
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ దక్షిణాది దర్శకుడు అట్లీతో ఓ సినిమా చేయనున్నారని ఇటీవల వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఇటీవల అట్లీ చెప్పిన ఫైనల్ కథకు షారుక్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శుక్రవారం ఈ మూవీ సెట్స్‌పై వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా పూణేలో జరిగే షూటింగ్ కోసం శుక్రవారం నయతార, ప్రియమణిలు పమయనమైనట్లు సమాచారం. పుణే ఎయిర్‌పోర్ట్ నుంచి వారిద్దరూ బయటకు వస్తున్న ఫొటోలు నెట్టింట దర్శనమించాయి. దీంతో ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. కాగా ఈ మూవీలో షారుక్ డబుల్ రోల్ పోషించనున్నట్లు తెలుస్తోంది. నయనతార, ప్రియమణిలు కథానాయికలు. ఇదిలా ఉండగా గతంలో ప్రియమణి, షారుక్‌తో చెన్నై ఎక్స్‌ప్రస్‌లో స్క్రిన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే నయనతారకు మాత్రం బాలీవుడ్‌లో ఇది తొలి చిత్రం. ఈ మూవీతో డైరెక్టర్ అట్లీ బాలీవుడ్ అరంగేట్రం చేయనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment