పాన్ ఇండియా మూవీ ఆర్‌ఆర్‌ఆర్ (రౌద్రం రణం రుధిరం) ఏ రేంజ్‌లో హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరోనా కారణంగా ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన విషయం తెలిసిందే. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే చరిత్ర సృష్టించిన ఆర్‌ఆర్‌ఆర్ బాక్సాఫీస్ మీద వసూళ్ల దండయాత్ర చేస్తోంది. ఎక్కడా తగ్గేదేలే అన్న రీతిలో కలెక్షన్లు రాబడుతోంది. కేవలం ఏడు రోజుల్లోనే ఏడు వందల కోట్లకు పైగా సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. బ్రేకుల్లేకుండా దూసుకుపోతున్న ఆర్‌ఆర్‌ఆర్ మున్ముందు ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి!
చదవండి: అందుకే ఆర్‌ఆర్‌ఆర్ పోస్టులు డిలీట్ చేశా: ఆలియా క్లారిటీ
ఇక ఆర్‌ఆర్‌ఆర్ మూవీ విషయానికి వస్తే.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా, రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించారు. తారక్‌కు జోడీగా ఒలివియా మోరిస్, చెర్రీకి జోడీగా ఆలియా భట్ నటించారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించాడు. సుమారు రూ.450 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించాడు. ఎమ్‌ఎమ్ కీరవాణి సంగీతం అందించాడు.
#RRRMovie WW Box Office
— Manobala Vijayabalan (@ManobalaV) April 1, 2022
ENTERS ₹700 cr club in just 7 days.
Day 1 - ₹ 257.15 cr
Day 2 - ₹ 114.38 cr
Day 3 - ₹ 118.63 cr
Day 4 - ₹ 72.80 cr
Day 5 - ₹ 58.46 cr
Day 6 - ₹ 50.74 cr
Day 7 - ₹ 37.20 cr
Total - ₹ 709.36 cr
చదవండి: పరుచూరి వెంకటేశ్వరరావు షాకింగ్ లుక్‌పై స్పందించిన గోపాల కృష్ణ
Comments
Please login to add a commentAdd a comment