మాస్ యాంగిల్‌లో దుమ్ములేపాడు మహేశ్‌బాబు. గుంటూరు కారం సినిమాలో తన యాక్టింగ్‌తో ఫ్యాన్స్‌కు ఫుల్ బిర్యానీ తినిపించాడు. కానీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసే అక్కడక్కడా తడబడ్డట్లు కనిపించింది. అయితే పాటలు, ట్రైలర్ బాగా క్లిక్ అవ్వడంతో అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజులో జరిగాయి. దీంతో సంక్రాంతి పందెంలో దిగిన గుంటూరు కారం తొలి రోజు బీభత్సంగా రాబట్టింది. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఫస్ట్‌డే రూ.94 కోట్లు రాబట్టింది.
కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్
సూపర్ స్టార్ మహేశ్ తన కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నాడంటూ చిత్రయూనిట్ ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసింది. ఇది చూసిన అభిమానులు జై బాబు, రికార్డ్స్ బ్రేకింగ్ రమణ అంటూ సంతోషంతో కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. జగపతిబాబు, రమ్యకృష్ణ, వెన్నెల కిషోర్, సునీల్, ప్రకాశ్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. తమన్ సంగీతమందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.
సంక్రాంతి బరిలో విజయం సాధించేనా?
ఇప్పటికే గుంటూరు కారం చిత్రానికి పోటీగా హనుమాన్, సైంధవ్ రంగంలోకి దిగాయి. వీటిలో హనుమాన్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.20 కోట్ల మేర రాబట్టినట్లు తెలుస్తోంది. కానీ మౌత్ టాక్ వల్ల హనుమాన్ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. రేపు(జనవరి 14న) ఈ మూడు సినిమాలకు పోటీగా నా సామిరంగ రిలీజ్ కానుంది. బాక్సాఫీస్ వద్ద జరిగే ఫైట్‌లో ఈ నాలుగింటిలో ఏది విజేతగా నిలుస్తుందో రానున్న రోజుల్లో తేలనుంది!
Biggest opening day ever for the Reigning Super 🌟 @urstrulyMahesh 🕺😎#GunturKaaram strikes a 𝐑𝐄𝐂𝐎𝐑𝐃 𝐁𝐑𝐄𝐀𝐊𝐈𝐍𝐆 𝟗𝟒 𝐂𝐑 𝐆𝐫𝐨𝐬𝐬 Worldwide on Day 1 ~ 𝗔𝗟𝗟 𝗧𝗜𝗠𝗘 𝗥𝗘𝗖𝗢𝗥𝗗 in regional cinema! 🔥🔥
— Haarika & Hassine Creations (@haarikahassine) January 13, 2024
Watch the #BlockbusterGunturKaaram at cinemas near you… pic.twitter.com/TNNMBjVLeI
చదవండి: హను-మాన్ తొలి రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
అప్పుడు శోభన్ బాబు.. ఇప్పుడు అక్కినేని నాగేశ్వర రావు
Comments
Please login to add a commentAdd a comment