దుల్కర్‌ సల్మాన్‌ 'లక్కీ భాస్కర్‌' ట్రైలర్‌ | Lucky Baskhar Trailer Out Now | Sakshi
Sakshi News home page

దుల్కర్‌ సల్మాన్‌ 'లక్కీ భాస్కర్‌' ట్రైలర్‌

Published Mon, Oct 21 2024 7:11 PM | Last Updated on Mon, Oct 21 2024 7:50 PM

Lucky Baskhar Trailer Out Now

మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌ టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం 'లక్కీ భాస్కర్‌'. ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, సాంగ్స్‌ ప్రేక్షకులను మెప్పించాయి. ఇందులో మీనాక్షీ చౌదరి హీరోయిన్‌,సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ అంచనాలతో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. అయితే, తాజాగా విడుదలైన ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

'లక్కీ భాస్కర్‌' దీపావళి కానుకగా థియేటర్‌లోకి రానున్నాడు. తెలుగు, మలయాళ, తమిళ,  హిందీ భాషల్లో అక్టోబరు 31న రిలీజ్‌ చేయనున్నామనీ మేకర్స్‌ ఇప్పటికే  ప్రకటించారు. ఓ సాధారణ వ్యక్తికి చెందిన అసాధారణ ప్రయాణమే ఈ చిత్రమని వారు చెప్పుకొచ్చారు. 1980ల నాటి బొంబాయి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement