం2025 సంక్రాంతికి గేమ్ ఛేంజర్ (Game Changer Movie), డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు రిలీజయ్యాయి. రెండు రోజుల వ్యవధితో ఒక్కో సినిమా విడుదలైంది. జనవరి 10న వచ్చిన గేమ్ ఛేంజర్ ఎక్కువగా నెగెటివ్ టాక్ తెచ్చుకోగా జనవరి 12న రిలీజైన డాకు మహారాజ్ (Daaku Maharaaj Movie)కు స్పందన బాగుంది. చివరగా జనవరి 14న విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం మూవీ.. బ్లాక్‌బస్టర్ టాక్ సంపాదించుకుంది. వెంకటేశ్ కెరీర్లోనే అత్యధికంగా తొలి రోజే రూ.45 కోట్లు సంపాదించింది. (చదవండి: మంచు మనోజ్ అభిమానులపై మోహన్‌బాబు బౌన్సర్ల దాడి)గర్వంగా ఉందితాజాగా ఈ సినిమాపై హీరో మహేశ్‌బాబు (Mahesh Babu) స్పందించాడు. సంక్రాంతికి వస్తున్నాం అసలు సిసలైన పండగ సినిమా. ఈ మూవీ చూసి చాలా ఆనందించాను. వెంకటేశ్ సర్ మీరు అదరగొట్టారు. వరుస బ్లాక్‌బస్టర్స్ ఇస్తున్న అనిల్ రావిపూడిని చూస్తుంటే ఒకింత సంతోషంగా, ఒకింత గర్వంగా ఉంది. ఐశ్వర్య, మీనాక్షి తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. పిల్లాడు బుల్లిరాజు యాక్టింగ్ అయితే వేరే లెవల్. సినిమా యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు అని ట్వీట్ చేశాడు.పొంగల్ విన్నర్?ఇది చూసిన జనాలు సంక్రాంతికి వచ్చేస్తున్నాం సినిమాను పొంగల్ విన్నర్‌గా పేర్కొంటున్నారు. మరికొందరేమో మహేశ్‌బాబు.. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు ఎలాంటి రివ్యూ ఇవ్వకుండా కేవలం ఈ ఒక్క సినిమాకు ఇచ్చాడంటేనే ఏది హిట్టో తెలిసిపోతోందని కామెంట్లు చేస్తున్నారు. కాగా మహేశ్, వెంకటేశ్.. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అన్నదమ్ములుగా నటించారు. ఇందులో వెంకటేశ్ పెద్దోడిగా, మహేశ్ చిన్నోడిగా యాక్ట్ చేశారు.సినిమా విశేషాలుసంక్రాంతి సినిమా విషయానికి వస్తే.. వెంకటేశ్ (Venkatesh Daggubati) హీరోగా నటించగా ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ సినిమాలో బాగా హైలైట్ అయిన పాత్రల్లో బుల్లిరాజు ఒకటి. బుల్లి రాజుగా చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ భీమల నటించాడు. అతడి పాత్రకు అద్భుతమైన స్పందన లభిస్తోంది.గతేడాది సంక్రాంతికి డిజాస్టర్వెంకటేశ్ కెరీర్లో సంక్రాంతికి వచ్చిన మెజారిటీ సినిమాలు విజయం సాధించాయి. కానీ గతేడాది మాత్రం ఈ సమయానికి డిజాస్టర్ మూటగట్టుకున్నాడు. సైంధవ్ చిత్రంతో ఫ్లాప్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈసారి మాత్రం అలాంటి పొరపాటు మళ్లీ జరగకుండా జాగ్రత్తపడ్డాడు. సంక్రాంతికి వచ్చేస్తున్నాంతో బ్లాక్‌బస్టర్ పొంగల్ సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. జీవిత సూత్రాలుఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో నేటి తరానికి కొన్ని సూచనలు ఇచ్చాడు. జీవితాన్ని హాయిగా.. సంతోషంగా జీవించాలి. అత్యాశలకు పోకూడదు. అతిగా ఆలోచించకూడదు. మన ఆలోచనలు సానుకూలంగానే ఉండాలి. అదే సమయంలో మనం ఏదైనా కోరుకుంటున్నప్పుడు ఆ పనిని నిజాయితీతో చేయాలి. క్రమశిక్షణగా ఉండాలి... కష్టపడాలి. అప్పుడు సాధ్యమౌతుంది. లైఫ్‌లో ఎప్పుడూ హోప్‌ను కోల్పోకూడదు అని చెప్పాడు. Enjoyed watching #SankranthikiVasthunam , A proper festive film... @VenkyMama sir is just terrific👌👌👌So proud and happy for my director @AnilRavipudi for giving consecutive Blockbusters 👍👍👍@aishu_dil @Meenakshiioffl were superb in their characters. The kid "Bulli…— Mahesh Babu (@urstrulyMahesh) January 15, 2025 చదవండి: పీరియడ్స్ అన్నా పట్టించుకోరు... అతనొక్కడే...: నిత్యామీనన్ -
సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్స్.. సందడే సందడి
-
సంక్రాంతికి వస్తున్నాం.. వెంకీమామ కెరీర్లోనే ఆల్‌టైమ్ రికార్డ్
వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ ఏడాది పొంగల్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా చూసిన ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సంక్రాంతికి సరిపోయే ఎంటర్టైన్మెంట్ అందించారని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా అదరగొట్టింది. ఈ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా వెంకటేశ్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. 'పండగకి వచ్చారు.. పండగని తెచ్చారు' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.(ఇది చదవండి: ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ)'సంక్రాంతికి వస్తున్నాం' కథేంటంటే..డీసీపీ యాదగిరి దామోదర రాజు అలియాస్ వైడీ రాజు(వెంకటేశ్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. మంచి కోసం తాను చేసే ఎన్కౌంటర్లను రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకొని..ఆయనను సస్పెండ్ చేస్తుంటారు. ఇది నచ్చక ఉద్యోగాన్ని వదిలేసి రాజమండ్రీ వెళ్లిపోతాడు రాజు. అక్కడ భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేశ్), నలుగురు పిల్లలతో కలిసి హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు.కట్ చేస్తే.. కేంద్రంతో గొడవపడి మరీ అమెరికాలోని ఓ బడా కంపెనీ సీఈఓ ఆకెళ్ల సత్యం(అవసరాల శ్రీనివాస్)ను తెలంగాణకు రప్పిస్తాడు ఇక్కడి ముఖ్యమంత్రి కేశవ్(నరేశ్). పార్టీ ప్రెసిడెంట్(వీటీ గణేశ్) కోరికమేరకు ఆకెళ్లను ఫామ్ హౌజ్ పార్టీకి పంపించగా.. బీజూ గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిసే పరువుతో పాటు పదవి కూడా పోతుందని భయపడిన సీఎం కేశవ్.. ఎలాగైనా బీజూ గ్యాంగ్ నుంచి ఆకేళ్లను రప్పించాలకుంటాడు.ఐపీఎస్ మీనాక్షి సలహా మేరకు వైడీ రాజుకు ఈ ఆపరేషన్ని అప్పగించాలకుంటాడు. ట్రైనింగ్ టైంలో మీనాక్షి, రాజు ప్రేమలో ఉంటారు. ఓ కారణంగా విడిపోయి..ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ ఆపరేషన్ కోసం రాజు దగ్గరకు వెళ్తుంది మీనాక్షి. అయితే మీనాక్షి..రాజు మాజీ ప్రియురాలు అనే విషయం భాగ్యానికి తెలుస్తుంది. భర్తతో పాటు ఆమె కూడా ఆపరేషన్‌లో పాల్గొంటానని చెబుతుంది. ఒకవైపు మాజీ ప్రియురాలు..మరోవైపు భార్య మధ్య రాజు ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ చేశాడనేదే ఈ సినిమా కథ. పండగకి వచ్చారు ~ పండగని తెచ్చారు ❤️🔥❤️🔥❤️🔥#SankranthikiVasthunam grosses 45CRORE+ Worldwide on its first day at the box office🔥Victory @VenkyMama’s ALL TIME CAREER HIGHEST OPENING EVER 💥💥#BlockbusterSankranthikiVasthunam IN CINEMAS NOW 🫶@anilravipudi @aishu_dil… pic.twitter.com/V8A7Tha5lE— Sri Venkateswara Creations (@SVC_official) January 15, 2025 -
వెంకటేశ్ మూవీలో బుడ్డోడు.. క్యూట్ స్పీచ్‌తో అదరగొట్టేశాడు!
టాలీవుడ్ హీరో వెంకటేశ్ సంక్రాంతికి థియేటర్లలో నవ్వులు పూయిస్తున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈనెల 14న విడుదలైన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాక్సాఫీస్ వద్ద అలరిస్తోంది. ఈ సంక్రాంతికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ దొరికిందని టాలీవుడ్ సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ చిత్రంలో అందరినీ ఆకట్టుకున్నాడు ఓ బుడ్డోడు. వెంకటేశ్ కుమారుడిగా ఈ మూవీలో కనిపించిన రేవంత్ భీమల(బుల్లి రాజు) అనే చైల్డ్ ఆర్టిస్ట్ సంక్రాతికి వస్తున్నాం మూవీ ఈవెంట్లో సందడి చేశాడు. సినిమాలో మాత్రమే కాదు.. వేదికపై కూడా తన మాటలతో అందరికీ నవ్వులు తెప్పించాడు. ఇంతకీ ఆ బుడ్డోడు ఏమన్నాడో మీరు చూసేయండి.సక్సెస్ మీట్లో రేవంత్ మాట్లాడుతూ..'అందరికీ నమస్కారం.. నేను ఈ మూవీలో వెంకటేశ్ గారికి కుమారుడిగా చేశాను. వెంకటేశ్ లాంటి గొప్ప యాక్టర్‌తో పనిచేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆయనతో పనిచేసిన క్షణాలను నేను లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటాను. నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన అనిల్ సార్‌కు థ్యాంక్స్. పటాస్ మూవీ నుంచి మీకు నేను పెద్ద ఫ్యాన్‌ను. మీనాక్షి మేడం, ఐశ్వర్య మేడంతో నేను చాలా ఎంజాయ్ చేశాను. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. దిల్ రాజు సార్, శిరీష్ సార్‌కు చాలా థ్యాంక్స్. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ చాలా థ్యాంక్స్. మేము సంక్రాంతికి వస్తున్నాం.. మీరు సంక్రాంతికి రండి అని మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్ ఈ బుడ్డోడి స్పీచ్‌పై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. -
మేము అనుకున్నదే జరిగింది..ఆనందంగా ఉంది: వెంకటేశ్
సంక్రాంతి పండక్కి మంచి ఫ్యామిలీ సినిమా ఇవ్వాలని అనుకొని ‘సంక్రాంతికి వస్తున్నాం’ చేశాం. ఇలాంటి ఓ మంచి సినిమా వస్తే ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటారని తెలుసు. మేం అనుకున్నదే జరిగింది. ఫ్యామిలీ ఆడియన్స్, నా ఫ్యాన్స్ ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఫ్యామిలీ సినిమా చేసిన ప్రతిసారి ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చి ఎంజాయ్ చేయడం, వారిలో నవ్వులు చూడటం ఆనందంగా ఉంటుంది’ అన్నారు విక్టరీ వెంకటేశ్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’( Sankranthiki Vasthunam). అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తుంది.(చదవండి: ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ)ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో వెంకటేశ్(venkatesh) మాట్లాడుతూ.. ‘మా సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. రియాక్షన్స్ అన్నీ జెన్యూన్ గా ఉన్నాయి. మేము మంచి ఫ్యామిలీ సినిమా ఇవ్వాలనే దిగాం. సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పాం, అదే రోజున వచ్చి ఇంత పెద్ద హిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. అనిల్ నా కెరీర్ లో మరో బిగ్ బ్లాక్ బస్టర్ ఇవ్వడం సంతోషంగా ఉంది. ఇది తన కెరీర్ లో కూడా బిగ్ బ్లాక్ బస్టర్. దిల్ రాజు, శిరీష్ కు ఇది మరో బిగ్ హిట్. ఐశ్వర్య, మీనాక్షి టీం అందరి విషయంలో చాలా ఆనందంగా ఉన్నాను. అందరికీ చాలా థాంక్స్' అన్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) మాట్లాడుతూ.. బెసికలీ టెక్నికలీ కలర్ ఫుల్లీ హౌస్ ఫుల్లీ ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ పొంగల్(నవ్వుతూ). బెనిఫిట్ షోలకి ఫ్యాన్స్ యూత్ వెళ్తుంటారు. ఫస్ట్ టైం ఉదయం నాలుగున్నర షోలకి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ రావడం ఈ సినిమా ద్వారా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మాకు. థియేటర్లో ప్యాక్డ్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు. మాకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్స్. బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తీసుకున్నాం. పండగ రోజులు ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇది వెంకీ సార్ పొంగల్. మా సినిమాని సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’ అన్నారు.నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. మా కాంబినేషన్ లో ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్. ఎఫ్ 2 ని వారంలో సింపుల్ గా దాటేసి అద్భుతాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్లాక్ బస్టర్ సంక్రాంతి చేసిన అనిల్ కి, వెంకటేష్ గారికి, హీరోయిన్స్ కి, ప్రేక్షులందరికీ థాంక్ యూ. నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఉన్న సినిమా ఇది. ఖచ్చితంగా థియేటర్స్ లోనే చూసి ఎంజాయ్ చేయండి. పైరసీని ఎంకరేజ్ చేయకండి. ప్యాక్డ్ థియేటర్స్ లో చూసినప్పుడు ఆ ఫన్ వేరుగా ఉంటుంది. అందరికీ థాంక్ యూ' అన్నారు. ఈ సక్సెస్ మీట్లో హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌తో పాటు నిర్మాత శిరీష్ కూడా పాల్గొన్నారు. -
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ
టైటిల్: ‘సంక్రాంతికి వస్తున్నాం’నటీనటులు: వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి, వీకే నరేశ్, వీటీ గణేష్, సాయి కుమార్, సర్వదమన్ బెనర్జీ,ఉపేంద్ర లిమాయే తదితరులునిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు: శిరీష్, దిల్ రాజుదర్శకత్వం: అనిల్ రావిపూడిసంగీతం: భీమ్స్ సిసిరిలియోసినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డిఎడిటర్: తమ్మిరాజువిడుదల తేది: జనవరి 14, 2025ఈ సంక్రాంతికి చివరిగా వచ్చిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam Review). రిలీజ్ విషయంలో చివరిది అయినా.. ప్రమోషన్స్‌లో మాత్రం మిగతా సినిమాలతో పోలిస్తే ఇదే ముందంజలో ఉంది. ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు చేసినంత ప్రమోషన్ మరే సినిమాకు చేయలేదు. దానికి తోడు ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ అదిరిపోవడంతో ‘సంక్రాంతికి వస్తున్నాం’పై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ‘ఫ్యామిలీతో వచ్చిన ప్రతిసారి విక్టరీ గ్యారెంటీ’ అనిపించుకున్న వెంకటేశ్ ఖాతాలో మరో ‘ ఫ్యామిలీ విక్టరీ’ పడిందా రివ్యూలో చూద్దాం.కథేంటేంటే.. డీసీపీ యాదగిరి దామోదర రాజు అలియాస్ వైడీ రాజు(వెంకటేశ్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. మంచి కోసం తాను చేసే ఎన్కౌంటర్లను రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకొని..ఆయనను సస్పెండ్ చేస్తుంటారు. ఇది నచ్చక ఉద్యోగాన్ని వదిలేసి రాజమండ్రీ వెళ్లిపోతాడు రాజు. అక్కడ భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేశ్), నలుగురు పిల్లలతో కలిసి హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు. కట్ చేస్తే.. కేంద్రంతో గొడవపడి మరీ అమెరికాలోని ఓ బడా కంపెనీ సీఈఓ ఆకెళ్ల సత్యం(అవసరాల శ్రీనివాస్)ను తెలంగాణకు రప్పిస్తాడు ఇక్కడి ముఖ్యమంత్రి కేశవ్(నరేశ్). పార్టీ ప్రెసిడెంట్(వీటీ గణేశ్) కోరికమేరకు ఆకెళ్లను ఫామ్ హౌజ్ పార్టీకి పంపించగా.. బీజూ గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిసే పరువుతో పాటు పదవి కూడా పోతుందని భయపడిన సీఎం కేశవ్.. ఎలాగైనా బీజూ గ్యాంగ్ నుంచి ఆకేళ్లను రప్పించాలకుంటాడు. ఐపీఎస్ మీనాక్షి సలహా మేరకు వైడీ రాజుకు ఈ ఆపరేషన్ని అప్పగించాలకుంటాడు. ట్రైనింగ్ టైంలో మీనాక్షి, రాజు ప్రేమలో ఉంటారు. ఓ కారణంగా విడిపోయి..ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ ఆపరేషన్ కోసం రాజు దగ్గరకు వెళ్తుంది మీనాక్షి. అయితే మీనాక్షి..రాజు మాజీ ప్రియురాలు అనే విషయం భాగ్యానికి తెలుస్తుంది. భర్తతో పాటు ఆమె కూడా ఆపరేషన్‌లో పాల్గొంటానని చెబుతుంది. ఒకవైపు మాజీ ప్రియురాలు..మరోవైపు భార్య మధ్య రాజు ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ చేశాడనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే.. కొన్ని కథలు మన ఊహకందేలా సింపుల్‌గా ఉంటాయి. సినిమా ప్రారంభం మొదలు ఎండ్ వరకు ప్రతీది అంచనాకు తగ్గట్టే ఉంటాయి. కానీ తెరపై చూస్తుంటే తెలియని ఒక ఆనందం కలుగుతుంది. పాత కథ, రొటీన్ సీన్లే అయినప్పటికీ ఎంటర్టైన్ అవుతుంటాం. అలాంటి సినిమాలను తెరకెక్కించడం అనిల్ రావిపూడికి వెన్నతో పెట్టిన విద్య. సింపుల్ పాయింట్‌ని తీసుకొని రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకునేలా సినిమాలను తెరకెక్కిస్తుంటాడు. గత సినిమాల మాదిరే ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్. టైటిల్ మాదిరే సంక్రాంతికి అసలైన సినిమా ఇది.(Sankranthiki Vasthunam Review)అనిల్ రావిపూడి(Anil Ravipudi) రిలీజ్ ముందే సినిమా కథంతా చెప్పేస్తుంటాడు. ఈ సినిమా విషయంలోనూ అదే చేశాడు. ట్రైలర్లోనే కథంతా చెప్పేశాడు. హీరోహీరోయిన్ల క్యారెక్టర్ ఎలా ప్రవర్తిస్తాయో కూడా ప్రమోషన్స్‌లోనే చెప్పేశాడు. స్టోరీ మొత్తం తెలిసినా కూడా తెరపై ఆ కథను చూసి ఎంజాయ్ చేయాలని ప్రతి ప్రేక్షకుడు అనుకుంటాడు. దానికి కారణం.. ఈ కథ మెయిన్ పాయింట్. భార్య, భర్త, ప్రియురాలు.. ఈ మూడు పాత్రలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ కనిపిస్తాయి. వాళ్ల మధ్య వచ్చే ప్రతీ సీన్ మన నిజ జీవితంలో ఎక్కడో ఒక చోట చూసే ఉంటాం. అలాంటి పాయింట్ పట్టుకోవడమే అనిల్ రావిపూడి సక్సెస్. ఓ ఫ్యామిలీ స్టోరీకి ఓ వెరైటీ ఇన్వెస్టిగేషన్ యాడ్ చేసి ఫుల్ ఎంటర్టైనింగ్గా కథనాన్ని నడిపించాడు. ఆకెళ్ల కిడ్నాప్ సీన్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. అయితే ఈ కిడ్నాప్ సీన్‌ని కూడా ఎంటర్టైనింగ్గానే తీర్చిదిద్ది.. కథనం మొత్తం ఫుల్ కామెడీ వేలో సాగుతుందనే ముందే చెప్పేశాడు దర్శకుడు. ఆ తర్వాత రాజు ఫ్యామిలీ పరిచయం నవ్వులు పూయిస్తుంది. వైడీ రాజు కొడుకు బుల్లిరాజు పండించే కామెడీకి పడిపడి నవ్వుతారు. వైడీ రాజు ఇంటికి మీనాక్షి వచ్చిన తర్వాత కామెడీ డోస్ డబుల్ అవుతుంది. ఒక పక్క భార్య, మరో పక్క మాజీ ప్రియురాలుతో హీరో పడే బాధ థియేటర్లో నవ్వులు పూయిస్తుంది. ఆహ్లాదకరమైన పాటలు... పొట్టచెక్కలయ్యే కామెడీ సీన్లతో ఫస్టాఫ్ ఫుల్ ఎంటర్టైనింగ్గా ముగుస్తుంది. ఇక సెకండాఫ్ ప్రారంభం అయిన కాసేపటికే కథనం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. జైలర్ జార్జ్ ఆంటోనీ(ఉపేంద్ర లిమాయే)తో వచ్చే కొన్ని సీన్లు అంతగా ఆకట్టుకోవు. ఆస్పత్రి సీన్ కూడా రొటీన్‌గానే అనిపిస్తుంది. ‘ఆవకాయ’ సీన్‌కు అయితే పడిపడి నవ్వుతారు. క్లైమాక్స్‌ని పకడ్బందీగా రాసుకున్నాడు. క్లైమాక్స్ యాక్షన్ సీన్ అయితే అదిరిపోతుంది. అక్కడ వెంకటేశ్ చెప్పే డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి. ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతినకుండా.. మగవాళ్లకు మనో ధైర్యాన్ని ఇచ్చేలా ఆ డైలాగ్స్ ఉంటాయి. ముగింపులో ఇచ్చిన సందేశం ఆకట్టుకుంటుంది. మొత్తంగా సంక్రాంతికి చూడాల్సిన మాంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఎవరెలా చేశారంటే.. ఇద్దరి ఆడవాళ్ల మధ్య నలిగిపోయే పాత్రను వెంకటేశ్(Venkatesh) చేస్తే ఎలా ఉంటుందో ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ చిత్రంలోనే చూసేశాం. ఆయన కామెడీ టైమింగ్ గురించి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో కూడా వెంకీ అలాంటి పాత్రే చేశాడు. మాజీ ప్రియురాలు, భార్య మధ్య నలిగిపోయే యాదగిరి దామోదర రాజు పాత్రలో ఒదిగిపోయాడు. ఇద్దరి ఆడాళ్ల మధ్య నలిగిపోతూ నవ్వులు పూయించాడు. యాక్షన్‌తో అలరించడమే కాకుండా పాట పాడి ఆకట్టుకున్నాడు. ఇక చదువురాని పల్లెటూరి అమ్మాయి, రాజు భార్య భాగ్యంగా ఐశ్వర్య రాజేశ్ తనదైన నటనతో ఆకట్టుకుంది.రాజు మాజీ ప్రియురాలు, ఐపీఎస్ అధికారి మీనాక్షిగా మీనాక్షి చౌదరి అదరగొట్టేసింది. తొలిసారి ఇందులో యాక్షన్ సీన్ కూడా చేసింది. ఇక వీరందరితో పాటు ముఖ్యంగా మట్లాడుకోవాల్సిన మరో పాత్ర బుల్లి రాజు. ఈ పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ ఒదిగిపోయాడు. ఇంత మంది స్టార్స్ ఉన్నప్పటికీ.. తనదైన నటనతో అందరి దృష్టి ఆకట్టుకున్నాడు. ఫస్టాఫ్ ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగాడానికి బుల్లిరాజు పాత్ర కూడా ఒక ప్రధాన కారణం. ‘కొరికేస్తా.. కొరికేస్తా’ అంటూ ఈ బుడ్డోడు చేసిన కామెడీకి ప్రేక్షకులు పలగబడి నవ్వారు. నరేశ్, సాయి కుమార్, సర్వదమన్ బెనర్జీ,ఉపేంద్ర మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. ముఖ్యంగా భీమ్స్ అందించిన సంగీతం సినిమాకే హైలెట్. అద్భుతమైన పాటలతో పాటు అదిరిపోయే బీజీఎం ఇచ్చాడు. ‘గోదారి గట్టు మీద...’పాటతో పాటు ప్రతి పాట తెరపై చూసినప్పుడు మరింత ఆకట్టుకునేలా ఉంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్విటర్ రివ్యూ
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు సెన్సేషనల్ హిట్ గా నిలిచి సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలని మరింతగా పెంచింది. భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 14) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు కొన్ని చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. సంకాంత్రికి వస్తున్నాం సినిమా కథ ఏంటి..? ఎలా ఉంది..? వెంకీ, అనిల్ కాంబో ఖాతాలో హ్యాట్రిక్ హిట్ పడిందా లేదా..? తదితర అంశాలను ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.ఎక్స్‌లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి పాజిటివ్ టాక్ వస్తుంది. సినిమా ఎంటర్టైనింగ్గా ఉందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. రొటీన్ కథ అయినప్పటికీ కామెడీ బాగా వర్కౌట్ అయిందని చెబుతున్నారు. #SankranthikiVasthunamDone with my show 💯2nd half is hilarious 🤣 That avakaya episode is too goodAlthought it felt lengthy at parts, @AnilRavipudi handled last 30 minutes very well and ended with a messageMy rating would be 3.5/5Families gonna have a feast in… pic.twitter.com/HtUK07VSmT— INNOCENT EVIL 😈 (@raju_innocentev) January 14, 2025 ఇప్పుడే సినిమా చూశాను. సెకండాఫ్ హిలేరియస్. అవకాయ ఎపిసోడ్ అదిరిపోయింది. అయితే కొన్ని సీన్లు సాగదీతగా ఉన్నాయి. చివరి 30 నిమిషాలు అనిల్ రావిపూడి చక్కగా హ్యాండిల్ చేశాడు. ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన సినిమా ఇది అంటూ ఓ నెటిజన్ 3.5 రేటింగ్‌ఇచ్చాడు.#SankranthikiVasthunam is a timepass festive family entertainer with the only motive being to entertain. The film flows in a Typical zone that Director Ravipudi follows similar to F2. The comedy works well in parts but is over the top and irritates a bit in others. Production…— Venky Reviews (@venkyreviews) January 13, 2025 సంక్రాంతికి వస్తున్నాం టైంపాస్ కామెడీ సినిమా. పండక్కి వినోదాన్ని అందించే చిత్రం. ఎఫ్2 మాదిరే హిలేరిస్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు అనిల్ రావిపూడి. పార్టులుగా చూస్తే కామెడీ బాగా వర్కౌట్ అయింది. ప్రొడక్షన్ క్యాలిటీస్ అంతగా బాగోలేవు. సినిమాలో పెద్ద కథ కూడా ఉండదు. లాజిక్స్ గురించి పట్టించుకోవద్దు. వెంకటేశ్ తనదైన నటనతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు బాగున్నాయి. క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. ఈ పండక్కి ఫ్యామిలీస్‌కి ఈ సినిమా మంచి ఛాయిస్ అంటూ మరో నెటిజన్ 2.75 రేటింగ్ ఇచ్చాడు.#SankranthikiVasthunam Liked it! Baagundi!A hilarious entertainer with mediocre story but makes you laugh out loud❤️The theme itself has a lot of potential to make you chuckle, #Venkatesh & #AnilRavipudi are very successful in it#AishwaryaRajesh is impressive👌FUN GUARANTEED! pic.twitter.com/J8AVr2Nei5— Sanjeev (@edokatile) January 14, 2025CLEAN HIT 🎯 🎯 #SankranthikiVasthunam is a fun family Entertainer with Anil Ravipudi's racyscreenplay and songs.🥵🎶🎶It's a Good Family Entertainer 3.5/5 Rating 🤞🤙#SankranthikiVasthunamreview #makarsankranti2025 #Pongal#HappyLohri #MahaKumbh2025 #MakaraSankranti2025 pic.twitter.com/2tJWwcbzTz— Ashok (@imashok1234) January 14, 2025#SankranthikiVasthunam - Family Entertainer!Anil Ravipudi succeeds in entertaining his target audience with a fun film. Bheems music and songs💥Family audience elaago hit ichestharu🫡#SankranthikiVasthunamReview #SankranthikiVasthunnam#VenkyMama #Venkateshdaggubati https://t.co/SHy9jWy6r4 pic.twitter.com/Vokja82Kdi— IndianCinemaLover (@Vishwa0911) January 14, 2025#Bheemsceciroleo music is very good - foot tapping and BGM is 🔥Except some over the top scenes ( as expected ) everything goes according to @AnilRavipudi 's meter and should score a hit for this pongal too.#SankranthikiVasthunam #SankranthikiVasthunamreview— Shiva Kumar Grandhi (@sivakumargrandh) January 13, 2025#SankranthikiVasthunamReview - For Families!Positives:- Venky Mama 👌❤️ - Bheems' Music and Songs ❤️❤️ - Comedy Scenes 😂 Negatives:- Over-the-top Scenes,Especially in the Second Half - Predictable PlotAn Enjoyable Entertainer for Families! Follow 👉…— Movies4u Reviews (@Movies4uReviews) January 13, 2025 -
సంక్రాంతికి మంచి మూవీతో వస్తున్నాం: వెంకటేశ్
‘‘సంక్రాంతికి వస్తున్నాం’ బాగా వచ్చింది. మీరంతా మీ ఫ్యామిలీతో థియేటర్స్‌కు వచ్చి, మా సినిమాని ఎంజాయ్ చేయండి’’ అన్నారు వెంకటేశ్. ఆయన హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూ΄పొందిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం నేడు (మంగళవారం) విడుదలవుతోంది.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘బ్లాక్‌బస్టర్ మ్యూజికల్ నైట్’ ఈవెంట్లో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘సంక్రాంతికి వస్తున్నాం’ తరహా సినిమాలను నా ఫ్యాన్స్ ఎక్కువగా ఇష్టపడతారు. అనిల్ ప్రతి సీన్‌ని అద్భుతంగా తీశాడు. మళ్లీ మేము సంక్రాంతికి మంచి సినిమాతో వస్తున్నాం’’ అన్నారు. ‘‘వెంకటేశ్‌గారితో నేను చేసిన మూడో ఫిల్మ్ ఇది. ఆడియన్స్ హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం. ఈ సినిమా నా కెరీర్లోనే బెస్ట్ ఎంటర్టైనర్గా నిలవనుంది’’ అని తెలిపారు అనిల్ రావిపూడి.‘‘వెంకటేశ్‌గారితో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. నా కల నిజమైనట్లుగా ఉంది’’ అని పేర్కొన్నారు సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో. ‘‘ఈ సినిమాను ప్రేక్షకులు పెద్ద సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు ‘దిల్’ రాజు. ఈ వేడుకలో నటుడు ఉపేంద్ర లిమాయే, సింగర్ రమణ గోగుల, లిరిక్ రైటర్స్ రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్, ఎడిటర్ తమ్మిరాజు, డీవోపీ సమీర్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. -
విజయ్ చివరి సినిమా రీమేక్? ఉన్నదంతా కక్కేసిన నటుడు.. అనిల్ అసహనం
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్. దీనికంటే ముందు ఆయన భగవంత్ కేసరి సినిమా (Bhagavanth Kesari Movie) చేశాడు. దీనికి అనిల్ రావిపూడి డైరెక్టర్. ఈయన కామెడీని పక్కన పెట్టి మొదటిసారి ఎమోషనల్ డ్రామా పండిచే ప్రయత్నం చేశాడు. తొలి ప్రయత్నంలోనే సక్సెసయ్యాడు. 2023లో వచ్చిన భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది.ఒకే సినిమాను ఐదుసార్లు చూసిన విజయ్‌అయితే ఈ సినిమాపై తమిళ స్టార్ విజయ్ (Vijay) మనసు పారేసుకున్నాడట! ఒకటీరెండు సార్లు కాదు ఏకంగా ఐదుసార్లు చూశాడట! ఈ విషయాన్ని తమిళ నటుడు వీటీవీ గణేశ్.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈవెంట్లో వెల్లడించాడు. గతేడాది చెన్నైలో హీరోను విజయ్ను కలిశాను. నాకు అనిల్ రావిపూడి ఫ్రెండ్ అని విజయ్‌కు తెలుసు. తన చివరి సినిమాను అనిల్‌ను డైరెక్ట్ చేయమని అడిగాడు. కానీ అందుకు అనిల్ ఒప్పుకోలేదు. భగవంత్ కేసరి సినిమాను విజయ్ ఐదుసార్లు చూశాడు.పెద్ద డైరెక్టర్లు క్యూలో ఉన్నా..తనకు ఈ మూవీ చాలా బాగా నచ్చింది. తనకోసం తమిళంలో ఈ సినిమా తీస్తావా? అని అనిల్ రావిపూడి (Anil Ravipudi)ని పిలిచి అడిగాడు. కానీ అందుకు అనిల్ ఒప్పుకోలేదు. తాను రీమేక్ చేయనని ముఖం చెప్పి వచ్చేశాడు. నలుగురైదుగురు పెద్ద డైరెక్టర్లు విజయ్ చివరి సినిమా చేసేందుకు లైన్లో నిల్చుంటే అనిల్ మాత్రం చేయనని చెప్పి వచ్చేశాడు అని చెప్పుకొచ్చాడు. ఇంతలో అనిల్ రావిపూడి మధ్యలో కలుగజేసుకుంటూ సినిమానే చేయను అనలేదు, రీమేక్ చేయనన్నాను అని క్లారిటీ ఇచ్చాడు.అప్పుడు నేనూ చూశాగణేశ్ మళ్లీ మాట్లాడుతూ.. విజయ్ ఆ సినిమాను అయిదుసార్లు ఎందుకు చూశాడా? అని నేనూ భగవంత్ కేసరి చూశాను. అప్పుడు నాకు.. అనిల్ బానే తీశాడనిపించింది అని చెప్పుకొచ్చాడు. దీంతో విజయ్ చివరి సినిమా ఏదై ఉంటుందన్న చర్చ మొదలైంది. అనిల్ రావిపూడి వద్దన్నప్పటికీ మరో డైరెక్టర్‌తో భగవంత్ కేసరి రీమేక్ చేస్తాడా? లేదా? ఇంత మంచి ఆఫర్‌ను అనిల్ ఎందుకు వదులుకున్నాడు? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే విజయ్ 69 వ సినిమాయే చివరి చిత్రమని అందరూ భావిస్తున్నారు. దీని తర్వాత విజయ్ పూర్తిగా రాజకీయాలకే పరిమితం కానున్నాడు.చదవండి: గేమ్ ఛేంజర్‌కు ఊహించని కలెక్షన్స్ .. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే? -
వెంకటేశ్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం మ్యూజికల్ నెట్లో చిందులేసిన సినీ తారలు (ఫోటోలు)
-
అలాంటి నటన నాకు రాదు: హీరో వెంకటేశ్
‘‘జీవితాన్ని హాయిగా.. సంతోషంగా జీవించాలి. అత్యాశలకు పోకూడదు. అతిగా ఆలోచించకూడదు. మన ఆలోచనలు సానుకూలంగానే ఉండాలి. అదే సమయంలో మనం ఏదైనా కోరుకుంటున్నప్పుడు ఆ పనిని నిజాయితీతో చేయాలి. క్రమశిక్షణగా ఉండాలి... కష్టపడాలి. అప్పుడు సాధ్యమౌతుంది. లైఫ్‌లో ఎప్పుడూ హోప్‌ను కోల్పోకూడదు. నా లైఫ్‌లో సినిమా ప్రమోషన్స్ అయినా, మరేదైనా నేను పెద్దగా ప్లాన్ చేసి చేయను. అలా ప్లాన్ చేసి చేస్తే అది యాక్టింగ్ అవుతుంది. అలాంటి నటన నాకు రాదు. వాస్తవానికి దగ్గరగా, సహజంగా ఓ ఫ్లోలో నా ధోరణిలో ముందుకు వెళ్తుంటాను’’ అన్నారు హీరో వెంకటేశ్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల14న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరులతో వెంకటేశ్ చెప్పిన సంగతులు.⇒ నా కెరీర్లో సంక్రాంతికి వచ్చిన మెజారిటీ సినిమాలు విజయం సాధించాయి. ఇప్పుడు ‘సంక్రాంతి వస్తున్నాం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ఈ పండక్కి పర్ఫెక్ట్ ఫిల్మ్. ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. సినిమాలో చిన్న క్రైమ్ ఎలిమెంట్ ఉంది. అయినా ఇది మంచి వినోదాత్మక చిత్రం. క్లైమాక్స్‌లో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. పిల్లలు, పెద్దలు, యూత్... ఇలా అందరూ ఎంజాయ్ చేసే ఫిల్మ్ ఇది. సినిమాలోని కొన్ని సీన్స్‌లో సంక్రాంతి పండగ సన్నివేశాలు ఉన్నాయి. అందుకే ఈ మూవీకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ పెట్టడం జరిగింది⇒ నాది, దర్శకుడు అనిల్‌ది సూపర్‌హిట్ కాంబినేషన్. మాజీ పోలీసాఫీసర్, అతని మాజీ ప్రేయసి, అతని భార్య... మధ్యలో ఓ క్రైమ్‌స్టోరీ... ఇలా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా లైన్ తను చెప్పగానే చాలా కొత్తగా అనిపించింది. మినిమమ్ గ్యారెంటీ సినిమా అని తెలిసిపోయింది. సినిమాలో కామెడీ రొటీన్‌గా ఉండదు. కొత్త కామెడీ స్టయిల్ ట్రై చేశాం. ఆడియన్స్‌కు నచ్చుతుందనే అనుకుంటున్నాం. అలాగే అనిల్‌తో నాకు మంచి ర్యాపో కుదిరింది. తనతో మూవీస్‌ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఈ సినిమాలో హీరోయిన్స్ ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షీ చౌదరి బాగా నటించారు. ఇద్దరి క్యారెక్టర్స్ క్రేజీగా ఉంటాయి. ⇒ నాన్నగారు (నిర్మాత డి. రామానాయుడు) స్టోరీ సిట్టింగ్స్, మ్యూజిక్ సిట్టింగ్స్, సినిమా ప్రొడక్షన్ వంటి అంశాలను చర్చిస్తున్నప్పుడు నేను పాల్గొనేవాడిని. అయితే నేను అప్పటికి సినిమాల్లోకి రాలేదు. కెరీర్ స్టార్టింగ్‌లో ఇప్పటి ప్రముఖ సంగీత దర్శకులతో మ్యూజిక్ సిట్టింగ్స్ చేశాను. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని ‘బ్లాక్‌బస్టర్ పొంగల్’ సాంగ్ విన్నప్పుడు ఈ సాంగ్ నేనే పాడాలనుకున్నాను... పాడాను. సాంగ్స్‌లో ఎక్కువగా ఇంగ్లిష్ పదాలే ఉన్నాయి కాబట్టి నాకు సులభంగా అయిపోయింది. అయితే మిగతా పాటలకు కూడా మంచి స్పందన వస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఈ మూవీ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో చాలా కష్టపడ్డాడు. అలాగే కొంత గ్యాప్ తర్వాత రమణ గోగులగారు మా సినిమాలో పాట పాడటం హ్యాపీగా అనిపించింది. ‘గోదారి గట్టు, మీనూ, బ్లాక్‌బస్టర్ పొంగల్...’ పాటలు బ్లాక్‌బస్టర్ కావడం అనేది ఆడియన్స్ గొప్పతనం. ⇒ ‘సీతమ్మ వాకిట్లో..’ చిత్రం నుంచి ‘దిల్’ రాజుగారితో నా జర్నీ కొనసాగుతోంది. వారి బ్యానర్లో నేను చేసిన సినిమాలన్నీ బాగా ఆడాయి. ఆయనకు మరిన్ని విజయాలు రావాలి. నా తర్వాతి సినిమా కోసం సురేష్ప్రొడక్షన్, సితార, మైత్రీ, వైజయంతి మూవీస్ సంస్థల్లో కథల పై వర్క్ జరుగుతోంది. ఇక ‘రానా నాయుడు 2’ సిరీస్ మార్చిలో స్ట్రీమింగ్ కావొచ్చు. -
క్లైమాక్స్ చాలా సర్ ప్రైజ్ చేస్తుంది :వెంకటేశ్
విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హీరో వెంకటేశ్ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ నా కెరీర్లో వస్తున్న మరో సంక్రాంతి సినిమా ఇది. ఒక క్లీన్ ఎంటర్ టైనింగ్ ఫిల్మ్ తో రావడం చాలా ఆనందంగా ఉంది. లిటిల్ క్రైమ్ ఎలిమెంట్ న్యూ జానర్ కూడా ఉంది. సినిమా జర్నీని చాలా ఎంజాయ్ చేశాను. అంతా పాజిటివ్ గా ఉంది. నా కెరీర్ లో సంక్రాంతికి వచ్చిన మోస్ట్ ఫిలిమ్స్ చాలా బాగా ఆడాయి. ఈ సినిమా కూడా అద్భుతంగా ఆడుతుందనే నమ్మకం ఉంది. → ఈసారి ప్రమోషన్స్ చాలా ఎనర్జిటిక్ గా చేయడానికి ప్రత్యేక కారణమేది లేదు. నేచురల్ గా జరిగింది. మ్యూజిక్ చాలా నచ్చింది. నాకు డ్యాన్స్ చేయడం ఇష్టం. కొన్ని మ్యూజిక్ ట్యూన్స్ వినగానే క్రేజీగా అనిపించింది. అలాగే డైరెక్టర్ అనిల్, ఇద్దరు హీరోయిన్స్.. లైవ్లీ టీం కుదిరింది. ప్రమోషన్స్ లో ఏదైనా కొత్తగా చేయాలని అనుకున్నాం. ప్రమోషన్స్ ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేయడం హ్యాపీగా ఉంది.→ ఇందులో రమణ గోగుల గారు పాడిన పాట పెద్ద హిట్ అయ్యింది. చాలా గ్యాప్ తర్వాత ఆయన నా సినిమాకి పాడారు. పాటకు అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది.→ ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్.. ఈ లైనే చాలా ఫ్రెష్ గా అనిపించి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చేయాలనుకున్నా. మినిమం గ్యారెంటీ అని అక్కడే తెలిసిపోయింది. అనిల్ నాది సూపర్ హిట్ కాంబినేషన్. మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. పెర్ఫార్మెన్స్ వైజ్ ఇందులో కామెడీ స్టయిల్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. చాలా షటిల్ గా కొత్తగా ట్రై చేశాం. ఫ్రెష్ సీన్స్ ఉంటాయి. సినిమా అద్భుతంగా వచ్చింది. అనిల్ తో మంచి రేపో కుదిరింది. తనతో మూవీస్ కంటిన్యూ చేయాలని ఉంది.→ భీమ్స్ చాలా హార్డ్ వర్క్ చేసి బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. తనకి ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందనే నమ్మకంతో చేశాడు. ఫస్ట్ ట్యూన్ వినగానే హిట్ అనుకున్నాం. అది సూపర్ బ్లాక్ బస్టర్ అయ్యింది. అది ఆడియన్స్ గొప్పదనం. గోదారి గట్టు పాట 85 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. అన్ని పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.→ సినిమాని ఫాస్ట్ గా ఫినిష్ చేయడం హ్యాపీగా అనిపించింది. అనుకున్నదాని ప్రకారం అన్నీ అద్భుతంగా కుదిరాయి. ఓ మంచి చిత్రంతో వస్తున్నాం. క్లైమాక్స్ చాలా సర్ప్రైజ్ చేస్తుంది. పిల్లలు, పెద్దలు, యూత్ అందరూ ఎంజాయ్ చేస్తారు. → ప్రస్తుతం ఒక్క సినిమా కూడా కమిట్ అవ్వలేదు.సురేష్ ప్రొడక్షన్, సితార వంశీ, మైత్రీ, వైజయంతి మూవీస్ లో కథల పై వర్క్ జరుగుతుంది. ఇంకా ఏదీ ఫైనలైజ్ కాలేదు. -
గోదారి గట్టు మీద రామ సిలకవే.. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ (ఫొటోలు)
-
ఆ సాంగ్ విని అర్థరాత్రి రెండు గంటలకు డ్యాన్స్ చేశా: వెంకటేశ్
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో విక్టరీ వెంకటేశ్(venkatesh) ఓ పాట పాడిన సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ పొంగల్ అంటూ సాగే ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తుంది. యూట్యూబ్‌లో మిలియన్లకొద్ది వ్యూస్ వస్తున్నాయి. అయితే ఈ పాట మొదట వెంకటేశ్‌తో పాడించాలని అనుకోలేదట మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో. దర్శకుడు అనిల్ రావిపూడికి కూడా ఆ ఆలోచన లేదట. కానీ వెంకటేశ్ పాడతానని అనడంతో ట్రై చేశారట. అది కాస్త బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ పాట గురించి వెంకటేశ్ కూడా మాట్లాడారు. తనకు బాగా నచ్చడంతోనే ఆ పాట పాడినట్లు చెప్పాడు. అంతేకాదు ఆ పాట వినగానే తెలియకుండా డ్యాన్స్ చేశాడట.‘అనిల్ రావిపూడి(Anil Ravipudi) నాకు ఈ పాటను షేర్ చేసి వినమని చెప్పారు. అర్థరాత్రి 2 గంటలకు ఆ సాంగ్ వింటూ తెలియకుండా డాన్స్ చేశాను. ఎదో క్రేజీ ఎనర్జీ ఆ సాంగ్ లో ఉంది. సరదాగా నేనే పాడతానని అన్నాను. ఆ రోజు గొంతు బాగానే ఉంది. ఇంగ్లీష్ వర్డ్స్ ఉండటంతో నాకు ఇంకా ఈజీ అయ్యింది’ అని వెంకటేశ్ అన్నారు. అలాగే రమణ గోగుల పాడిన పాటకు బాగా నచ్చిందని, చాలా గ్యాప్ తర్వాత ఆయన నా సినిమాకి పాట పాడడం, దానికి అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉందన్నారు.ముచ్చటగా మూడోదిఅనిల్ రావిపూడి, వెంకేటశ్లది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 చిత్రాలు ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఈ రెండు చిత్రాలు కూడా దిల్ నిర్మాణ సంస్థలో తెరకెక్కిన చిత్రాలే. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఈ సూపర్ హిట్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam). ఈచిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. సంక్రాంతికి కానుకగా జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది.ప్రమోషన్స్‌లో సూపర్ హిట్ఈ సంక్రాంతికి మూడు చిత్రాలు పోటీ పడ్డాయి. అందులో మొదటి చిత్రం గేమ్ ఛేంజర్ అల్రెడీ రిలీజైంది. రేపు(జనవరి 12) బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ రిలీజ్ కానుంది. ఆ తర్వాత ఒక రోజు గ్యాప్‌తో ‘సంక్రాంతికి వస్తున్నాం’రిలీజ్ అవుతుంది. అయితే ఈ మూడు సినిమాల ప్రమోషన్లలో విషయంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ముందంజలో ఉంది. అన్నింటికంటే చివరిగా రిలీజ్ అవుతున్నప్పటికీ.. మిగతా రెండు సినిమాల కంటే ముందే ప్రచారాన్ని ప్రారంభించాయి. డిఫరెంట్ ప్రమోషన్స్‌తో సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లారు. ఒక పక్క అనిల్ రావిపూడి హీరోయిన్లు, మరోపక్క విక్టరీ వెంకటేశ్, అందరూ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకు కావాల్సినంత ప్రచారాన్ని చేశారు. కేవలం ఇంటర్వ్యూలో మాత్రమే కాకుండా టీవీ షోలు, కామెడీ షోలు అన్నింటిల్లోనూ పాల్గొన్నారు. వెంకటేశ్ అయితే గతంలో ఎప్పుడు లేనివిధంగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరి ప్రమోషన్లలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద కూడా అదే స్థాయిలో రానిస్తుందో లేదో మరో రెండు రోజుల్లో తేలిపోతుంది. -
తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన దిల్ రాజు
సంక్రాంతి బరిలో గేమ్ ఛేంజర్ దిగిపోగా రేపు డాకు మహారాజ్ ఎంట్రీ ఇవ్వనుంది. జనవరి 14 సంక్రాంతికి వస్తున్నాం మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు గేమ్ ఛేంజర్, ఇటు సంక్రాంతికి వస్తున్నాం.. ఈ రెండు సినిమాలకు దిల్ రాజే నిర్మాత. అందుకే క్షణం తీరిక లేకుండా ప్రమోషన్ల కోసం అటూ ఇటు పరుగులు తీస్తున్నారు.నిజమాబాద్‌లో ఈవెంట్ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను తన సొంత జిల్లా నిజామాబాద్‌లో నిర్వహించారు. ఈసారి స్పీచ్ మామూలుగా ఉండొద్దు.. ఒక్క దెబ్బకు వైరల్ అయిపోవాలని యాంకర్ శ్రీముఖి కోరడం.. ఇప్పుడు చూడు, నా తడాఖా చూపిస్తా అన్న రేంజ్లో దిల్ రాజు రెచ్చిపోవడం జరిగాయి. ఈ క్రమంలోనే స్టేజీపై హుషారుగా మాట్లాడాడు.దిల్ రాజు హుషారైన స్పీచ్స్టేజీపై ఉన్న హీరో వెంకటేశ్‌ను చూస్తూ.. సర్, మా నిజామాబాద్‌ల తెల్ల కల్లు ఫేమస్. పొద్దునపూట నీర తాగితే వేరే లెవల్ ఉంటుంది. మా వోళ్లకు (తెలంగాణ ప్రజలకు) సినిమా అంటే అంత ఆసక్తి ఉండదు. అదే ఆంధ్రకు వెళ్తే సినిమాకు స్పెషల్ వైబ్ ఇస్తారు. తెలంగాణలో మటన్, తెల్లకల్లుకే వైబ్ ఇస్తారు అని స్పీచ్ దంచుకుపోయాడు. ఆయన స్పీచ్‌కు అక్కడున్నవారు చప్పట్లు కొట్టినా సోషల్ మీడియాలో మాత్రం మిశ్రమ స్పందన లభించింది. తెలంగాణవాసి అయ్యుండి మన ప్రాంతాన్ని కించపరిచేలా మాట్లాడతాడా? అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ వివాదంపై దిల్ రాజు (Dil Raju) స్పందించాడు.(చదవండి: అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టులో ఊరట)దావత్ గురించి మాట్లాడా..మొన్నీ మధ్య నిజామాబాద్‌లో సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ చేశాం. నిజామాబాద్ పట్టణంలో పెద్దగా సినిమా ఈవెంట్లు జరగవు. అప్పట్లో ఫిదా సక్సెస్ మీట్ చేశాం.. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనేది చేశాం. నిజామాబాద్వాసిగా ఆ జిల్లాతో నాకున్న అనుబంధం అలాంటిది! అందుకే అక్కడ ఈ మూవీ ఈవెంట్ చేశాం. అప్పుడు నేను మన కల్చర్‌లో ఉండే దావత్ గురించి మాట్లాడాను. తెల్ల కల్లు, మటన్ గురించి మాట్లాడాను. నా మాటలతో తెలంగాణవాళ్లను అవమానించానని, తెలంగాణను హేళన చేశానని కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.క్షమించండినా ఉద్దేశమేంటో అదే స్పీచ్‌లో చెప్పాను. మన కల్చర్, దావత్ నేను మిస్ అవుతున్నాను.. సంక్రాంతికి నా రెండు సినిమాలు రిలీజయ్యాక తెలంగాణ దావత్ చేసుకోవాలనుందని చెప్పాను. మన విధానాలను నేను అభిమానిస్తాను. అది అర్థం చేసుకోకుండా సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తున్నారు. నా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతినుంటే క్షమించండి అని చెప్పుకొచ్చాడు.ఎలా అనుకున్నారు?నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడలో ఫిదా సినిమా షూటింగ్ చేశాం. మనం కుటుంబానికి ఎంత విలువిస్తాం, మన కల్చర్ ఏంటనేది ఆ మూవీలో చూపించాం. ఫిదా ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద హిట్టయిందో తెలుసు. అలాగే బలగం చిత్రాన్ని కూడా అందరూ గుండెకు హత్తుకున్నారు. తెలంగాణవాసిగా మన రాష్ట్రాన్ని అభిమానించే నేను హేళన చేస్తానని ఎలా అనుకున్నారో అర్థం కావడం లేదు. మీ మనో భావాలు దెబ్బతింటే నన్ను క్షమించండి. రాజకీయాల్లోకి లాగకండిఎఫ్డీసీ చైర్మన్‌గా సినిమాకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ హైదరాబాద్‌లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఉంచుతాను. తెలంగాణలో ఉండే రాజకీయ పార్టీలకు నా విజ్ఞప్తి. నన్ను రాజకీయాల్లోకి లాగకండి. ఎఫ్డీసీ సినిమాకు సంబంధించిందే కానీ రాజకీయాలకు సంబంధించినది కాదు. ఎఫ్డీసీ, నేను సినిమాలకే ఉపయోగపడతాం. అవసరంలేని విషయాల్లో నన్ను లాగొద్దని కోరుతున్నాను అన్నాడు. #DilRaju garu has spoken out about the Nizamabad incident, offering his sincere apologies to anyone who may have been hurt. He has requested not to associate him with politics in any way. pic.twitter.com/X9W3grU8O0— Sri Venkateswara Creations (@SVC_official) January 11, 2025 చదవండి: ప్రభాస్ పెళ్లి ఎవరితో.. రివీల్ చేసిన రామ్ చరణ్ -
సంక్రాంతికే రావాలనుకున్నాం: అనిల్ రావిపూడి
‘‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని ‘బ్లాక్ బస్టర్ ΄పొంగల్...’ అనే పాట వెంకటేశ్‌గారికి చాలా నచ్చింది. దీంతో ఆయనే స్వయంగా ఆ పాట పాడతానని చెప్పడంతో నేను షాక్ అయ్యాను. కానీ ఆయన 20 నిమిషాల్లో ఆ పాట పాడటంతో సంగీత దర్శకుడు భీమ్స్ కూడా షాక్ అయ్యాడు’’ అని డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పారు. వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి విలేకరులతో పంచుకున్న విశేషాలు... ⇒ వెంకటేశ్‌గారితో నేను తీసిన ‘ఎఫ్ 2’ (2019) సంక్రాంతికి వచ్చి, విజయం సాధించింది. ‘ఎఫ్ 3’ కూడా సంక్రాంతికి రావాల్సింది కానీ మిస్ అయ్యింది. మా కాంబోలో మూడో సారి చేసే సినిమాని ఎలాగైనా పండగకి తీసుకొస్తే బావుంటుందని సినిమా ఆరంభం అప్పుడే సంక్రాంతికి రావాలనుకున్నాం. కథ అనుకున్నప్పుడే ‘సంక్రాంతికి వస్తున్నాం’ టైటిల్‌కి ఫిక్స్ అయ్యాం. ‘సంక్రాంతికి వస్తున్నాం’ కథ ఒక రెస్క్యూ ఆపరేషన్‌కి సంబధించినది. సెకండ్ హాఫ్‌లో నాలుగు రోజుల ప్రయాణం సంక్రాంతికి ముందు ల్యాండ్ అవుతుంది. ఒక భార్య, మాజీ ప్రేయసి మధ్య నలిగే ఓ భర్త పాత్ర వెంకటేశ్గారిది. ప్రతి ఫ్యామిలీ రిలేట్ చేసుకునే సినిమా ఇది. ట్రైలర్ అందరికీ బాగా నచ్చింది. థియేటర్స్‌కి వచ్చాక సినిమా అద్భుతంగా నచ్చితే మూవీ బ్లాక్ బస్టరే.⇒ కోవిడ్ తర్వాత సినిమా సినారియో మారిపోయింది. మంచి కథ రాసి, గొప్పగా తీస్తే సరిపోదు. థియేటర్స్‌కి జనాలు రాకపోతే సినిమాకి రీచ్ ఉండదు. ఇప్పుడు ఆడియన్స్ బాగా సెలెక్టివ్ అయిపోయారు. మన సినిమా వారి అటెన్షన్‌ని గ్రాబ్ చేస్తేనే ఓపెనింగ్స్ తెచ్చుకోగలమని నా అభిప్రాయం. ఈసారి ప్రమోషన్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టాం. వెంకటేశ్‌గారి లాంటి పెద్ద స్టార్ హీరో సరదాగా అల్లరి చేయడం, రీల్స్ చేయడం ప్రమోషన్స్‌కి చాలా హెల్ప్ అయ్యింది. నేను హీరోలకి ఫ్యాన్‌గానే ఉంటాను. రిలేషన్‌ని పాజిటివ్‌గా ఉంచుతాను కాబట్టి వాళ్ల నుంచి కూడా అంతే ప్రేమ వస్తుంది.⇒ ‘దిల్’ రాజుగారితో ‘పటాస్’ సినిమాతో నా ప్రయాణం ఆరంభమైంది. రాజుగారు, శిరీష్ గారు అంటే నా కుటుంబం లెక్క. మాది పదేళ్ల ప్రయాణం. ఇక ఉమెన్ సెంట్రిక్‌గా ఒక స్పోర్ట్స్ స్టోరీ చేయాలని ఎప్పటి నుంచో ఉంది. కొన్నాళ్ల తర్వాత ఆ నేపథ్యంలో మూవీ చేస్తాను. ‘ఎఫ్ 4’ సినిమా కచ్చితంగా ఉంటుంది. అయితే దానికి ఇంకా సమయం ఉంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకి కూడా ఫ్రాంచైజీలు చేసుకునే అవకాశం ఉంది. -
ఈసారి సంక్రాంతి నాదే అంటున్న వెంకటేష్
-
ఆ ట్రోల్స్ తట్టుకోలేక డ్రిపెషన్లోకి వెళ్లా: మీనాక్షి చౌదరి
సినిమా నటీనటులకు ట్రోలింగ్ అనేది మాములే. ఏదో ఒక విషయంలో వారిని ట్రోల్ చేస్తునే ఉంటారు. ఇక గాసిప్స్ గురించి చెప్పనక్కర్లేదు. పర్సనల్ విషయాల్లోనూ చాలా పుకార్లు సృష్టిస్తుంటారు. కానీ కొంతమంది హీరోహీరోయిన్లు వీటిని పెద్దగా పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ పోతారు. మరికొంతమంది మాత్రం సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌ని భరించలేకపోతారు. భయపడతారు..బాధ పడతారు..డిప్రెషన్లోకి వెళ్తారు. హీరోయిన్ మీనాక్షి ఈ కేటగిరిలోకే వస్తుంది. సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ కారణంగా తాను మనస్థాపానికి గురయిందట. వారం రోజుల పాటు డిప్రెషన్లోకి వెళ్లారట. ఈ విషయాన్ని స్వయంగా మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary )నే చెప్పింది.‘ది గోట్’పై ట్రోలింగ్!కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్(vijay), వెంకట్ ప్రభు కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘ది గోట్’(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ) గతేడాది సెప్టెంబర్ 5న విడుదైన సంగతి తెలిసిందే. ఈ భారీ యాక్షన్ డ్రామా చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించగా, శివకార్తికేయన్, త్రిష అదితి పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఫస్ట్ డే ఓపెనింగ్ అదిరిపోయినప్పటికీ ఆ తర్వాత మాత్రం డ్రాప్ అయ్యింది. ఈ చిత్రం విషయంలో మీనాక్షిపై ట్రోలింగ్ జరిగింది. ఇందులో కొడుకుగా నటించిన విజయ్ పాత్రను ఏఐ టెక్నాలజీలో రూపొందించారు. ఈ పాత్రకు జంటగా నటి మీనాక్షి చౌదరి నటించారు. రిలీజ్ తర్వాత మీనాక్షి పాత్రపై నెటిజన్స్ విరుచుకుపడ్డారు. ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తూ వీడియోలను షేర్ చేశారు. అవి చూసి మీనాక్షి చాలా బాధపడిందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మీనాక్షి మాట్లాడుతూ.. ‘‘విజయ్ హీరోగా వచ్చిన ‘ది గోట్’ విడుదలైన తర్వాత నన్ను చాలా మంది ట్రోల్ చేశారు. అవి చూసి ఎంతో బాధపడ్డా. వారం రోజులు డిప్రెషన్లోకి వెళ్లా. తర్వాత ‘లక్కీ భాస్కర్’ విడుదలైంది. ఆ చిత్రం గొప్ప విజయాన్ని అందుకుంది. అందులో నా నటనకు ఎన్నో ప్రశంసలు లభించాయి. కథల ఎంపికలో మార్పులు చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నా. మంచి సినిమాలపై దృష్టిపెట్టాలని అర్థం చేసుకున్నా’ అని చెప్పారు.‘సంక్రాంతి..’తో బిజీ బిజీప్రస్తుతం మీనాక్షి చౌదరి నటించిన‘సంక్రాంతికి వస్తున్నాం’(sankranthiki vastunam Movie) సినిమా రిలీజ్‌కు రెడీ అయింది. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. ఐశర్వర్య రాజేశ్ మరో హీరోయిన్. సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మీనాక్షి ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. గతంలో ఎప్పుడు చేయని విధంగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో చేస్తున్నారు మీనాక్షి. దానికి గల కారణం కూడా చెప్పారు. ‘గతేడాది ఆరు సినిమాలు చేశాను. నెలకో సినిమా రిలీజ్ అయింది. షూటింగ్ కారణంగా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనే సమయం దొరకలేదు. ఈ సారి మాత్రం కాస్త గ్యాప్ దొరికింది. అందుకే వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాను’ అని చెప్పింది. -
తెల్ల కల్లు, మటన్ ముక్క.. దిల్ రాజు కామెంట్స్ వైరల్
ఈ సంక్రాంతికి మూడు తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే వాటిల్లో డాకు మహారాజ్ మినహా మిగతా రెండు సినిమాలకు దిల్ రాజే(Dil Raju) నిర్మాత. జనవరి 10న గేమ్ ఛేంజర్, 14న సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో దిల్ రాజు వరుస ఇంటర్వ్యూలో ఫుల్ బిజీ అయిపోయారు. ఒక పక్క ఇంటర్వ్యూలు ఇస్తునే మరోపక్క ప్రీరిలీజ్, ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లను నిర్వహిస్తూ రెండు సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లేందుకు తెగ ప్రయత్నం చేస్తున్నాడు.ఈ ప్రయత్నం దిల్ రాజు ఫూర్తిగా సఫలం అయ్యాడు. తన రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యేలా చేశాడు.(చదవండి: అలాంటి ప్రశ్నలు అడగొద్దని చెప్పానుగా.. రజనీ అసహనం)ముఖ్యంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’( Sankranthiki Vasthunam Movie) అనే సినిమా విషయంలో ముందు నుంచి దూకుడుగానే ప్రమోషన్స్ చేస్తున్నారు. ఒకపక్క అనిల్ రావిపూడి, మరోపక్క వెంకటేశ్ సినిమా ప్రమోషన్స్‌ని తమ భుజాన వేసుకున్నారు. అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌లు కూడా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇక తాజాగా నిజమాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ..ఆంధ్రాలో సినిమాలకు వైబ్ ఉంటే.. తెలంగాణలో కల్లు, మటన్ కు వైబ్ ఉంటుంది అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం దిల్ రాజు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అసలేం జరిగిదంటే..సినిమా గురించి మాట్లాడేందుకు దిల్ రాజు స్టేజ్ ఎక్కగానే.. ‘సర్.. స్పీచ్ మాములుగా ఉండొద్దు.. ఒక్క దెబ్బకు వైరల్ అయిపోవాలి’ అంటూ యాంకర్ శ్రీముఖి రిక్వెస్ట్ చేసింది. దిల్ రాజు అదే జోష్‌లో తెలంగాణ యాసలో మాట్లాడుతూ రెచ్చిపోయారు. ‘ఏం దావత్ చేద్దామా..? చెట్లళ్లలకు పోదామా..? అని ఆడియన్స్‌ని అడిగాడు .ఆ తర్వాత స్టేజ్ పైనే ఉన్న వెంకటేశ్(venkatesh)ని చూస్తూ.. ‘సర్ మా నిజమాబాద్‌లో తెల్ల కల్లు ఫేమస్. పొద్దునపూట నీర తాగితే వేరే లెవెల్లో ఉంటుంది. మావోళ్లకు( తెలంగాణ) సినిమా అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు.. ఆంధ్రకు వెళ్తే సినిమాకు ఓ స్ఫెషల్ వైబ్ ఇస్తారు.. తెలంగాణలో మటన్, తెల్లకల్లుకే వైబ్ ఇస్తారు’ అని దిల్ రాజు అనడంతో హీరోతో సహా ఆడియన్స్ అంతా గట్టిగా నవ్వారు.ముచ్చటగా మూడో చిత్రం..విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన మూడో చిత్రమే ‘సంక్రాంతికి వస్తున్నాం’. అంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాలు సూపర్ హిట్ కొట్టాయి. బాలయ్యతో ‘భగవంత్ కేసరి’ తీసిన తర్వాత అనిల్ నుంచి వస్తున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తాజాగా రిలీజైన ఈ చిత్రం ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. వెంకీ, అనిల్ తరహా కామెడీతో ట్రైలర్‌ని కట్ చేశారు. ట్విస్ట్‌లు, థ్రిల్స్, యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. నిజామాబాద్‌లో పెట్టిన తన సినిమా కార్యక్రమంలో జనాల రెస్పాన్స్ పెద్దగా లేదని తెలంగాణలో సినిమాల కంటే కల్లు, మటన్ అంటే వెంటపడతారని మాట్లాడిన దిల్ రాజు pic.twitter.com/5W2AOhgDWG— Telugu Scribe (@TeluguScribe) January 7, 2025 -
వెంకి మామతో ‘రాములమ్మ’ఫ్యామిలీ.. లంగా ఓణిలో మరింత అందంగా మెరిసిపోతున్న శ్రీముఖి (ఫోటోలు)
-
‘సంక్రాంతి..’చూడండి..మాములుగా ఉండదు: వెంకటేశ్
వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam Movie). మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను హీరో మహేశ్‌బాబు ‘ఎక్స్’ వేదికగా షేర్ చేసి, చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చె΄్పారు. అలాగే ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని సోమవారం రాత్రి నిజామాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ–‘‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ఈ సంక్రాంతికి వస్తున్నాం. హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఈ చిత్రం తీశాడు అనిల్. మీ ఫ్యామిలీతో వచ్చి చూడండి.. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు. ఈ సంక్రాంతికి వస్తున్న ‘గేమ్ చేంజర్, ‘డాకు మహారాజ్’ సినిమాలు కూడా విజయం సాధించాలి. ‘దిల్’ రాజు, శిరీష్‌లతో ఇంకా మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. మా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చూడండి.. మామూలుగా ఉండదు’’ అన్నారు. ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ.. ‘నిజామాబాద్ లో ఇంతకు ముందు ఫిదా వేడుక చేశాం. అనిల్ నిజామాబాద్ లో వేడుక చేద్దామని అన్నారు. వెంకటేష్(Venkatesh) గారు అనిల్ శిరీష్ వారి భుజాన వేసుకొని 72 రోజుల్లో ఇంత పెద్ద సినిమాని ఫినిష్ చేశారు. పూర్తిస్థాయిలో ఓ సినిమా వేడుక నిజామాబాద్ లో జరగడం ఇదే ఫస్ట్ టైం. సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.1980లో ఇక్కడ రూపాయి టికెట్ తో నేను శిరీష్ సినిమాలు చూసేవాళ్ళం. అలా సినిమాలపై ఇష్టం ఏర్పడింది. మా 58వ సినిమా ఈవెంట్ ఇక్కడ చేయడం మాకు చాలా గర్వంగా వుంది. ఎంతోమంది హీరోలు, దర్శకులు సపోర్ట్ చేస్తే ఈ స్థాయిలో వున్నాం. అనిల్ మా బ్యానర్ లో ఆరు సినిమాలు చేసి ఒక పిల్లర్ లా నిలబడ్డారు. తను ఒకొక్కమెట్టు ఎదుగుతూ టాప్ డైరెక్టర్ గా అయ్యారు. ఈ ఏడాది మా సంస్థకు బ్లాక్ బస్టర్ పొంగల్ ఇయర్. పాన్ ఇండియా సినిమా గేమ్ చెంజర్ 10న రిలీజ్ అవుతుంది. మా బ్యానర్ లో ఎఫ్ 2 ఎఫ్ 3 లాంటి సూపర్ హిట్స్ చేసిన వెంకటేష్ గారి సంక్రాంతి వస్తున్నాం సినిమా జనవరి 14న వస్తోంది. అలాగే డాకు మహారాజ్ ని నైజంలో మేము రిలీజ్ చేస్తున్నాం. అందుకే ఇది మాకు బ్లాక్ బస్టర్ పొంగల్. ఐశ్వర్య రాజేష్ సహజంగా నటించింది. ఆ పాత్ర చాలా నచ్చుతుంది. మీనాక్షి(Meenakshi Chaudhary) పోలీస్ క్యారెక్టర్ అలరిస్తుంది. రామానాయుడు గారు నిర్మాతగా చరిత్ర సృష్టించారు. వెంకటేష్ గారి కలియుగ పాండవులు ఫోటో చూసి ఆయనకి ఫ్యాన్ అయ్యాను. సినిమా ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి కనెక్ట్ అయ్యాను. వారిద్దరూ నా అభిమాన హీరోలు. వెంకటేష్ గారు వుంటే నిర్మాత సెట్ లో ఉండాల్సిన అవసరం లేదు. ఆయనే అన్నీ జాగ్రత్తగా చూసుకుంటారు. మా బ్యానర్ లో నాలుగు సినిమాలు చేసిన హీరో వెంకటేష్ గారు. నిర్మాతని ప్రేమగా చూసుకునే హీరో ఆయన. వెంకటేష్ గారికి థాంక్ యూ సో మచ్. అనిల్ అద్భుతంగా సినిమా తీశాడు. సినిమా పక్కా బ్లాక్ బస్టర్ హిట్. పాటలు ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయ్యాయి. అన్నీ పేర్చుకొని సంక్రాంతికి ఒక బ్లాక్ బస్టర్ హిట్ తీసుకురాబోతున్నాడు అనిల్. సినిమాలో పని చేసిన అందరికీ థాంక్ యూ వెరీ మచ్' అన్నారు. ‘ట్రైలర్ లో చూసింది ఇంతే సినిమాలో చాలా చాలా వుంది. ఇది టిపికల్ జోనర్ సినిమా. వెంకటేష్ గారు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. సినిమాలో చాలా ట్విస్ట్ లు టర్న్స్ వుంటాయి. ఖచ్చితంగా పండక్కి చాలా పెద్ద హిట్ కొట్టబోతున్నాం. అందరూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. దిల్ రాజు గారి బ్యానర్ లో ఇది నా ఆరో సినిమా. నాకు చాలా సపోర్ట్ చేస్తారు. ఈ సినిమాలో పని చేసిన అందరూ సపోర్ట్ గా నిలుచారు. ఐస్వర్య, మీనాక్షి చాలా చక్కగా నటించారు. వెంకటేష్ గారు మనందరికీ నచ్చే వెంకీ మామ. ఆయన కెరీర్ లో చాలా గొప్ప పాత్రలు చేశారు. ఆయన కెరీర్ లో ఈ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండబోతోంది. వెంకటేష్ గారు ప్రాణం పెట్టి పని చేస్తారు. ప్రమోషన్స్ లో కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు. ఆయనకు థాంక్ యూ. మా టీం అందరికీ థాంక్ యూ. థాంక్ యూ నిజామాబాద్. సంక్రాంతికి మీ ఫ్యామిలీ అంతా కట్టకట్టుకొని థియేటర్స్ కి వచ్చేయండి. కడుపుబ్బా నవ్వించి బయటికి పంపుతాం. జనవరి 14 సంక్రాంతికి వస్తున్నాం డోంట్ మిస్. థాంక్ ' అన్నారు -
వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ HD మూవీ స్టిల్స్
-
నిజామాబాద్‌లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
అప్పుడు భయం ప్రారంభమైంది: ‘దిల్’ రాజు
‘‘గత కొన్నేళ్లుగా నేను నిర్మించిన సినిమాల్లో ఎక్కువ శాతం హిట్స్ కాలేకపోయాయి. అనుకున్న రిజల్ట్‌తో సినిమాలు రావటం లేదని నా సన్నిహితులు, శ్రేయోభిలాషులు అనడంతో నాలో తెలియని భయం ప్రారంభమైంది. నాలో స్టోరీ జడ్జ్మెంట్ పోయిందా? మళ్లీ హీరోల కాంబినేషన్ లకే వెళ్లాలా? అని ఆలోచించాను. చిత్ర పరిశ్రమలో విజయాలు ఉంటేనే విలువ ఉంటుంది. ఈ సంక్రాంతికి వస్తున్న ‘గేమ్ చేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలతో కచ్చితంగా నేను కమ్ బ్యాక్ అవుతాను’’ అని నిర్మాత ‘దిల్’ రాజు చెప్పారు.రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన ‘గేమ్ చేంజర్’ ఈ నెల 10న, వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈ నెల 14న విడుదల కానున్నాయి. ఈ సినిమాల నిర్మాత ‘దిల్’ రాజు సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో పంచుకున్న విశేషాలు...⇒ ‘గేమ్ చేంజర్’ నాకెంతో ప్రత్యేకమైన సినిమా. 2021 ఆగస్ట్‌లో ఈ చిత్రాన్ని ప్రారంభించాను. ఈ మూవీ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు చూశాను. ‘భారతీయుడు 2’ సినిమా తర్వాత శంకర్‌గారి నుంచి వస్తున్న చిత్రం ‘గేమ్ చేంజర్’. అలాగే ‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రామ్‌చరణ్ నటించిన సినిమా కూడా ఇదే. కాబట్టి ఈ మూవీ విజయం మా ముగ్గురికీ ఎంతో ముఖ్యం. అన్ని వాణిజ్య అంశాలతోపాటు గౌరవంగా ఫీల్ అయ్యే సినిమా ‘గేమ్ చేంజర్’. ⇒ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సూపర్ హిట్ అని అంటున్నారు. ఈ బజ్ రావటానికి కారణం అనిల్ రావిపూడి. ‘ఎఫ్ 2’ లాగా సూపర్ హిట్ కొట్టాలని కష్టపడ్డాడు. ఈ సినిమా కూడా బిగ్ హిట్ కాబోతోంది. ఏపీలో సినిమాల బెనిఫిట్ షోలు, టికెట్ ధరలపై ఓ స్పష్టత వచ్చింది. ఈ విషయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారిని కూడా కలిసి వినతి చేస్తాను. అయితే తుది నిర్ణయం ప్రభుత్వానిదే.మృతులకు సాయంఇటీవల రాజమహేంద్రవరంలో నిర్వహించిన ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చి, తిరిగి వెళుతున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) మృతి చెందిన సంగతి తెలిసిందే. వీరి కుటుం బాలకు హీరో రామ్‌చరణ్ ఐదు లక్షల చొప్పున పది లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే నిర్మాత ‘దిల్’ రాజు కూడా చెరో ఐదు లక్షల చొప్పున పది లక్షలు సాయం అందించడంతోపాటు, వారి కుటుంబాలకు అండగా ఉంటానని ప్రకటించారు. -
పెద్దోడి ట్రైలర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది: మహేశ్ బాబు
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం సంక్రాంతి వస్తున్నాం. ఈ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందించారు. శ్రీ వెంకటేశ్వర బ్యానర్లో దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పొంగల్ కానుకగా ఈ నెల 14న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌కు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. నిజామాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో రిలీజ్ చేశారు. సూపర్ స్టార్, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేశారు.ఈ సందర్భంగా చిత్రబృందానికి మహేశ్ బాబు అభినందనలు తెలిపారు. మా పెద్దోడి మూవీ ట్రైలర్ విడుదల చేయడం అనందంగా ఉందన్నారు. అనిల్ రావిపూడి, వెంకటేశ్ కాంబోలో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మహేశ్ బాబు పోస్ట్ చేశారు. జనవరి 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటూ ట్వీట్ చేశారు.కాగా.. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మాజీ పోలీస్ ఆఫీసర్‌గా వెంకటేశ్, ఆయన భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేశ్ నటించారు. వెంకటేశ్ మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షీ చౌదరి కనిపిస్తారు.కేవలం 72 రోజుల్లోనే షూటింగ్ పూర్తి..సాధారణంగా స్టార్ హీరోలతో సినిమా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం ఏడాది సమయం అయినా పడుతుంది. కానీ ఈ రోజుల్లో మాత్రం ఏ స్టార్ హీరో సినిమా అయినా సరే రెండు, మూడు నెలల కంటె ఎక్కువ సమయం తీసుకోవట్లేదు. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను కేవలం 72 రోజుల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించాడు.నాలుగైదు నిమిషాలే వృథాఇటీవల ప్రచార కార్యక్రమంలో భాగంగా అనిల్‌రావిపూడి మాట్లాడుతూ.. సినిమా మేకింగ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ సినిమా షూటింగ్‌ని కేవలం 72 రోజుల్లోనే పూర్తి చేశామని తెలిపారు. అంతేకాదు ఐదారు నిమిషాల ఫుటేజ్ మాత్రమే వృథా అయిందని పేర్కొన్నారు.అనిల్ రావిపూడి మాట్లాడుతూ..' ఈ చిత్రం అనౌన్స్ చేసినప్పుడే ఈ సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించాం. తక్కువ సమయం షూటింగ్ ముగించుకోవాలనుకున్నాం. స్క్రిప్ట్ సమయంలోనే ఎడిటింగ్ చేసేశాం. ఫలానా సీన్ మూడు నిమిషాలు తీయాలనుకుంటే అంతే తీశాం. అందుకే 72 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. మొత్తం సినిమా దాదాపు 2.26 గంటల నివిడితో పూర్తయితే.. 2.22 గంటల నిడివితో సెన్సార్‌కు పంపాం. కేవలం ఐదారు నిమిషాలు మాత్రమే ఎడిట్ చేయాల్సి వచ్చింది. ఈ మూవీకి ఎంత బడ్జెట్ అవసరమో అంతకు ఏమాత్రం తగ్గకుండా తీశాం. క్వాలిటీ విషయంలోనూ అస్సలు రాజీపడలేదు’ అని అన్నారు.సంక్రాంతి బరిలో మూడు సినిమాలు..మరోవైపు ఈ సంక్రాంతి బరిలో మొత్తం మూడు సినిమాలు విడుదల కానున్నాయి. వెంకటేశ్ సంక్రాంతి వస్తున్నాం మూవీతో పాటు రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ జనవరి 10న విడుదల కానుంది. బాలకృష్ణ-బాబీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ చిత్రం కూడా జనవరి 12న ప్రేక్షకుల ముందుకురానుంది. Looks like a sure shot🎯🔥Glad to launch the trailer of my peddhodu @VenkyMama garu and my blockbuster director @AnilRavipudi's #SankranthikiVasthunam Wishing you a both a victorious hattrick and the entire team a memorable Sankranthi. Looking forward to the film on Jan 14th!!…— Mahesh Babu (@urstrulyMahesh) January 6, 2025 -
సంక్రాంతి రేసులో మూడు సినిమాలు.. ఏపీలో టికెట్ ధరలు పెంపు
కొత్త ఏడాది ప్రారంభంలోనే మూడు టాప్ సినిమాలు విడుదల కానున్నాయి. రామ్ చరణ్ (గేమ్ ఛేంజర్), బాలకృష్ణ (డాకు మహారాజ్), వెంకటేశ్ (సంక్రాంతికి వస్తున్నాం) వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. అయితే, ఏపీలో ఈ చిత్రాలకు టికెట్ ధరలు పెంచుకునే సౌలభ్యం ప్రభుత్వం కల్పించింది. బెనిఫిట్ షోలతో పాటు అదనపు ఆటలకు అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది.గేమ్ ఛేంజర్ టికెట్ ధరలు ఇలారామ్ చరణ్- శంకర్ కాంబినేషన్లో నిర్మాత దిల్ రాజ్ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. జనవరి 10న తెల్లవారుజామున ఒంటిగంటకు బెనిఫిట్ షో వేసుకోవచ్చని ఏపీ ప్రభుత్వం తెలిపింది. దీనికి ఒక్కో టికెట్ ధర రూ.600గా నిర్ణయించింది. అయితే, మొదటి రోజు 4గంటల ఆట నుంచి టికెట్ ధరలు ఇలా ఉండనున్నాయి. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలపై అదనంగా మల్టీప్లెక్స్‌లో రూ.175, సింగిల్ థియేటర్స్‌లలో రూ.135 వరకు పెంచుకోవచ్చని చెప్పింది. ఫస్ట్ డే నాడు ఆరు షోలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. 11వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ రోజుకు 5 షోలు ఉండనున్నాయి. పెంచిన ధరలు 23వ తేదీ వరకు ఉంటాయి. 'డాకు మహారాజ్' టికెట్ ధరలునందమూరి బాలకృష్ణ- బాబీ సినిమా 'డాకు మహారాజ్'. ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మించారు. జనవరి 12న విడుదల కానున్న మూవీకి బెనిఫిట్ షోలతో పాటు టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. 12వ తేదీ ఉదయం 4 గంటల ప్రత్యేక షో కోసం అనుమతితో పాటు ఒక్కో టికెట్ రూ.500కు విక్రయించేందుకు అనుమతిచ్చింది. రోజుకు ఐదు షోలతో పాటు ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలపై అదనంగా మల్టీప్లెక్స్‌లో రూ.135, సింగిల్ థియేటర్స్‌లలో రూ.110 వరకు పెంచుకోవచ్చని చెప్పింది. జనవరి 23 వరకు ఈ ధరలు ఉంటాయి.సంక్రాంతికి వస్తున్నాం టికెట్ ధరలువెంకటేశ్- అనిల్ రావిపూడి హిట్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది. రోజుకు ఐదు షోలు నిర్వహించుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి కల్పించింది. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలపై అదనంగా మల్టీప్లెక్స్‌లో రూ.125, సింగిల్ థియేటర్స్‌లలో రూ.100 వరకు పెంచుకోవచ్చని చెప్పింది. జనవరి 28 వరకు ఈ ధరలు ఉంటాయి. -
నా జీవితంలో ఈ సినిమా ఓ అద్భుతం
వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ– ‘‘సంక్రాంతికి వస్తున్నాం’ మంచి ఫ్యామిలీ మూవీ. చిన్న క్రైమ్ డ్రామా కూడా ఉంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘గోదారి గట్టు, మీనూ, బ్లాక్‌బస్టర్ పొంగల్...’ పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. మణిశర్మ, రమణ గోగులగార్లకు నేను అభిమానిని. ‘గోదారి గట్టు’ పాటను రమణ గోగులగారితో పాడించడం సంతోషాన్నిచ్చింది. అలాగే కొంత గ్యాప్ తర్వాత మధు ప్రియగారు ఈ పాట పాడారు. అనంత శ్రీరామ్ ‘మీనూ..’ పాటకు మంచి లిరిక్స్ ఇచ్చారు. ‘మీనూ..’ పాటను అనిల్‌గారు నన్నే పాడమన్నారు. నాతో పాటు ఈ పాటను ప్రణవి ఆచార్య పాడారు. ‘బ్లాక్‌బస్టర్ పొంగల్...’ పాటకు రామజోగయ్య శాస్త్రిగారు సాహిత్యం అందించారు. ఈ పాటను అర్ధరాత్రి వెంకటేశ్‌గారు విని, మార్నింగ్ వచ్చి తానే పాడతానని అన్నారు. ఆయనే పాడారు. నేను, రోహిణి గొంతు కలిపాము. పాట పాడిన తర్వాత నేను పాడిన పాట నచ్చకపోతే తీసేయమని వెంకటేశ్‌గారు అన్నారు. వాస్తవానికి ఆయన స్థాయి, ఇమేజ్‌కు ఆ మాట అనాల్సిన అవసరం లేదు. ఇక మా సినిమాలోని పాటలకు మంచి స్పందన లభిస్తోందంటే కారణం... సాహిత్యం పట్ల అనిల్‌గారికి ఉన్న అభిరుచి. ‘దిల్’ రాజుగారి డీపీఆర్ బేనర్లో ‘బలగం’ మూవీ చేశాను. ఇప్పుడు ఇంత పెద్ద సినిమా చేసే చాన్స్ కల్పించినందుకు ఆయనకు రుణపడి ఉంటాను. ఇలా అన్ని విధాలా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా నా జీవితంలో జరిగిన ఓ అద్భుతం’’ అన్నారు. -
72 రోజుల్లోనే ‘సంక్రాంతికి వస్తున్నాం’ పూర్తి.. నాలుగు నిమిషాలే వృథా!
సాధారణంగా ఏ డైరెక్టర్ అయినా రెండున్నర గంటల సినిమాను దాదాపు 3 గంటలకు పైగా నిడివితో షూట్ చేస్తాడు. ఎంత అనుభవం ఉన్న డైరెక్టర్ సినిమా అయినా సరే ఎడిటింగ్‌లో అరగంట సీన్స్ అయినా ఎగిరిపోతాయి. చాలా తక్కువ మంది మాత్రమే కావాల్సిన నిడివి మేరకు మాత్రం చిత్రీకరణ చేస్తారు. వారిలో పూరీ జగన్నాథ్, ఆర్జీవీ ముందు వరుసలో ఉంటారు. ఇప్పుడా లిస్ట్‌లోకి అనిల్ రావిపూడి(Anil Ravipudi)ని కూడా ఎక్కించొచ్చు. ఎడిటింగ్‌కి అవకాశం లేకుండా ముందే లెక్కలు వేసుకొని సినిమాను కంప్లీట్ చేస్తున్నాడు. స్టార్ హీరో సినిమా అయినా సరే రెండు, మూడు నెలల కంటె ఎక్కువ సమయం తీసుకోవట్లేదు. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను కేవలం 72 రోజుల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించాడు.నాలుగైదు నిమిషాలే వృథాసాధారణంగా స్టార్ హీరోలతో సినిమా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం ఏడాది సమయం అయినా పడుతుంది. రాజమౌళి లాంటి వాళ్లు అయితే మూడు ఏళ్లకు పైనే సమయం తీసుకుంటారు. కానీ అనిల్ రావిపూడి మాత్ర కేలవం 72 రోజుల్లో సినిమాను పూర్తి చేశాడు. అది కూడా స్టార్ హీరో సినిమా. అదే ‘సంక్రాంతికి వస్తున్నాం’((Sankranthiki Vasthunnam Movie). ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ప్రచార కార్యక్రమంలో భాగంగా అనిల్‌రావిపూడి మాట్లాడుతూ.. సినిమా మేకింగ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ సినిమా షూటింగ్‌ని కేవలం 72 రోజుల్లోనే పూర్తి చేశారట. అంతేకాదు ఐదారు నిమిషాల ఫుటేజ్ మాత్రమే వృథా అయిందట.‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం అనౌన్స్ చేసినప్పుడే ఈ సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించాం. తక్కువ సమయం షూటింగ్ ముగించుకోవాలనుకున్నాం. స్క్రిప్ట్ సమయంలోనే ఎడిటింగ్ చేసేశాం. ఫలానా సీన్ మూడు నిమిషాలు తీయాలనుకుంటే అంతే తీశాం. అందుకే 72 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. మొత్తం సినిమా దాదాపు 2.26 గంటల నివిడితో పూర్తయితే.. 2.22 గంటల నిడివితో సెన్సార్‌కు పంపాం. కేవలం ఐదారు నిమిషాలు మాత్రమే ఎడిట్ చేయాల్సి వచ్చింది. ఈ మూవీకి ఎంత బడ్జెట్ అవసరమో అంతకు ఏమాత్రం తగ్గకుండా తీశాం. క్వాలిటీ విషయంలోనూ అస్సలు రాజీపడలేదు’ అని అనిల్ రావిపూడి అన్నారు. సంక్రాంతి బరిలో..అనిల్ రావిపూడి దర్వకత్వం వహించిన ఈ చిత్రంలో వెంకటేశ్(venkatesh) సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ నటించారు. సంక్రాంతికి కానుకగా.. జనవరి 14న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సంక్రాంతి బరిలో మరో రెండు బడా సినిమాలు కూడా విడుదల కానున్నాయి. అందులో ఒకటి రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 10న విడుదల కానుంది. ఇక బాలకృష్ణ-బాబీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ చిత్రం కూడా ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
వెంకటేశ్‌తో ఫోటోలు దిగిన 3 వేల మంది ఫ్యాన్స్
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా విడుదల నేపథ్యంలో విక్టరీ వెంకటేశ్ తన అభిమానులతో పోటోలు దిగారు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా విజయం కోసం చిత్ర యూనిట్ సరికొత్తగా ప్రమోషన్స్ కార్యక్రమాలను చేపడుతుంది. తాజాగా వెంకటేశ్ 3000 మందికి పైగా అభిమానులతో ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకటేశ్‌కు జోడీగా ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. వినూత్నమైన ముక్కోణపు క్రైమ్ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. రామ్‌చరణ్ 'గేమ్ ఛేంజర్', బాలకృష్ణ 'డాకు మహారాజ్' వంటి చిత్రాలతో పోటీ పడి వాటికి మించిన ప్రమోషన్స్‌తో ప్రేక్షకులకు ఈ చిత్రం దగ్గరైంది. -
ఫస్ట్ టైం యాక్షన్ సీక్వెన్స్ చేశా : మీనాక్షి చౌదరి
ఇంతవరకు నేను సీరియస్ రోల్‌తో పాటు గ్లామర్ పాత్రలు మాత్రమే చేశాను.కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్‌టైం కామెడీ స్పేస్ లో కాప్ రోల్ ప్లే చేయడం చాలా ఎక్సయిటింగ్ గా ఉంది. నన్ను కాప్ రోల్ చూడటం ఆడియన్స్ కి కూడా ఓ కొత్త ఎక్స్ పీరియన్స్. ఫస్ట్ టైం ఇందులో యాక్షన్ సీక్వెన్స్ లు చేశాను. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు మీనాక్షి చౌదరి. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్స్‌గా నటించారు. జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీనాక్షి చౌదరి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి గుంటూరు కారం రిలీజ్ అయ్యింది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ జర్నీ ఒక డ్రీమ్ లా ఉంది. నన్ను నేను నిరూపించుకునే మంచి కథలు, పాత్రలు రావడం చాలా సంతోషంగా ఉంది.→ కాప్ రోల్ చేయాలనే నా డ్రీమ్ ఈ సినిమాతో తీరింది.మా డాడీ ఆర్మీ ఆఫీసర్. ఆఫీసర్ బాడీ లాంజ్వెజ్ పై ఐడియా ఉంది. నేను కూడా కొంత హోం వర్క్ చేశాను. → వెంకటేష్ గారితో వర్క్ చేయడం సూపర్ ఎక్స్ పీరియన్స్. ఆయన వండర్ ఫుల్ హ్యూమన్. ఆయనలో ఎప్పుడూ ఒక ఆనందం కనిపిస్తుంటుంది. ఆయన కామెడీ టైమింగ్ అద్భుతం. అనిల్, వెంకీ గారిది సూపర్ హిట్ కాంబినేషన్. సెట్ లో కూడా ఒక మంచి రేపో వుండేది. సీన్స్ అన్నీ ఫ్లోలో అద్భుతంగా జరిగాయి. వెంకటేష్ గారు చాలా ఫిట్ అండ్ ఎనర్జిటిక్ గా వుంటారు. ఆయనతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్.→ ఐశ్వర్య రాజేష్ గారు ఎస్టాబ్లెస్ యాక్టర్. ఐశ్వర్య నటించిన చాలా సినిమాలు చూశాను. ఒక ఫ్యాన్ మూమెంట్ లా అనిపించింది, తను చాలా పాజిటివ్ గా వుంటారు. తనతో కలసి పని చేయడం హ్యాపీగా అనిపించింది. తన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.→ నేను యాక్ట్ చేసిన సినిమాలో అన్ని పాటలు సూపర్ హిట్ కావడం ఇదే తొలిసారి. గోదారి గట్టు సాంగ్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. తర్వాత నా పేరు 'మీను' మీద వచ్చిన పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. బీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మ్యూజిక్ ఎలా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో సినిమా కూడా అలానే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను.→ అనిల్ గారి కామెడీ టైమింగ్ ఫెంటాస్టిక్. కామెడీ తీయడం అంత ఈజీ కాదు. సీన్ బెటర్ మెంట్ కోసం స్పాంటినియస్ గా ఆలోచించాలి. సీన్ బెటర్ చేయడంలో అనిల్ గారి ఆలోచనలు చాలా అద్భుతంగా వుంటాయి. నేను కామెడీ చేయడం ఫస్ట్ టైం. ఆయన చాలా ఓపికగా ప్రతిది డిటేయిల్ గా ఎక్స్ ప్లేయిన్ చేశారు. ఆయనతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్.→ ఇది మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్. మేజర్ పోర్షన్ కామెడీ ఉంటుంది. ఇది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అన్నీ ఎమోషన్స్ ఉంటాయి. →ప్రస్తుతం నవీన్ పోలిశెట్టితో ఒక సినిమా చేస్తున్నాను. మరో రెండు సినిమాలు మేకర్స్ అనౌన్స్ చేస్తారు. ఈ ఏడాది కూడా వండర్ ఫుల్ గా ఉంటుందని ఆశిస్తున్నాను. -
విశాఖలో సందడి చేసిన సినీ హీరోయిన్ మీనాక్షి చౌదరి (ఫొటోలు)
-
పాటతో ఇరగదీసిన 'వెంకీ మామ'
-
వెంకటేష్ కెరీర్ కు కీలకంగా మారిన 2025 పొంగల్..
-
వెంకీ మామ పాత్రల్లో హీరోయిన్స్.. వీరిద్దరిని గుర్తు పట్టారా?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. ఈ చిత్రంలో వెంకీ సరసన మీనాక్షీ చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు . ఈ సినిమాలో మాజీ పోలీస్ ఆఫీసర్‌గా వెంకటేశ్, ఆయన భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేశ్ నటించారు. వెంకటేశ్ మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షీ చౌదరి కనిపిస్తారు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2025 జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. అయితే అందరిలా రోటీన్‌గా కాకుండా కాస్తా డిఫరెంట్ స్టైల్లో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇటీవల సాంగ్ రిలీజ్ సమయంలోనూ అందరికంటే భిన్నంగా ప్రమోషన్స్ చేశారు. ఈ సారి ఏకంగా వెంకటేశ్ నటించిన సూపర్ హిట్ చిత్రాలను ఎంచుకున్నారు. అదేంటో మీరు చూసేయండి.ఈ మూవీ మీనాక్షి చౌదరి, ఐశ్వర్వ రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలా వీరిద్దరిని వెంకీ గెటప్‌లోకి మార్చేశారు మేకర్స్. మీనాక్షి చౌదరిని వెంకీ చిత్రం బొబ్బిలి రాజాలో రాజా పాత్ర గెటప్‌లో ముస్తాబు చేశారు. అలాగే ఐశ్వర్య రాజేశ్ వెంకటేశ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం చంటి పాత్ర గెటప్‌లో సందడి చేసింది. వీరిద్దరికి సంబంధించిన వీడియోలను చిత్రనిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పోస్ట్ చేసింది. ఇద్దరు హీరోయిన్లు వెంకీ మామ వేషధారణలో డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా అనిల్ రావిపూడి జయం మనదేరా చిత్రంలోన మహదేవ నాయుడు పాత్ర, ఘర్షణ చిత్రంలోని డీసీపీ రామచంద్ర పాత్రలో దిల్ రాజు సందడి చేశారు.కాగా.. ఇటీవలే 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా నుంచి మూడో సాంగ్ కూడా విడుదలైంది. ఈ పాట ప్రత్యేకత ఏంటంటే.. సుమారు ఏడేళ్ల తర్వాత విక్టరీ వెంకటేష్ ఆలపించడం. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే రికార్డ్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. Let's celebrate the new year with a very special interview, "VENKY MAMAs tho #SankranthikiVasthunam" ❤️🔥Presenting @aishu_dil as CHANTI from #CHANTI 😍Stay tuned for the next one and keep guessing 😉#సంక్రాంతికివస్తున్నాం GRAND RELEASE WORLDWIDE ON 14th JANUARY, 2025. pic.twitter.com/jYNxMrAbGl— Sri Venkateswara Creations (@SVC_official) December 31, 2024 Ayyo Ayyo Ayayyoooo 😄Presenting @Meenakshiioffl as RAJA from #BobbiliRaja 😍Stay tuned for the next one and keep guessing 😉#SankranthikiVasthunam GRAND RELEASE WORLDWIDE ON 14th JANUARY, 2025. pic.twitter.com/btrn9IedG6— Sri Venkateswara Creations (@SVC_official) December 31, 2024 -
బ్లాక్‌బస్టర్ ΄పొంగల్
‘ఇట్స్ ఏ బ్లాక్‌బస్టర్ ΄పొంగల్’ అంటూ హుషారుగా ఆడిపాడుతున్నారు వెంకటేశ్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై శిరీష్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ మూవీ నుంచి ‘బ్లాక్ బస్టర్ ΄పొంగల్..’ అంటూ సాగే మూడోపాటని సోమవారం విడుదల చేశారు. ‘హే గొబ్బీయల్లో గొబ్బీయల్లో... పండగొచ్చే గొబ్బీయల్లో.. ఎవ్రీ బడీ గొబ్బీయల్లో... సింగ్ దిస్ మెలోడీ గొబ్బీయల్లో... పెద్ద పండగండీ గొబ్బీయల్లో.. లెట్స్ గెట్ ట్రెండీ గొబ్బీయల్లో కమాన్’.. ‘బేసికల్లీ.. టెక్నికల్లీ... లాజికల్లీ... ప్రాక్టికల్లీ అండ్ ఫైనల్లీ... ఇట్స్ ఏ యాటిట్యూడ్ ΄పొంగల్... ఇట్స్ ఏ బ్లాక్‌బస్టర్ ΄పొంగల్’... అంటూ ఈపాట సాగుతుంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈపాటని వెంకటేశ్, మైపిలో రోహిణి సోరట్, భీమ్స్ సిసిరోలియోపాడారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఈపాటలో వెంకటేశ్, ఐశ్వర్యా రాజేష్, మీనాక్షీ చౌదరి సంప్రదాయ వస్త్రధారణలో ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో సందడి చేశారు. ఈ చిత్రానికి కెమేరా: సమీర్ రెడ్డి. -
'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ HD స్టిల్స్ (ఫొటోలు)
-
సంక్రాంతికి వస్తున్నాం.. బ్యాట్ పట్టి, స్టెప్పులేసిన వెంకీమామ (ఫోటోలు)
-
‘లక్కీ’ హీరోయిన్.. వరుస ఫ్లాపులు.. తగ్గని ఆఫర్స్
మాములుగా హీరోహీరోయిన్లకు ఫ్లాప్ వస్తే ఆఫర్స్ తగ్గిపోతాయి. స్టార్ హీరోలకు ఇందులో మినహాయింపు ఉంటుంది. వాళ్లకు ఫ్లాప్ వచ్చినా కొత్త సినిమాలకు కొదవ ఉండదు. కానీ హీరోయిన్ల పరిస్థితి మాత్రం వేరుగా ఉంటుంది. స్టార్ హీరోయిన్ అయినప్పటికీ.. ఫ్లాప్ వస్తే పక్కన పెట్టేస్తుంటారు. కానీ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary )కి వరుస ఫ్లాపులు వచ్చినా..ఆఫర్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి. హిట్ 2తో హిట్ కొట్టింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ వచ్చాయి. ఈ ఏడాది ఏకంగా ఆరు చిత్రాల్లో నటించింది. అయితే వాటిల్లో లక్కీ భాస్కర్ మినహా మిగతా చిత్రాలేవి ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇటీవల వచ్చిన మట్కా, మెకానిక్ రాకీ చిత్రాలు భారీ అపజయాన్ని మూటగట్టుకున్నాయి. దీంతో మీనాక్షి పని అయిపోయిందని అనుకున్నారు అంతా. ఇక ఆమె తెలుగు తెరకు దూరమైపోతుందని ఫ్యాన్స్ నిరాశ చెందారు. కానీ టాలీవుడ్ మాత్రం ఇప్పటికీ మీనాక్షిని ‘లక్కీ’గానే చూస్తోంది. ఫ్లాపులను పట్టించుకోకుండా ఆమెకు అవకాశాలు అందిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ చిత్రంలో మీనాక్షి హీరోయిన్గా నటిస్తోంది. నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో తొలుత శ్రీలీల నటిస్తుందని ప్రచారం జరిగింది. అయితే కారణం ఏంటో తెలియదు కానీ శ్రీలీల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో మీనాక్షి చౌదరిని హీరోయిన్గా తీసుకున్నారు. ఇక ఇప్పటికే ఆమె నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం రిలీజ్‌కి రెడీ అయింది. సంకాంత్రి కానుకగా జనవరి 14న ఈ చిత్రం రిలీజ్ కానుంది. అనగనగా ఒక రాజుతో పాటు మరో రెండు సినిమాల్లో మీనాక్షి హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన వచ్చే ఏడాది కూడా మీనాక్షి మూడు, నాలుగు చిత్రాలతో అలరించబోతుంది. -
లైఫ్‌లో చాలా డిస్టర్బ్ అయ్యా.. ఆ గుడికి వెళ్లాక జీవితమే మారింది: వెంకటేష్
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో ఫుల్ జోష్‌లో ఉన్నారు విక్టరీ వెంకటేష్. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. సరికొత్తగా ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రారంభించింది. ఈ క్రమంలో బాలకృష్ణతో వెంకటేష్ ఒక వేదికపై మెరిశారు. సినిమాకు సంబంధించిన పలు విశేషాలు పంచుకున్న వెంకీ తన జీవితంలో బాగా డిస్ట్రబ్ అయిన సమయంలో 'అరుణాచలం' ఆలయాన్ని సందర్శించాక ఏం జరిగిందో పంచుకున్నారు.అరుణాచలం ఆలయం సందర్శించిన తర్వాత తనకు కలిగిన అనుభూతిని వెంకటేష్ ఇలా పంచుకున్నారు. 'ప్రపంచంలో చాలా ప్రదేశాలు తిరిగాను. ఈ క్రమంలో చాలామందిని కలిశాను. ఈ క్రమంలో జీవితంలో కూడా చాలా డిస్ట్రబ్ అయ్యాను కూడా. ఫైనల్లీ అరుణాచలం వెళ్లి స్వామి దర్శనం అనంతరం స్కందాశ్రమంలో మెడిటేషన్ చేశాను. అక్కడ ఏదో తెలియని శక్తి మనలోకి ప్రవేశిస్తుంది. అసలైన హ్యూమన్ ఎనర్జీ ఎంటో అక్కడే తెలుస్తోంది. నేను అలాంటి శక్తిని అక్కడి నుంచే పొందాను. ఆ తర్వాత నా జీవితంలో ఎలాంటి సంఘటన కూడా నున్ను డిస్ట్రబ్ చేయలేకపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్న వెంకీలోని మార్పులు అరుణాచలం నుంచి వచ్చినవే. ఎక్కడ దొరకని ప్రశాంతత అక్కడ ఉంటుంది. అలానే నేను అన్నది మర్చిపోయి , ఏది శాశ్వతము కాదు అని తెలుసుకుంటాము ' అని ఆయన భక్తితో ఎమోషనల్‌గా చెప్పారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.అరుణాచలం గుడి గురించి ఈ విషయం తెలుసా..?తమిళనాడులో తిరువణ్ణామలై జిల్లాలోని పచ్చని కొండ పక్కన అరుణాచలేశ్వరాలయం ఉంటుంది. జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలనుకునేవాళ్లు ఈ ఆలయాన్ని తప్పక దర్శిస్తుంటారు. అరుణాచలం అన్న పేరును ఉచ్చరించినా చాలు... ముక్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. శివుడు అగ్నిలింగంగా అక్కడ అవతరించాడు. పంచ భూత పవిత్ర స్థలాల్లో ఒకటిగానూ ప్రపంచంలోని అతిపెద్ద ఎనిమిదో హిందూ దేవాలయంగానూ పేరుంది. అరుణాచలంలో పరమశివుణ్ణి దర్శించుకుని గిరి ప్రదక్షిణ చేస్తే ముక్తి లభిస్తుందన్న నమ్మకంతో భక్తులు వెళ్తారు. ముఖ్యంగా ప్రతి పౌర్ణమి నాడు అక్కడకు భక్తులు భారీగా చేరుకుంటారు. View this post on Instagram A post shared by Niharika Reddy (@yours_niharikareddy) -
సంక్రాంతి సాంగ్‌తో దుమ్మురేపిన వెంకటేష్
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా నుంచి మూడో సాంగ్ ప్రోమో వచ్చేసింది. సరికొత్తగా ఈ సాంగ్ పరిచయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి ఒక వీడియో రూపంలో ఇప్పటికే చూపించారు. అయితే, ఇప్పుడు సాంగ్ ప్రోమో విడుదల కావడంతో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ పాట ప్రత్యేకత ఏంటంటే.. సుమారు ఏడేళ్ల తర్వాత విక్టరీ వెంకటేష్ ఆలపించడం. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. పూర్తి సాంగ్‌ను డిసెంబరు 30న మేకర్స్ విడుదల చేయనున్నారు.అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేష్ సరసన మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లగా నటిస్తున్నారు. ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో మాజీ పోలీస్ ఆఫీసర్‌గా వెంకటేశ్, ఆయన భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేశ్ నటించారు. వెంకటేశ్ మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షీ చౌదరి కనిపిస్తారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2025 జనవరి 14న రిలీజ్ కానుంది. -
ఏడేళ్ల తర్వాత స్పెషల్ సాంగ్‌తో వస్తున్న వెంకటేష్
సంక్రాంతికి వస్తున్నాం.. ప్రస్తుతం ఈ సినిమా విశేషాలు సోషల్‌మీడియాలో భారీగా వైరల్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలు భారీ హిట్ అందుకున్నాయి. త్వరలోనే మూడో సాంగ్‌ను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, ఈ సాంగ్‌ను విక్టరీ వెంకటేష్ ఆలపించనున్నారు. సుమారు ఏడేళ్ల తర్వాత మళ్లీ ఆయన గాత్రం నుంచి ఒక పాట రానున్నడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మూడో సాంగ్ విడుదల నేపథ్యంలో 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్ర యూనిట్ ఒక ఫన్నీ వీడియోను పంచుకుంది. ఈ సాంగ్‌ను ఎవరితో పాడిద్దాం అని అనిల్ రావిపూడి చర్చిస్తుండగా సడెన్‌గా వెంకటేష్ ఎంట్రీ ఇచ్చేసి నేను పాడతా... నేను పాడతా... అంటూ పట్టుబట్టి మరీ ఈ పాటని ఆలపించినట్టు చిత్ర యూనిట్ ఒక వీడియో పంచుకుంది. అయితే, వెంకటేష్ ఇప్పటికే 2017లో విడుదలైన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ 'గురు'లో ఆయన మొదటిసారిగా తన గాత్రంతో మెప్పించాడు. ఇప్పుడు మరోసారి సంక్రాంతి నేపథ్యంలో వచ్చే ఈ పాటని వెంకటేష్ ఆలపించనున్నాడు. త్వరలోనే ఈ పాటని విడుదల చేయనున్నారు.అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేష్ సరసన మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లగా నటిస్తున్నారు. ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో మాజీ పోలీస్ ఆఫీసర్‌గా వెంకటేశ్, ఆయన భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేశ్ నటించారు. వెంకటేశ్ మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షీ చౌదరి కనిపిస్తారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2025 జనవరి 14న రిలీజ్ కానుంది.