
భాస్కర్‌గా దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్‌లో కనిపించనున్న చిత్రం ‘లక్కీ భాస్కర్’. మీనాక్షి చౌదరి కథానాయిక. 1980–90ల కాలంలో అసాధారణ స్థాయికి చేరుకున్న ఒక సాధారణ బ్యాంక్ క్యాషియర్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. సెప్టెంబర్ 7న ‘లక్కీ భాస్కర్’ని రిలీజ్ చేయనున్నట్లు సోమవారం యూనిట్ పేర్కొంది.
తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ‘‘ముంబైలోని బ్యాంకులో పని చేసే క్యాషియర్‌గా కనిపిస్తారు దుల్కర్. నాటి ముంబై నగరాన్ని, భారీ బ్యాంకు సెట్‌ని హైదరాబాద్‌లో రూపొందించాం. భాస్కర్ అసాధారణ ప్రయాణంలో ప్రేక్షకులు లీనమైపోతారు’’ అని యూనిట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment