
చేసే ప్రతి క్యారెక్టర్‌లో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని కోరుకునే నటీనటులు రానా, సాయి పల్లవి. ప్రస్తుతం వీరిద్దరు కలిసి చేస్తోన్న చిత్రమే విరాటపర్వం. తాజాగా పూజా కార్యక్రమాలు నిర్వహించి షూటింగ్ మొదలుపెట్టేసింది చిత్రబృందం. తెలంగాణలోని ఓ గ్రామంలో చిత్రయూనిట్ చేస్తోన్న ఫస్ట్ షెడ్యుల్ పూర్తైనట్లు సమాచారం.
ధరిపల్లి అనే గ్రామంలో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇటీవలె ఈ చిత్రం ఫస్ట్ షెడ్యుల్‌ను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రెండో షెడ్యుల్‌ను ప్రారంభించనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ పతాకాలపై డి. సురేష్‌బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించనున్న ఈ సినిమాకు దివాకర్ మణి కెమెరామేన్‌గా పనిచేస్తున్నారు. ‘నీదీ నాదీ ఒకే కథ’ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.
Comments
Please login to add a commentAdd a comment