‘‘2020 సంవత్సరం అందరికీ చాలా కష్టంగా గడిచింది. కరోనా మహమ్మారి, లాక్‌డౌన్.. ఇలాంటి విషయాలు పక్కన పెడితే ఫ్యామిలీ టైమ్‌ని చాలా మిస్ అయిన నాలాంటివాళ్లకు ఓ అదృష్టంలా అనిపించింది’’ అన్నారు ప్రియమణి. గడచిన సంవత్సరం గురించి, లాక్‌డౌన్ ఎలా సాగింది? అనే విషయాల గురించి ప్రియమణి మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ టైమ్ కాస్త దొరికితే బావుండు అని ఆలోచిస్తున్న వాళ్లందరికీ లాక్ డౌన్ రూపంలో దేవుడు వరం ఇచ్చినట్టు అనిపించింది.
నాకు ఫ్యామిలీతో చాలా ఎక్కువ సమయం గడిపే అవకాశం దొరికింది. అలానే చాలా సాధారణమైన జీవితం గడిపే వీలు దొరికింది. కూరగాయలు, వంట సామాన్లు కొనుక్కోవడం, ఇంట్లోనే సినిమాలు చూడటం, ఇంట్లో కావాల్సినంత సమయం గడిపిన తర్వాత మళ్లీ కెమేరా ముందుకు రావడం హ్యాపీగా అనిపించింది. మళ్లీ అన్ని పనులు ప్రారంభమయ్యాయి. అయితే అంతా నార్మల్ అవడానికి మరో ఏడాది పట్టేలా ఉంది’’ అన్నారు. ప్రస్తుతం వెంకటేశ్‌తో ‘నారప్ప’, హిందీలో అజయ్ దేవగణ్‌తో ‘మైదాన్’ సినిమాలు చేస్తున్నారు ప్రియమణి.
Comments
Please login to add a commentAdd a comment