
... సిక్స్ కొట్టాలి అని క్రికెట్ ప్రాక్టీస్ కోసం చెమటోడుస్తున్నారు దుల్కర్ సల్మాన్. ఎందుకుంటే... ఆయన హిందీలో నటించనున్న రెండో చిత్రం ‘జోయా ఫ్యాక్టర్’ చిత్రం కోసం. ఇందుకోసం ఆయన క్రికెట్ కోచ్‌ను కూడా పెట్టుకున్నారు. అనూజా చౌహన్ రచించిన ‘ది జోయా ఫ్యాక్టర్’ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది.
అభిషేక్ శర్మ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో సోనమ్ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో దుల్కర్ సల్మాన్ ఇండియన్ క్రికెట్ ప్లేయర్‌గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ ‘కర్వాన్’ సినిమాతో దుల్కర్ సల్మాన్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment