Pushpa: Priyamani Interseting Comments On Samantha Oo Antava Song Deets Inside - Sakshi
Sakshi News home page

Priyamani: సామ్‌ హాట్‌గా కనిపించింది.. ప్రియమణి ఆసక్తికర వ్యాఖ్యలు

Published Mon, Jan 31 2022 11:11 AM | Last Updated on Mon, Jan 31 2022 3:00 PM

Priyamani Interseting Comments On Samantha Oo Antava Song - Sakshi

'ఫ్యామిలీ మ్యాన్‌ 2' వెబ్‌ సిరీస్‌తో బాలీవుడ్‌లో పాపులారిటీ సంపాదించుకుంది ప్రియమణి. సినిమాలు, వెబ్‌ సిరీస్‌తో అభిమానులను అలరిస్తోన్న ఈ నటి తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. హీరోయిన్లు గ్లామర్‌ పాత్రలే చేయాలన్న దానికి కాలం చెల్లింది. పొట్టి బట్టలు వేసుకుని హీరో పక్కన నటిస్తే చాలనుకునే రోజులు పోయాయి. సినిమాలో కథానాయికలకు ప్రాధాన్యం పెరుగుతోంది. అందాన్ని మాత్రమే కాకుండా టాలెంట్‌ను గుర్తిస్తున్నారు. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలొస్తున్నాయి. సమంత ఓ బేబీ, నయనతార నేట్రికన్‌, మాయ సినిమాలను అందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు.

కాలంతో పాటు ప్రేక్షకుల ఆలోచనల్లోనూ మార్పు వస్తోంది. సమంత చేసిన 'ఊ అంటావా ఉఊ అంటావా..' పాట దేశమంతా మార్మోగిపోతోంది. నాకే కాదు నా భర్తకు కూడా ఆ పాటలో సామ్‌ హాట్‌గా కనిపించింది. ఇప్పటికే చాలామంది ఈ పాటను డౌన్‌లోడ్‌ చేసుకుని రీల్స్‌ చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు అని చెప్పుకొచ్చింది ప్రియమణి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement