Dulquer Salmaan: Have Not Slept In A While In Cryptic Post - Sakshi
Sakshi News home page

Dulquer Salmaan: ఆ ఒక్క సంఘటనతో పరిస్థితులు తారుమారంటూ దుల్కర్‌ పోస్ట్‌.. హీరోకు ఏమైంది?

Published Mon, Jul 3 2023 3:29 PM | Last Updated on Mon, Jul 3 2023 3:57 PM

Dulquer Salmaan: Have Not Slept In A While In Cryptic Post - Sakshi

మలయాళ స్టార్‌ మమ్ముట్టి తనయుడిగా వెండితెరపై అడుగుపెట్టాడు దుల్కర్‌ సల్మాన్‌..  తమిళ, మలయాళ భాషల్లో హీరోగా సత్తా చాటిన ఇతడు మహానటి, సీతారామం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యాడు. ప్రస్తుతం అతడు సార్‌ డైరెక్టర్‌ వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్‌ అక్టోబరులో ప్రారంభం కానుంది.

ఇదిలా ఉంటే ఆదివారం రాత్రి దుల్కర్‌ సల్మాన్‌ సోషల్‌ మీడియాలో భావోద్వేగ వీడియో షేర్‌ చేశాడు. 'తొలిసారి నేను ఓ సంఘటనను ఎదుర్కొన్నాను, అప్పటినుంచి పరిస్థితులు మారిపోయాయి. దానివల్ల నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను. జరిగిన సంఘటన నా మైండ్‌లో నుంచి పోవడం లేదు. ఇంకా చాలా చెప్పాలని ఉంది, కానీ దాన్ని నేను చెప్పలేకపోతున్నాను' అంటూ ఎమోషనలయ్యాడు. తర్వాత కాసేపటికే సదరు వీడియోను డిలీట్‌ చేశాడు. దీంతో అభిమానులు దుల్కర్‌ మానసిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దుల్కర్‌కు ఏమైంది? అతడి వ్యక్తిగత జీవితం బానే ఉంది కదా? అని కంగారుపడుతున్నారు. కొంతమంది మాత్రం ఇదంతా యాక్టింగే, తన నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రమోషనల్‌ స్టంట్‌ అయి ఉంటుందిలే అని కామెంట్లు చేస్తున్నారు. మరి ఏం జరిగిందనేది హీరోనే స్వయంగా చెప్తే కానీ తెలియదు. ఇదిలా ఉంటే దుల్కర్‌ నటించిన కింగ్‌ ఆఫ్‌ కోట ఆగస్టు 25న రిలీజ్‌ అవుతోంది.

చదవండి: ఈ వారం ఓటీటీలో ఏకంగా 24 సినిమాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement