మాలీవుడ్ నుంచి కబురందుకున్నారట హీరోయిన్ సమంత. దుల్కర్ సల్మాన్ హీరోగా అభిలాష్ జోషి దర్శకత్వంలో ‘కింగ్ ఆఫ్ కోథా’ అనే గ్యాంగ్‌స్టర్ డ్రామా తెరకెక్కనుంది. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు చిత్రయూనిట్ సమంతను సంప్రదించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్త నిజమైతే సమంతకు మలయాళంలో ఇదే తొలి సినిమా అవుతుంది. అలాగే హిందీ, కన్నడంలో కూడా సమంత సినిమాలు చేయలేదు.
అయితే బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, ఆయుష్మాన్ ఖురానా, రణ్‌వీర్ సింగ్‌లతో సినిమాలు చేసేందుకు సమంత అంగీకరించారనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక సమంత నటించిన ‘శాకుంతలం’, ‘యశోద’ చిత్రాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలోని ‘ఖుషి’ చిత్రంలో నటిస్తున్నారు సమంత.
Comments
Please login to add a commentAdd a comment