‘సిరివెన్నెల’ నుంచి జై జై గణేషా సాంగ్‌ | Jai Jai Ganesha Song From Priyamani Sirivennela Movie | Sakshi
Sakshi News home page

‘సిరివెన్నెల’ నుంచి జై జై గణేషా సాంగ్‌

Published Tue, Sep 10 2019 7:06 PM | Last Updated on Tue, Sep 10 2019 7:43 PM

Jai Jai Ganesha Song From Priyamani Sirivennela Movie - Sakshi

లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు తెరకెక్కుతున్న ఈ తరుణంలో ప్రియమణి ముఖ్య పాత్రలో నటిస్తున్న సిరివెన్నెల చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. హారర్‌ మూవీగా రూపొందించిన ఈ మూవీ ట్రైలర్‌ ఆకట్టుకునేలా ఉంది. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాలో సందర్భానుసారంగా వచ్చే వినాయకుడి పాటను నిర్మాతలు విడుదల చేశారు.

శ్రీరామ్‌ తపస్వి రాసిన ఈ పాటను ప్రణతి రావు, రామ్‌సీ, హరి గుంటా శ్రోతల హృదయాలకు హత్తుకునేలా ఆలపించారు. ఈ సినిమాకు కమ్రాన్‌ స్వరాలు సమకూర్చాడు. మహానటి ఫేమ్‌ బేబి సాయి తేజస్విని, కాలకేయ ప్రభాకర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని కమల్‌ బోహ్రా, ఏ ఎన్‌ భాషా, అరిపక రామసీత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ప్రకాశ్‌ పులిజాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement