ఓటీటీలో దూసుకెళ్తున్న కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ 'విస్మయ'  | Kannada Block Buster Movie Vismaya Successfully Running in In OTT | Sakshi
Sakshi News home page

ఓటీటీలో అలరిస్తున్న ప్రియమణి సస్పెన్స్ థ్రిల్లర్ 'విస్మయ'

Published Wed, Dec 21 2022 9:11 PM | Last Updated on Wed, Dec 21 2022 9:15 PM

Kannada Block Buster Movie Vismaya Successfully Running in In OTT - Sakshi

సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో వచ్చే చిత్రాలకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. కంటెంట్ ఉన్న చిత్రాలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. రొటీన్ కమర్షియల్ చిత్రాల కంటే కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్ సినిమాలనే ప్రేక్షకులు ఆదిరిస్తున్నారు. ఈ క్రమంలోనే కన్నడ నుంచి బ్లాక్ బస్టర్ చిత్రాలు వస్తున్నాయి. ప్రియమణి నటించిన కన్నడ చిత్రం "నన్న ప్రకార" అక్కడ బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఇదే సినిమాను 'విస్మయ' పేరుతో తెలుగులోకి డబ్ చేశారు. ప్రస్తుతం ఈ విస్మయ చిత్రం ఓటీటీలో అందరినీ ఆకట్టుకుంటోంది.

విస్మయ చిత్రంలో డాక్టర్‌గా ప్రియమణి నటించింది. కాంతారా ఫేమ్‌ కిషోర్‌ ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. ఈ చిత్రంలో మూడు కథలు ఒకదానికొకటి అల్లుకుని ఉంటాయి. నగరంలో జరిగే హత్యలను ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో చివర్లో వచ్చే ట్విస్టులు అందరినీ మెప్పిస్తాయి. 

దర్శకుడు వినయ్‌ బాలాజీకి ఇది మొదటి చిత్రమైనా కూడా ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్‌లా తెరకెక్కించారు.  ఈ చిత్రంలో విజువల్స్, ఆర్ఆర్, కెమెరాపనితనం అన్ని హైలెట్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి అర్జున్ రాము సంగీతమందించారు. మనోహర్ జోషి కెమెరామెన్‌గా పని చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement