Kiran Abbavaram: ఆర్కే బీచ్‌లో కూర్చునే కథ రాశాను | SR Kalyanamandapam Hero Kiran Abbavaram In Vizag | Sakshi
Sakshi News home page

SR Kalyanamandapam: ఆర్కే బీచ్‌లో కూర్చునే కథ రాశాను

Published Mon, Aug 16 2021 7:30 PM | Last Updated on Tue, Aug 17 2021 3:57 PM

SR Kalyanamandapam Hero Kiran Abbavaram In Vizag - Sakshi

థియేటర్‌లో ప్రేక్షకులతో మాట్లాడుతున్నహీరో కిరణ్‌ అబ్బవరం  

సాక్షి, విశాఖపట్నం:ఆర్‌.కె.బీచ్‌లో కూర్చునే ఎస్‌.ఆర్‌.కల్యాణ మండపం కథా రాశానని చిత్రం హీరో, రచయిత కిరణ్‌ అబ్బవరం వెల్లడించారు. నగరంలో మెలోడి థియేటర్‌లో ఆదివారం చిత్ర యూనిట్‌ సందడి చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం, ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌గా ఎస్‌ఆర్‌ కల్యాణ మండపం రూపొందించామన్నారు. ఈ చిత్రానికి ఆశించిన దానికంటే అద్భుత విజయం అందించిన ప్రేక్షకుల మేలు మరువలేనిదన్నారు.

సంపాదిస్తే తండ్రికి ఎంతోవిలువ, గౌరవం ఉంటుందని, లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపించామన్నారు. సీనియర్‌ నటుడు సాయికుమార్‌ నటన ఈ చిత్రానికి హైలెట్‌గా నిలిచిందన్నారు. చిత్రంలో చివరి 20 నిమిషాలు ప్రేక్షకులు చాలా ఎమోషనల్‌కు గురవుతున్నారన్నారు. గాయత్రి దేవి ఫిల్మ్స్‌ అధినేత సతీష్‌ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర, నైజాం, కర్నాటక కలిసి 500 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేశామన్నారు. కార్యక్రమంలో సహ నిర్మాత, నటుడు భరత్‌ రొంగలి, మెలోడి థియేటర్‌ ప్రతినిధులు గౌరి, రమణ పాల్గొన్నారు.

చదవండి: ఎస్‌.ఆర్‌. కళ్యాణ మండపం’ మూవీ రివ్యూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement