
కాంతార సినిమా తెలుగులోనూ అదిరిపోయే కలెక్షన్లతో దుమ్మురేపుతుంది.
రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం 'కాంతార'. కన్నడలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం తెలుగులోనూ అదిరిపోయే కలెక్షన్లతో దుమ్మురేపుతుంది. రిలీజైన తొలిరోజు నుంచే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. కాంతార రైట్స్ కేవలం రూ. 2 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. మొదటిరోజు 1.95 కోట్ల గ్రాస్ ను సాధించిన ఈ చిత్రం రెండవ రోజు ఏకంగా రూ. 11.5 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది. కేవలం మౌత్‌టాక్‌తోనే ఇంత పెద్ద విజయం సాధించడం అరుదైన విషయం.
కన్నడలో భారీ విజయం సాధించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలుగులో రిలీజ్ చేశారు. రిషబ్ శెట్టి అద్భుతమైన నటన, విజువల్స్‌కి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తోడై కాంతార థియేటర్స్‌లో మాస్ జాతర చేస్తోంది. కన్నడలో 17 రోజుల కలెక్షన్స్ ను తెలుగులో కేవలం రెండు రోజుల్లోనే కొల్లగొట్టిందీ చిత్రం. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది కాంతార.
తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్‌తో దూసుకుపోతుంది. ముఖ్యంగా ఈ ‘కాంతార’ క్లైమాక్స్ సినిమా విజయంలో ప్రధాన పాత్ర పోషించింది. చివరి 20 నిమిషాలు అరాచకానికి అర్థం చూపించాడు రిషబ్ శెట్టి. అప్పటివరకు మాములుగా సాగుతున్న సినిమాను క్లైమాక్స్ లో వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు. ఇప్పటికే కన్నడలో సంచలనం సృష్టించిన ఈ చిత్రం, తెలుగులో కూడా అంతకు మించిన విజయఢంకా మోగిస్తోంది.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Tremendous response from the audience for #KantaraTelugu 🔥
— Geetha Arts (@GeethaArts) October 16, 2022
95% rating on @bookmyshow 💥
Watch #Kantara in theaters near you now! 💥
🎟️: https://t.co/WNkTI6j3BF #Kantara @shetty_rishab @VKiragandur @hombalefilms @GeethaArts @gowda_sapthami @AJANEESHB @actorkishore pic.twitter.com/p5YnWJiCe9