నీది నాదీ ఒకే కథ చిత్రంలో అందరి ప్రశంసలు అందుకున్న దర్శకుడు వేణు ఊడుగుల తదుపరి చిత్రంగా ‘విరాటపర్వం’ను ఎంచుకున్నాడు. 1990ల నేపథ్యం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రానా, సాయి పల్లవిలు నటిస్తున్నారు. ఇటీవలె చిత్ర షూటింగ్‌ను ప్రారంభించింది యూనిట్.
ఈ మూవీలోని ఓ కీలక పాత్రకు టబును ఎంచుకున్నట్లు, ఆమె కాదన్నాక ఆ క్యారెక్టర్‌ను ప్రముఖ నటి, దర్శకురాలు నందితా దాస్ దగ్గరకు వచ్చిందనే వార్తలు ప్రముఖంగా ప్రచురితమయ్యాయి. అయితే వాటిపై స్పందిస్తూ.. ఒకరి వదులుకున్న పాత్ర మరొకరు చేస్తే తప్పేంటి? నాకు కథ నచ్చింది, నా పాత్ర నచ్చింది అందుకే చేస్తున్నానటంటూ తేల్చిచెప్పింది. హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొన్న నందితా దాస్ మాట్లాడుతూ.. ‘ చాలా కాలం తరువాత తెలుగు మాట్లాడుతున్నా.. కొంచెం కష్టంగా ఉన్నా ఒక్కసారి సెట్‌లోకి వచ్చాక అంతా బాగుంది. నాకు ఎంతో దగ్గరైన పాత్ర ఇది. ఇక్కడి బృందం ప్రొఫెషనల్‌గానే కాకుండా ఎంతో స్నేహంగా ఉంది. సాయి పల్లవి లాంటి టాలెంటెడ్ యాక్టర్‌తో నటించడం చాలా ఆనందంగా ఉంది. రానా కోసం నేను ఎదురుచూస్తున్నా’ను అంటూ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment