
'ఎవరే అతగాడు' సినిమాతో వెండితెరకు పరిచయమై అనేక చిత్రాలతో అలరించింది ప్రియమణి. అనంతరం కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ప్రియమణి వెబ్ సిరీస్, రియాల్టీ షోలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. తాజాగా ప్రియమణి నటించిన కొత్త సినిమా 'భామాకలాపం'. అభిమన్యు తాడిమేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం కానుంది. ఇదివరకు విడుదల చేసిన ప్రియమణి పోస్టర్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. ఎనిమిది చేతుల్లో ఎనిమిది రకాల పరికరాలను పట్టుకుని గృహిణీగా ఆ పోస్టర్లో కనువిందు చేసింది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఆదివారం విడుదల చేసింది.
టీజర్లో పక్కింటి జరిగే విషయాలు తెలుసుకోవడంలో ఆసక్తి చూపే గృహిణీగా ప్రియమణి కనిపించింది. మన గురించి మనం ఎప్పుడైనా ఆలోచించవచ్చు.. కానీ పక్కవాళ్ల గురించి తెలుసుకుంటే వచ్చే ఆనందమే వేరు అంటూ ప్రియమణి చెప్పే డైలాగ్ చాలా మంది గృహిణీలకు నచ్చేవిధంగా ఉంది. క్రైమ్ థిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 11న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. టీజర్ ఎండింగ్లో 'చాలా డేంజరస్ హౌస్ వైఫ్రా' అని చెప్పడం ఆకట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment