Narappa Release Date: Venkatesh Daggubati New Movie Narappa Will Release On May 14 - Sakshi
Sakshi News home page

వేసవిలో నారప్ప రిలీజ్‌..

Published Fri, Jan 29 2021 4:51 PM | Last Updated on Tue, Feb 9 2021 10:39 AM

Narappa Will Step Into Theatres From 14th May 2021 - Sakshi

సినీ ప్రపంచానికి మత ప్రాంతీయ బేధాలుండవు. కథ, కాన్సెప్ట్‌ బాగుంటే చాలు రీమేక్‌లకు రెడీ అయిపోతారు దర్శక హీరోలు. అలా తమిళంలో హిట్‌ అయిన బోలెడు సినిమాలు తెలుగు చిత్ర పరిశ్రమను పలకరించి హిట్టు కొట్టాయి. ఈ క్రమంలో 2019లో తమిళనాట రిలీజై ఘన విజయం సాధించిన 'అసురన్'‌ చిత్రాన్ని నారప్పగా రీమేక్‌ చేస్తున్నారు. ఇందులో విక్టరీ వెంకటేశ్‌ నారప్పగా నటిస్తుండగా, ఆయన భార్య సుందరమ్మ పాత్రలో ప్రియమణి కనిపించనుంది. వీరి కొడుకుగా 'కేరాఫ్‌ కంచరపాలెం' నటుడు కార్తీక్‌ కీలకపాత్ర పోషిస్తున్నాడు. రావు రమేశ్‌‌, రాజీవ్‌ కనకాల ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. 'కొత్త బంగారు లోకం'తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

సురేశ్‌ ప్రొడక్షన్స్‌, వి క్రియేషన్స్‌ బ్యానర్స్‌లో డి.సురేశ్‌బాబు, కలైపులి ఎస్‌. థాను నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. వేసవికి థియేటర్లలో సందడి చేస్తామని చెప్పిన చిత్రయూనిట్‌ మాట నిలబెట్టుకుంది. మే 14న వేట మొదలు పెట్టేందుకు రంగం సిద్ధమైందని వెల్లడించింది. మరోవైపు వెంకటేశ్‌ అనిల్‌ రావిపూడి ఎఫ్‌3లో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 27 థియేటర్లలో నవ్వులు పూయించేందుకు రెడీగా ఉంది. దీని తరువాత వెంకటేశ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌తో కలిసి మరో ప్రాజెక్టు చేసేందుకు ఓకే చెప్పారు. గుర్రపు స్వారీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో హీరో లెక్చరర్‌ పాత్రలో కనిపిస్తారని టాక్‌ నడుస్తోంది. (చదవండి: ఎఫ్‌3 రిలీజ్‌ కూడా వచ్చేసింది.. ఎప్పుడంటే)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement