
ఒకప్పుడు వరుస విజయాలతో స్టార్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్న దిల్‌రాజు ఇటీవల కాస్త స్లో అయ్యాడు. తన బ్యానర్‌లో తెరకెక్కిన సినిమాలు వరుసగా పరాజయం పాలు అవుతుండటంతో క్రేజీ కాంబోలను సెట్ చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్‌లు హీరోలుగా తెరకెక్కుతున్న ఎఫ్2తో పాటు మహేష్ బాబు మహర్షి సినిమాలను నిర్మిస్తున్నారు దిల్ రాజు.
వీటితో పాటు తదుపరి చిత్రాలను ఫైనల్ చేసే పనిలోఉన్నారట. ఇటీవల నాని హీరోగా తమిళ సూపర్ హిట్ 96ను రీమేక్ చేయనున్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్ సెట్ కాకపోవటంతో నాని హీరోగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను రెడీ చేస్తున్నారట. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ సినిమాను ప్లాన్‌చేస్తున్నారట.
ఈ సినిమాలో నానితో పాటు సౌత్‌లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ తీసుకునే ఆలోచనలో ఉన్నారు. దుల్కర్ నటిస్తే ఇతర భాషల్లోనూ సినిమా రిలీజ్ చేయోచ్చన్న ఆలోచనలో ఉన్నాడట దిల్ రాజు. అయితే ప్రస్తుతం నాని, దుల్కర్‌లు బిజీగా ఉన్నారు. వాళ్లు ఫ్రీ అయితే గాని దిల్ రాజు ప్రాజెక్ట్‌పై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.