సినిమాలో కంటెంట్ లేకపోతే ఉట్టి ప్రచారాలతో ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించడం చాలా కష్టం. కానీ మూవీలో కనెక్ట్ అయ్యే పాయింట్, కట్టిపడేసే కథనం ఉంటే మాత్రం ఏ ప్రచారం చేయకపోయినా జనాలు వాళ్లంతట వాళ్లే థియేటర్‌వైపు వడివడిగా అడుగులు వేస్తారు. అందుకు కశ్మీర్ ఫైల్స్ మూవీయే అతి పెద్ద నిదర్శనం. సైలెంట్‌గా థియేటర్‌లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత్‌లో మూడు వారాల్లోనే రూ.234.03 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది.
ఓవర్సీస్ కలెక్షన్లను కూడా కలుపుకుంటే ప్రపంచ్యాప్తంగా రూ.301 కోట్ల గ్రాస్ అందుకుంది. ఈ లెక్కన కశ్మీర్ ఫైల్స్.. సల్మాన్ ఖాన్ 'రేస్ 3'(రూ.294.98 కోట్లు), అక్షయ్ కుమార్ 'సూర్యవంశీ' (రూ.294.17 కోట్లు) చిత్రాలను సైతం వెనక్కినెట్టి రికార్డులు తిరగరాస్తోంది. ఈ దూకుడు చూస్తుంటే త్వరలోనే అక్షయ్ కుమార్ 'టాయ్‌లెట్: ఏక్ ప్రేమ కథ' (రూ.308 కోట్లు) వసూళ్లను కూడా అధిగమించనున్నట్లు కనిపిస్తోంది.
#TheKashmirFiles [Week 3] Fri 4.50 cr, Sat 7.60 cr, Sun 8.75 cr, Mon 3.10 cr, Tue 2.75 cr. Total: ₹ 234.03 cr. #India biz. ALL TIME BLOCKBUSTER. pic.twitter.com/KCgOAZd0R9
— taran adarsh (@taran_adarsh) March 30, 2022
చదవండి: రాజకీయాల్లోకి వెళ్లి ఆమెతో నటించే చాన్స్ మిస్సయ్యాను: చిరంజీవి
Comments
Please login to add a commentAdd a comment