స్టార్ హీరో రానా, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడూ పూర్తయింది. గతేడాది ఏప్రిల్‌లోనే రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ కరోనా వల్ల వాయిదా పడింది. ఇప్పుడు అన్నీ పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న తరుణంలో విరాటపర్వం థియేటర్లలోకి వచ్చేదెప్పుడన్న ప్రశ్న ఎదురవుతోంది.
అసలు సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో విరాటపర్వం ఓటీటీలోకి రాబోతుందంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ మేరకు ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నిర్మాతలకు దాదాపు రూ.50 కోట్లు ఆఫర్ చేసిందని తెలుస్తోంది. రూ.41 కోట్లు డిజిటల్ రిలీజ్ కోసం, రూ.9 కోట్లు శాటిలైట్ హక్కుల కోసం అందజేస్తామని సదరు ఓటీటీ సంస్థ ముందుకొచ్చినట్లు కథనాలు వెలువడుతున్నాయి.
గతంలోనూ ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుందంటూ ఊహాగానాలు వెలువడగా అవన్నీ వట్టి పుకార్లుగా కొట్టిపారేశాడు డైరెక్టర్. మరి ఈ ఓటీటీ డీల్‌పై దర్శకుడు ఏమని స్పందిస్తాడో చూడాలి! కాగా విప్లవాత్మకమైన ప్రేమకథగా వస్తున్న విరాటపర్వంలో రానా కామ్రేడ్ రవన్నగా నటిస్తున్నాడు. ప్రియమణి ఓ కీలక పాత్రలో నటిస్తోంది. దగ్గుబాటి సురేశ్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందించారు.
చదవండి: చేదు అనుభవాన్ని వెల్లడించిన నటి, ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
Comments
Please login to add a commentAdd a comment