
తమిళసినిమా: కోలీవుడ్‌లో పరుత్తివీరన్ త్రంతో నటిగా సత్తా చాటిన నటి ప్రియమణి. ఇక్కడ కొన్ని చిత్రాల్లో నటిం తరువాత టాలీవుడ్‌లోనూ ప్రముఖ కథానాయకిగా రాణించారు. తాజాగా ఈమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ద్విభాషా చిత్రం డీఆర్ 56. శ్రీలక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ ఏఎన్ బాలాజీ సమర్పణలో హరిహర పిక్చర్స్ సంస్థ తమిళం, కన్నడం భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, నిర్మాణ బాధ్యతలను ప్రవీణ్‌రెడ్డి నిర్వహిస్తున్నారు. రాజేష్ ఆనంద్ లీలా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటి ప్రియమణి సీబీఐ అధికారిగా ప్రధాన పాత్ర పోషిస్తోంది.
ఇతర ముఖ్య పాత్రలను ప్రవీణ్, దీపక్ రాజ్‌శెట్టి, రమేష్ భట్, ఎతిరాజ్, వీణా పొన్నప్పా, మంజునాథ్, స్వాతి తదితరులు పోషిస్తున్నారు. రమేష్ శ్రీ తిలక్ ఛాయాగ్రహణం నోబిన్‌బాల్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుత ఇది సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. సమాజంలో జరుగుతున్న పలు ఘటనల ఆధారంగా రూపొందించిన కథా చిత్రం ఇదని చెప్పారు.
వివాహానంతరం ప్రియమణి నటిస్తున్న తొలి తమిళ చిత్రం ఇదేనన్నారు. పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఈ చిత్రాన్ని తమిళం, కన్నడం, మలయాళ కథా చిత్రం ఇదని చెప్పారు. వివాహానంతరం ప్రియమణి నటిస్తున్న తొలి తమిళ చిత్రం ఇదే నన్నారు. పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఈ చిత్రాన్ని తమిళం, కన్నడం, మలయాళం, తెలుగు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 9న విడుదల చేయనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment