ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’. ఆర్య, ఆర్య 2 లాంటి హిట్ మూవీల తర్వాత వచ్చిన చిత్రం కావడంతో ‘పుష్ప’పై తొలి నుంచే హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం.. ఓపెన్సింగ్స్‌ని కూడా అదే రేంజ్‌లో రాబట్టినట్లు తెలుస్తోంది.
(చదవండి: ‘పుష్ప’మూవీ రివ్యూ)
ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3000 పైగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది పుష్ప. నైజాం, ఆంధ్రాలో కలిపి 1150 థియేటర్లలో విడుదలైంది. అలాగే కర్ణాటక, తమిళనాడు, కేరళ, హిందీలో కలిపి సుమారు 1200 థియేటర్లలో, ఓవర్సీస్‌లో 600 థియేటర్లలో రిలీజైంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత బన్నీ, సుక్క జతకట్టడం.. అల్లు అర్జున్‌కు తొలి పాన్ ఇండియా చిత్రం కావడంతో ‘పుష్ప’తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.49 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. నైజాం : 11.44 కోట్లు, సీడెడ్: 4.20 కోట్లు, ఉత్తరాంధ్ర: 1.8 కోట్లు, ఈస్ట్ : 1.43 కోట్లు, వెస్ట్: 1.5 కోట్లు, గుంటూరు: 2.28 కోట్లు, కృష్ణా 1.15 కోట్లు, నెల్లూరు: 1.10 కోట్లు, ఓవర్సీస్‌లో 4.25 కోట్ల కలెక్షన్స్ రాబట్టాయి. అయితే హిందీలో ప్రమోషన్స్ ఆశించినంత లేకపోవడమే పుష్ప కలెక్షన్స్ కొంతమేర తగ్గాయని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పుష్ప మూవీకి దాదాపు రూ.150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తొలి రోజు భారీగానే కలెక్షన్స్ వచ్చాయి. తర్వాత కూడా ఇదే జోరు సాగిస్తే తప్ప.. పుష్ప టీమ్ సేఫ్ జోన్‌లోకి రాదు.
Comments
Please login to add a commentAdd a comment