
వికారాబాద్ అడవుల్లోకి ఎంటరయ్యారు నారప్ప. నెక్ట్స్ పదిహేను రోజులు అక్కడే మకాం అని తెలిసింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేశ్, ప్రియమణి జంటగా నటిస్తున్న చిత్రం ‘నారప్ప’. తమిళంలో ధనుశ్ హీరోగా చేసిన ‘అసురన్’కి ఇది తెలుగు రీమేక్. సురేశ్‌బాబు, కలైపులి యస్. థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ వికారాబాద్ అడవుల్లో ప్రారంభం అయింది. పదిహేను రోజుల పాటు నాన్‌స్టాప్‌గా ఈ షెడ్యూల్ కొనసాగనుంది. కీలక సన్నివేశాలతో పాటు కొన్ని యాక్షన్ సీన్స్ కూడా తెరకెక్కించనున్నారు. ఈ ఏడాది చివరికల్లా సినిమా చిత్రీకరణ పూర్తవుతుందని తెలిసింది. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయా లనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment