ప్రస్తుతం దేశమంతటా ఆర్‌ఆర్‌ఆర్ మేనియా నడుస్తోంది. రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాన్ని చూసేందుకు జనాలు థియేటర్లకు ఎగబడుతున్నారు. రామ్‌చరణ్, తారక్‌ల నటనకు ఫిదా అవుతున్నారు. సౌత్ నుంచి నార్త్ దాకా అంతటా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మరోవైపు అడ్వాన్స్ బుకింగ్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆర్‌ఆర్‌ఆర్ తొలిరోజు కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే! తొలి రోజు ప్రపంచవ్యాప్తంగారూ.223 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. నిన్న శనివారం కావడంతో ఈ కలెక్షన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
హిందీలో తొలిరోజు రూ.18 కోట్లు రాబట్టి సాహో రికార్డును దాటలేకపోయిన ఈ సినిమా రెండో రోజు మాత్రం ఏకంగా రూ.24 కోట్ల మేర వసూలు చేసినట్లు తెలుస్తోంది. వీకెండ్‌లో ఈ వసూళ్లు మరింత పుంజుకునే ఛాన్స్ ఉంది. రెండో రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.107 -137 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం. రెండురోజుల్లోనే ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం రూ.350 కోట్ల మార్క్‌ను అధిగమించినట్లు తెలుస్తోంది.
#RRR has crossed ₹ 350 crs gross at the WW Box office..
— Ramesh Bala (@rameshlaus) March 27, 2022
ఎన్టీఆర్, రామ్‌చరణ్ మల్టీస్టారర్లుగా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవగణ్‌లతో పాటు హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్, అలిసన్ డూడి, రే స్టీవెన్ సన్ తదితరులు నటించారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
#RRR crosses $7 Million in USA 🇺🇸
— Ramesh Bala (@rameshlaus) March 27, 2022
#RRR Day 2 Share in #Nizam - ₹ 15.10 Crs.. 🔥 pic.twitter.com/XlD6jlZ0n8
— Ramesh Bala (@rameshlaus) March 27, 2022
#RRR improves Hindi collections on Day 2..
— Ramesh Bala (@rameshlaus) March 27, 2022
All-India Early Estimates ₹ 24 crs Nett..
#USA BO - March 25th :
— Ramesh Bala (@rameshlaus) March 27, 2022
1. #TheLostCity - $11,550,000 (Incl Premieres)
2. #TheBatman - $5,500,000
3. #RRRMovie - $5,400,000 (Incl Premieres)
చదవండి: కలెక్షన్స్ సునామీ సృష్టించిన ఆర్‌ఆర్‌ఆర్... తొలిరోజే రికార్డు బద్దలు
Comments
Please login to add a commentAdd a comment