The Kashmir Files Box Office Collection: The Kashmir Files Movie May Be Crosses RS 150 Crore - Sakshi
Sakshi News home page

The Kashmir Files: 8 రోజుల్లో వంద కోట్లు, అవాక్కవుతున్న బాలీవుడ్‌!

Published Sat, Mar 19 2022 4:32 PM | Last Updated on Sat, Mar 19 2022 6:21 PM

The Kashmir Files Box Office Collection: the Kashmir Files Movie May Be Crosses RS 150 Crore - Sakshi

ది కశ్మీర్‌ ఫైల్స్‌.. ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. ఇదివరకే చూసినవాళ్లు వన్స్‌మోర్‌ అంటూ మరోసారి థియేటర్‌ వైపు అడుగులేస్తుంటే చూడనివాళ్లమే వీలు చేసుకుని మరీ కశ్మీర్‌ ఫైల్స్‌ చూసేయాలని తహతహలాడుతున్నారు. అసలు ప్రచారమే చేయకపోయినా కేవలం మౌత్‌ టాక్‌తోనే జనాలను థియేటర్‌కు రప్పిస్తోందీ మూవీ. ఈ సినిమా చూసిన కశ్మీర్‌ పండిట్లు గతాన్ని తలుచుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. అలా ఎంతోమందిని కదిలిస్తోందీ చిన్న చిత్రం.

మార్చి 11న విడుదలైన ఈ సినిమా నిన్నటితో వందకోట్ల మైలు రాయిని దాటేసింది. వారంరోజుల తర్వాత కూడా (ఎనిమిదో రోజు) 19 కోట్లకు పైగా రాబట్టి బాహుబలి 2 రికార్డుతో సరిసమానంగా తులతూగింది. ఈ విషయాన్ని ట్రేడ్‌ నిపుణుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు. 'ది కశ్మీర్‌ ఫైల్స్‌ చరిత్ర సృష్టించింది. ఎనిమిదో రోజు అత్యధికంగా రూ.19.15 కోట్లు రాబట్టి దంగల్‌(రూ.18.59) రికార్డును బద్ధలు కొట్టడమే కాకుండా బాహుబలి 2(రూ.19.75) సరసన నిలిచింది. మొత్తంగా రూ.116.45 కోట్లు రాబట్టి ఆల్‌టైమ్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది' అని ట్వీట్‌ చేశాడు.

చదవండి: బిగ్‌బీ ట్వీట్‌పై నెటిజన్ల ట్రోలింగ్‌, కశ్మీర్‌ ఫైల్స్‌ గురించేనా?

అంతేకాదు, రెండో వారంలో రూ. 150 కోట్ల మార్క్‌ను కూడా అవలీలగా అందుకుంటుందని జోస్యం పలికాడు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలోనూ ఈ సినిమా డబ్‌ అవుతోందని చెప్పాడు. కాగా కశ్మీర్‌ ఫైల్స్‌లో అనుపమ్‌ ఖేర్‌, మిథున్‌ చక్రవర్తి, పల్లవి జోషి, దర్శన్‌ కుమార్‌, చిన్మయి, భాషా సుంబ్లి తదితులు నటించారు. ఈ సినిమాకు ఉత్తరప్రదేశ్‌, గోవా, త్రిపుర, హర్యానా, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో వినోద పన్ను మినహాయించారు.

చదవండి: 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement