SR Kalyana Mandapam 5 Days Box Office Collections - Sakshi

కలెక్షన్లలో దూసుకెళ్తున్న ‘ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం’, ఐదో రోజులకు ఎంతంటే..

Aug 11 2021 6:50 PM | Updated on Aug 12 2021 1:19 PM

SR Kalyanamandapam 5 Days Box Office Collections - Sakshi

SR Kalyana Mandapam Collections: కిరణ్‌ అబ్బవరం, ప్రియాంకా జవాల్కర్‌ జంటగా శ్రీధర్‌ గాదె దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం’. ప్రమోద్, రాజు నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 6న విడుదలై మిక్స్‌డ్‌ టాక్‌తో దూసుకెళ్తుంది. ముఖ్యంగా ఇందులోని పాటలు యూత్‌ని బాగా అట్రాక్ట్‌ చేశాయి. దీంతో సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది. ఫలితంగా ఈ మూవీ అన్ని ఏరియాల్లోనూ భారీ ధరకు అమ్ముడు పోయింది. ఈ మూవీ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ ప్రపంచ వ్యాప్తంగా రూ.4.55 కోట్లు కాగా, బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ.4.80కోట్లుగా ఫిక్సైంది. 

అంచనాలకు తగ్గట్టే.. సినిమా విడుదలైన తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.41 కోట్లు, రెండో రోజు రూ. 1.25 కోట్లు, మూడో రోజు రూ. 1.40 కోట్లు, నాలుగో రోజు రూ. 74 లక్షలు వసూలు చేసింది. ఫలితంగా మొదటి నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుని హిట్ స్టేటస్‌ను అందుకుని రికార్డు సృష్టించింది. ఇక ఐదో రోజు దాదాపు రూ.60లక్షలు వసూలు చేసింది. మొత్తంగా ఎస్‌ ఆర్‌ కల్యాణ మండపం ఐదు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో కలిపి రూ.5.40 కోట్లు షేర్‌తో పాటు 8.74కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement