Kantara Telugu Version Crosses Massive 50 Crore At Box Office Collections, Deets Inside - Sakshi
Sakshi News home page

Kantara Collections: టాలీవుడ్‌లో తగ్గని ‘కాంతార’జోరు.. రూ.50 కోట్ల క్లబ్‌లోకి కన్నడ మూవీ

Published Wed, Nov 2 2022 1:10 PM | Last Updated on Wed, Nov 2 2022 5:10 PM

Kantara Telugu Version Crosses Massive 50 Crore At Box Office - Sakshi

చిన్న చిత్రంగా విడుదలై భారీ విజయం సాధించిన తాజా కన్నడ చిత్రం ‘కాంతార’. ఈ చిత్రం కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది. దీంతో ఈ సినిమాను అన్ని భాషల్లో డబ్బింగ్‌ చేసి రిలీజ్‌చేశారు. టాలీవుడ్‌లో అక్టోబర్‌ 15న విడుదలైన ఈ చిత్రం.. ఫస్ట్‌ షో నుంచే పాజిటివ్‌ టాక్‌ సంపాదించుకుంది. కాంతార చిత్రం విడుదలైన  2 వారాల్లోనే 45 కోట్లు వసూళ్లు సాధించి రికార్డు సాధించింది.

తాజాగా ఈ చిత్రం రూ.50 కోట్ల క్లబ్‌లో చేరింది. ఒక డబ్బింగ్ సినిమా ఈ స్థాయిలో కలెక్షన్స్‌ రాబట్టడం రికార్డు అని సినీ వర్గాలు చెబుతున్నాయి. కాంతార కేవలం తెలుగులోనే కాకుండా ఇండియా వైడ్ కూడా ఈ సినిమా చాలా బాగా ఆడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరాంగదుర్‌ నిర్మించారు. తెలుగులో అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ ‘గీతాఫిల్మ్‌ డిస్ట్రిబ్యూషన్‌’ ద్వారా విడుదల చేశారు. (క్లిక్ చేయండి: యాంకర్‌ విష్ణుప్రియ ఫేస్‌బుక్‌లో అశ్లీల వీడియోలు కలకలం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement