పుష్ప-2లో ప్రియమణి.. ఆ వార్తలపై స్పందించిన నటి! | Actress Priyamani Reacts On Acting In Allu Arjun's Pushpa-2 | Sakshi
Sakshi News home page

Priyamani: 'ఆ వార్త విని ఆశ్చర్యపోయా'.. పుష్ప-2లో పాత్రపై ప్రియమణి!

Published Sun, Sep 10 2023 7:08 PM | Last Updated on Mon, Sep 11 2023 8:58 AM

Actress Priyamani Reacts On Will Acting In Allu Arjun Pushpa-2 - Sakshi

టాలీవుడ్ స్టార్ నటి ప్రియమణి ప్రస్తుతం షారుక్ ఖాన్ నటించిన జవాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ ఏడాది నాగచైతన్య మూవీ కస్టడీలోనూ కీలక పాత్రలో మెరిశారు. అయితే కొద్ది రోజులుగా ప్రియమణి బన్నీ చిత్రంలో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.  సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న పుష్ప-2 సినిమాలో కీలక పాత్ర పోషించనున్నట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో వీటిపై ప్రియమణి స్పందించారు. 

(ఇది చదవండి: ముచ్చటగా మూడోసారి.. హీరోయిన్‌కు ప్రెగ్నెన్సీ అంటూ కామెంట్స్?)

తనపై వస్తున్న వార్తలు చూసి ఆశ్చర్యానికి గురైనట్లు ప్రియమణి తెలిపారు. పుష్ప-2 నటించట్లేదని ఆమె స్పష్టం చేశారు. తనపై వస్తున్న రూమర్స్‌ చూసి వెంటనే మేనేజరుకు ఫోన్‌ చేసినట్లు వెల్లడించారు. అయితే అవకాశం వస్తే తప్పకుండా అల్లు అర్జున్‌తో మూవీలో నటిస్తానని పేర్కొన్నారు. కాగా.. పుష్ప చిత్రంలో విజయ్‌ సేతుపతి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారని.. ఆయన భార్యగా ప్రియమణి నటిస్తున్నారని కొద్ది రోజులుగా రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. 

(ఇది చదవండి: డిఫరెంట్ ట్రైలర్.. వినాయక చవితికి మూవీ రిలీజ్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement