తెలుగు సినిమాల ఓపెనింగ్ కలెక్షన్స్ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. హిందీ సినిమాలు కూడా ఆ టార్గెట్‌ను అందుకోవాలంటే కాస్తా కష్టమే అనేలా ఉన్నాయి. బాలీవుడ్‌లో పుష్ప2 కలెక్షన్స్ రికార్డ్ క్రియేట్ చేశాయి. ఈమేరకు చిత్ర యూనిట్ అధికారికంగా ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. బాలీవుడ్‌లో షారుఖ్‌ఖాన్, అమీర్‌ఖాన్,సల్మాన్‌ఖాన్ వంటి స్టార్స్‌కు కూడా సాధ్యం కానీ రికార్డ్ అల్లు అర్జున్ క్రియేట్ చేశాడు.
బాలీవుడ్‌లో ఇప్పటి వరకు మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా షారుఖ్‌ఖాన్ 'జవాన్' రూ. 65.5 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. అయితే, ఇప్పుడు 'పుష్ప2' ఆ రికార్డ్‌ను దాటేసింది. హిందీలో ఫస్ట్ డే రూ.72 కోట్ల నెట్ రాబట్టి ఫస్ట్ ప్లేస్‌లోకి పుష్ప2 చేరిపోయింది. బన్నీ స్టార్‌డమ్‌తోనే హిందీ 'పుష్ప'కి భారీ ఓపెనింగ్స్ వచ్చాయని అక్కడి ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. బాలీవుడ్ ఫస్ట్ కలెక్షన్స్ టాప్ టెన్ లిస్ట్‌లో పుష్ప2 చిత్రం మాత్రమే ఉండటం విశేషం. ఆ తర్వాతే టాలీవుడ్ నుంచి బాహుబలి2 ( 41 కోట్లు), ఆదిపురుష్ ( రూ 37.25 కోట్లు), సాహో ( రూ.24.4 కోట్లు), కల్కి (రూ. 22.5 కోట్లు) వంటి చిత్రాలు ఉన్నాయి.
బాలీవుడ్‌లో ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్స్
1. పుష్ప2 ( రూ. 72 కోట్ల నెట్)
2. జవాన్ (రూ. 65.5 కోట్ల నెట్)
3. స్త్రీ2 ( రూ.55 కోట్లు)
4. పఠాన్ ( రూ. 55 కోట్లు)
5. యానిమల్ ( రూ.54.75 కోట్లు)
6. కేజీఎఫ్2 ( రూ.53.95 కోట్లు)
7. వార్ (రూ. 51.60 కోట్లు)
8. థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ ( రూ. 50 కోట్లు)
9. సింగం ఎగైన్ (రూ. 43.5 కోట్లు)
10. టైగర్3 (రూ.43 కోట్లు)
Comments
Please login to add a commentAdd a comment