రాఖీ బాయ్‌తో కురుప్‌.. | Dulquer Salmaan Shares Picture With KGF Yash | Sakshi

రాఖీ బాయ్‌తో కురుప్‌..

Feb 5 2020 2:54 PM | Updated on Feb 5 2020 2:58 PM

Dulquer Salmaan Shares Picture With KGF Yash - Sakshi

మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌ ప్రస్తుతం కురుప్‌ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నూతన ఏడాది సందర్భంగా దుల్కర్‌ ఆ చిత్రం ఫస్ట్‌ లుక్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దుల్కర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కేజీఎఫ్‌ స్టార్‌ యష్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేశారు. ‘కురుప్ రాకీ భాయ్‌ని కలిసినప్పుటీ ఫొటో. యష్‌ చాలా మంచి వ్యక్తి. మిమ్మల్ని కలవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది యష్‌. మీ ఆథిత్యానికి నేను ఫిదా అయ్యాను. మిమ్మల్ని మళ్లీ కలవడం కోసం ఎదురు చూస్తున్నాను. అలాగే కేజీఎఫ్‌ 2లో రాక్‌ స్టార్‌ రాఖీ కోసం వెయిట్‌ చేస్తున్నాను’ అని పేర్కొన్నారు. 

ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరు స్టార్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూసిన అభిమానులు సంబరపడిపోతున్నారు. సినిమాల విషయానికి వస్తే.. దుల్కర్‌ నటించిన వారణే అవశ్యముండు చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో కళ్యాణి ప్రియదర్శన్‌, శోభన, సురేష్‌ గోపి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు యష్‌ నటిస్తున్న కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 చిత్రం షూటింగ్‌ మరి కొద్ది రోజుల్లో పూర్తి కానుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement