Avatar The Way Of Water Enters Rs 300 Cr Club, Check Worldwide Box Office Collection Details - Sakshi

Avatar The Way of Water Collections: అవతార్‌ వసూళ్లు ఆగడం లేదుగా, ఎన్ని వేల కోట్ల కలెక్షన్లంటే?

Dec 26 2022 2:04 PM | Updated on Dec 26 2022 3:09 PM

Avatar The Way of Water Enters Rs 300 cr Club, Worldwide Collection Details - Sakshi

సినిమాకు పోటీగా ప్రస్తుతం బాక్సాఫీస్‌ దగ్గర ఏ చిత్రం కూడా లేకపోవడంతో వసూళ్ల సునామీ ఇప్పుడప్పుడే ఆగేట్లు కనిపించడం లేదు.

హాలీవుడ్‌ భారీ బడ్జెట్‌ చిత్రం అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌ బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషన్‌ సృష్టిస్తోంది. మొదటి వారం కలెక్షన్లతో ఇరగదీసిన ఈ మూవీ రెండోవారం కూడా అదే జోరు కొనసాగించింది. గత వారంలో క్రిస్‌మస్‌ సెలవులు ఉండటంతో సినిమాకు బాగా కలిసొచ్చింది. ఈ హాలీడేస్‌ను బాగా క్యాష్‌ చేస్తున్న అవతార్‌ 2 ఒక్క ఇండియాలోనే రూ.300 కోట్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఏడు వేల కోట్లు రాబట్టింది. 

ఈ సినిమాకు పోటీగా ప్రస్తుతం బాక్సాఫీస్‌ దగ్గర ఏ చిత్రం కూడా లేకపోవడంతో వసూళ్ల సునామీ ఇప్పుడప్పుడే ఆగేట్లు కనిపించడం లేదు. శుక్రవారం నాడు బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ సర్కస్‌ సినిమా రిలీజ్‌ అయినప్పటికీ దానికి స్పందన అంతంత మాత్రమే! దీంతో హిందీ ఆడియన్స్‌ కూడా అవతార్‌ సీక్వెల్‌ను ఎగబడి మరీ చూస్తున్నారు. అవతార్‌ 2 రిలీజైన రెండో శనివారం కూడా అత్యధికంగా రూ.21(నెట్‌) కోట్లు వసూలు చేసింది. దీంతో ఇండియాలో రెండో శనివారం అత్యధిక వసూళ్లు రాబట్టిన హాలీవుడ్‌ చిత్రంగా రికార్డు సృష్టించిందీ మూవీ.

కాగా జేమ్స్‌ కామెరూన్‌ డైరెక్ట్‌ చేసిన అవతార్‌(2009) చిత్రం ఎన్నో అద్భుతాలు సృష్టించింది. విజువల్‌ వండర్‌గా వరల్డ్‌ వైడ్‌ బ్లాక్‌బాస్టర్‌గా నిలిచిన ఈ మూవీకి పదమూడేళ్ల తర్వాత సీక్వెల్‌గా వచ్చింది అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌. ఈ నెల 16న రిలీజైన ఈ చిత్రంలో సిగర్నీ వీవర్‌, కేట్‌ విన్స్‌లెట్‌, క్లిఫ్ఫ్‌ కర్టిస్‌, ఈడీ ఫాల్కో, జెమైన్‌ క్లెమెంట్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇండియాలో తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్‌, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజైంది.

చదవండి: అవతార్‌ 2 ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. టికెట్‌ రేట్లు తగ్గాయ్‌
రెండు థియేటర్లు అమ్మేశారు.. బాబాయి పోయిన నెలకే నాన్న: కమెడియన్‌ కూతురు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement