RRR Movie Fourth Week Box Office Collections: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్లుగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్ర.. రణం.. రుధిరం). దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 24న విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టింది. వెయ్యి కోట్లకుపైగా వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా సత్తా చాటింది. ఈ చిత్రం ఓవర్సీస్‌లోనే రూ. 300 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టగా.. బాలీవుడ్‌లో కూడా రూ. 300 కోట్లను వసూలు చేసింది. తాజాగా ఈ చిత్రం నాలుగు వారాల కలెక్షన్లను వెల్లడించింది మూవీ యూనిట్. ఆర్ఆర్ఆర్ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ. 1100 కోట్ల కలెక్షన్లను రాబట్టినట్లు తెలిపింది.
ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ. 350 కోట్లకుపైగా వసూలు చేయగా.. కన్నడ, తమిళం, మలయాళంలో సుమారు మరో వంద కోట్లకుపైగా కలెక్షన్లు వచ్చాయి. కేవలం ఇండియాలో మాత్రమే 7 వందలకోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది ఈ మూవీ. దీంతో బాహుబలి తర్వాత రెండోస్థానంలో ఆర్ఆర్ఆర్ నిలిచింది. అయితే ఈ చిత్రం 1100 కోట్లు గ్రాస్ కలెక్షన్ సాధించినా షేర్ మాత్రం రూ. 600 కోట్లకే పరిమితమైంది.
చదవండి: ఆర్‌ఆర్‌ఆర్ ఓటీటీ రిలీజ్, ఆ తేదీ నుంచే స్ట్రీమింగ్?
ప్రస్తుతం ఐదో వారంలోకి ఎంటర్ అవుతున్న ఆర్ఆర్ఆర్‌కి 'కేజీఎఫ్ 2' ఎఫెక్ట్ ఉంది. కేజీఎఫ్ 2కు ముందు వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ తర్వాత వంద కోట్లు రాబట్టేందుకు వారం రోజులు పట్టింది. ప్రస్తుతం ఆర్ఆర్‌ఆర్ వసూళ్లు క్లోజింగ్‌కు చేరుకున్నాయి. మహా అయితే మొత్తంగా మరో 50 నుంచి 100 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' తర్వాత తెలుగు రాష్ట్రాల్లో 'ఆర్‌ఆర్‌ఆర్' కలెక్షన్లు పూర్తిగా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది.
'RRR' GROSSES ₹ 1100 CR+ WORLDWIDE... OFFICIAL POSTER ANNOUNCEMENT...#SSRajamouli #JrNTR #RamCharan #AjayDevgn #AliaBhatt #DVVDanayya #GBOC pic.twitter.com/QGRIulLI2Z
— taran adarsh (@taran_adarsh) April 22, 2022
చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌లో ఎన్టీఆర్ ఎలివేషన్ సీన్‌ను డిలీట్ చేశారు: బయటపెట్టిన నటుడు
Comments
Please login to add a commentAdd a comment