ఎట్టకేలకు కదిలిన విరాటపర్వం, రిలీజ్‌డేట్‌ ప్రకటించనున్న మేకర్స్‌ | Sakshi
Sakshi News home page

Virata Parvam: విరాటపర్వం రిలీజ్‌ డేట్‌ ప్రకటించనున్న మేకర్స్‌

Published Fri, May 6 2022 3:08 PM

Rana Daggubati Virata Parvam Movie Release Date Update Soon - Sakshi

రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడో పూర్తైంది. చిన్నాపెద్ద సినిమాలన్నీ రిలీజ్‌కు రెడీ అవుతున్నా విరాటపర్వం నుంచి మాత్రం ఇంతవరకు ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. నెలలు గడుస్తున్నా ఒక్క అప్‌డేట్‌ కూడా లేకపోవడంతో విరాటపర్వం ఓటీటీలోకి రాబోతుందంటూ ఊహాగానాలు కూడా మొదలయ్యాయి.

తాజాగా ఈ రూమర్లకు చెక్‌ పెట్టేందుకు రెడీ అయ్యింది విరాటపర్వం చిత్రయూనిట్‌. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు రిలీజ్‌ డేట్‌ ప్రకటించనున్నట్లు వెల్లడించింది. దీంతో సోషల్‌ మీడియాలో విరాటపర్వం హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. ఇదిలా ఉంటే విప్లవాత్మకమైన ప్రేమకథగా వస్తున్న విరాటపర్వంలో రానా కామ్రేడ్‌ రవన్నగా నటిస్తుండగా ప్రియమణి ముఖ్య పాత్రలో కనిపించనుంది. ద‌గ్గుబాటి సురేశ్ బాబు సమర్పణలో సుధాక‌ర్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందించారు.

చదవండి: 

Advertisement
 
Advertisement
 
Advertisement