
టాలీవుడ్ స్టార్ నటుడు నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న ద్విభాషా చిత్రం(తమిళం, తెలుగు)లో ప్రియమణి ముఖ్యమంత్రిగా నటిస్తున్నట్లు తెలిసింది. ఆమె మొదట తమిళంలో పరుత్తివీరన్ చిత్రంలో ముత్తళగి పాత్రలో గ్రామీణ యువతిగా నటించి జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. తర్వాత పలు తమిళం, తెలుగు తదితర భాషా చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.
వివాహానంతరం హీరోయిన్ పాత్రలకు దూరమయ్యారు. తెలుగులో వచ్చిన నారప్ప చిత్రంలో వెంకటేష్‌కు జంటగా వైవిధ్య భరిత పాత్రలో నటించి మెప్పించారు. తాజాగా టాలీవుడ్ స్టార్ నటుడు నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న ద్విభాషా చిత్రంలో ప్రియమణి ముఖ్యమంత్రిగా నటిస్తున్నట్లు తెలిసింది. ఇందులో నాగచైతన్యకు జంటగా కృతిశెట్టి నటిస్తోంది. దీనికి కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు వెంకట్ ప్రభు కథ, దర్శకత్వం బాధ్యతలు చేపడుతున్నారు.
ఈయన ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. శరత్ కుమార్, అరవిందస్వామి, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, సంపత్ రామ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో నటి ప్రియమణి రాజకీయ నాయకురాలుగా అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకునేలా చిత్రకథ ఉంటుందని సమాచారం. ఒక మహిళ ముఖ్యమంత్రి అయితే ఎలాంటి మంచి పనులు చేయగలరు అని చెప్పేలా ప్రియమణి పాత్ర ఉంటుందని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment