Rumours On Virata Parvam Movie: Rana Daggubati Fires On News Website - Sakshi
Sakshi News home page

Rana Daggubati: ఎవడు బ్రో నీకు చెప్పింది..ఓ వెబ్‌సైట్‌పై రానా అసహనం​

Published Tue, Nov 2 2021 2:29 PM | Last Updated on Tue, Nov 2 2021 7:09 PM

Rana Daggubati Fires On A Website Over Rumours On Virata Parvam - Sakshi

Rana Daggubati Respond On Virata Parvam Movie Rumours: హీరో రానా వరుస ప్రాజెక్ట్స్‌తో ఫుల్‌ బిజీగా ఉన్నారు. సినిమా షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ  సోషల్‌ మీడియాలో సైతం యాక్టివ్‌గా ఉంటాడు. ఈ క్రమంలో తనపై వచ్చిన రుమర్స్‌పై ఘాటుగా స్పందిస్తుంటాడు. తాజాగా రానాకు అలాంటి సంఘటనే ఎదురైంది. ఇటీవల తను నటించిన ‘విరాట పర్వం’ మూవీ గురించి ఓ వెబ్‌సైట్‌ రాసిన కథనంపై రానా స్పందించాడు. అంతేగాక ఇలాంటి వార్తలు ఎలా సృష్టిస్తారంటూ సదరు వెబ్‌సైట్‌పై అసహనం వ్యక్తం చేశాడు.

చదవండి: కొన్నిసార్లు కలపడం కంటే వదిలేయడమే బెటర్‌: సామ్‌ ఆసక్తికర వీడియో

ఇంతకి రానాకు కొపం తెప్పించిన ఆ విషయం ఏంటంటే.. ‘విరాట పర్వం’ చిత్రం డైరెక్టర్‌కు, సంగీత దర్శకుడికి మధ్య విభేదాలు తలెత్తాయని, అందుకే ఇంతకాలం పనిచేసిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగారని  రాసుకొచ్చింది. దీంతో సోషల్‌ మీడియాలో ఒక్కసారిగా ఈ వార్త గుప్పుమంది. ఇక అది చూసిన రానా ట్విట్‌ చేస్తూ.. ‘ఎవడు బ్రో నీకు చెప్పింది.. నీ సోది’ అంటూ అసహనం వ్యక్తం చేశాడు. అయితే రానా ట్వీట్‌ చేసిన అనంతరం దీనిని సదరు వెబ్‌సైట్‌ డిలిట్‌ చేయడం గమనార్హం​.

చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్లో అలరించే చిత్రాలివే..

కాగా రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉండగా.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. డిసెంబ‌ర్‌లో ఈ చిత్రం విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇందులో రానా నక్సలైట్‌గా కనిపించబోతున్నాడు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌లో డి.సురేష్ బాబు సమర్పణలో ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ మూవీని నిర్మించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement