
ఈ సినిమాకు ప్రమోషన్స్ కన్నా పబ్లిక్ టాకే ఆయుధంగా పని చేసింది. ఫలితంగా రోజురోజుకూ వసూళ్లు పెరుగుతూ వస్తున్నాయి.
ఈ మధ్య సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాయి. లవ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు ఎక్కువైన తరుణంలో ఫ్యామిలీ ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేస్తూ థియేటర్‌లో అడుపెట్టింది బలగం. మాయమైపోతున్న కుటుంబ బంధాలను, ఆప్యాయతలను, ఎమోషన్స్‌ను కళ్లకు కట్టినట్లు చూపించి చివర్లో కళ్లు తుడుచుకునేలా చేసింది. మార్చి 3న విడుదలైన ఈ సినిమాకు ప్రమోషన్స్ కన్నా పబ్లిక్ టాకే ఆయుధంగా పని చేసింది. ఫలితంగా రోజురోజుకూ వసూళ్లు పెరుగుతూ వస్తున్నాయి.
చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం వారం రోజుల్లోనే లాభాల పట్టింది. మొదటి రోజు రూ.55 లక్షలు, రెండో రోజు రూ.80 లక్షలు రాబట్టగా మూడో రోజు వచ్చేసరికి ఏకంగా రూ.1.75 కోట్లు వసూలు చేసింది. ఇప్పటివరకు మొత్తంగా ఏడు కోట్ల మేర గ్రాస్ (రూ. 3.07 కోట్ల షేర్) రాబట్టినట్లు తెలుస్తోంది. కాగా మల్లేశం సినిమాతోనే తన సత్తా ఏంటో నిరూపించుకున్న ప్రియదర్శి బలగంలో తెలంగాణ యువకుడిగా నటించాడు. ప్రియదర్శి తాత పాత్రలో సుధాకర్ రెడ్డి జీవించాడు. జబర్దస్త్ వేణు ఈ మూవీతో దర్శకుడిగా పరిచయమవగా దిల్ రాజు నిర్మించాడు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.
The love for #Balagam is getting stronger with each passing day♥️💪
— Dil Raju Productions (@DilRajuProdctns) March 8, 2023
Thank you for your overwhelming appreciation and support!
In Cinemas Now@offlvenu @priyadarshi_i @kavyakalyanram @dopvenu #Bheemsceciroleo @LyricsShyam@DilRajuProdctns pic.twitter.com/4bnNPfe4ze