ఆకాశంలో ఒక తార | Dulquer Salmaan new movie Aakasam Lo Oka Tara | Sakshi
Sakshi News home page

ఆకాశంలో ఒక తార

Published Mon, Jul 29 2024 5:57 AM | Last Updated on Mon, Jul 29 2024 5:58 AM

Dulquer Salmaan new movie Aakasam Lo Oka Tara

దుల్కర్‌ సల్మాన్  హీరోగా నటించనున్న సినిమాకు ‘ఆకాశంలో ఒక తార’ అనే టైటిల్‌ ఖరారైంది. పవన్  సాధినేని ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌ బాక్స్‌ మీడియా సమర్పణలో సందీప్‌ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనేప్రారంభం కానుంది. కాగా ఆదివారం (జూలై 28) దుల్కర్‌ సల్మాన్  బర్త్‌ డే సందర్భంగా ‘ఆకాశంలో ఒక తార’ సినిమాను అధికారికంగా ప్రకటించి,పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌.

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్‌ కానున్న ఈ సినిమా పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని యూనిట్‌ పేర్కొంది. ఇదిలా ఉంటే.. దుల్కర్‌ సల్మాన్  నటించిన పీరియాడికల్‌ మూవీ ‘లక్కీభాస్కర్‌’. మీనాక్షీ చౌదరి హీరోయిన్ గా నటించారు.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో సెప్టెంబర్‌ 7న విడుదల కానుంది. దుల్కర్‌  బర్త్‌ డే సందర్భంగా ‘లక్కీభాస్కర్‌’ టైటిల్‌ ట్రాక్‌ను ఆదివారం విడుదల చేశారు మేకర్స్‌.రామజోగయ్య శాస్త్రి లిరిక్స్‌ అందించిన ఈపాటను ఉషా ఉతుప్‌పాడారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్‌ స్వరకర్త.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement